ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో రోజురోజుకు ఎన్నో పరిణామాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే అసెంబ్లీలో వైయస్సార్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు పై వ్యక్తిగత దూషణలుచేశారని ఆరోపిస్తూ టిడిపి అధినేత చంద్రబాబునాయుడు శాసనసభ నుంచి వాకౌట్ అయిన సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే సభ నుంచి వెళ్లిపోయిన అనంతరం చంద్రబాబు నాయుడు మీడియా సమావేశంలో మాట్లాడారు.
మీడియాతో మాట్లాడిన చంద్రబాబు నాయుడు తనకు సభలో అవమానం జరిగిందని వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడుతూ ఎంతో అవమానించారని మీడియా ఎదుట చంద్రబాబునాయుడు కన్నీటిపర్యంతమయ్యారు. ఈ క్రమంలోనే ఈ విషయంపై నందమూరి కుటుంబం మీడియా ముందుకు వచ్చింది.
ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ శాసనసభలో రాజకీయాల గురించి మాట్లాడాలి కానీ వ్యక్తిగత దూషణలు గురించి మాట్లాడటం సబబు కాదని వివరించారు. వైయస్సార్ ప్రభుత్వం వ్యక్తిగత అజెండాగా పెట్టుకొని ఇలా దూషించడం సరికాదని ఆయన వెల్లడించారు.
ప్రస్తుతం జరుగుతున్న అరాచకాలకు ప్రజలు నోటితో కాకుండా ఓటుతో బుద్ధి చెప్పాలని బాలకృష్ణ పేర్కొన్నారు. ప్రజాసమస్యలు పలు అంశాలపై పోరాటం చేయాలని దివంగత నేత ఎన్టీరామారావు చెప్పారని ఆయన మాటలను గుర్తు చేసుకున్నారు. అసలు చంద్రబాబు గురించి అలా విమర్శించడంతో మనం అసెంబ్లీలో ఉన్నామా లేకపోతే ఏదైనా గొడ్ల చావడిలో ఉన్నామా అంటూ ఈ సందర్భంగా మీడియా ఎదుట బాలకృష్ణ వైసిపి నేతలపై ఫైర్ అయ్యారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…