నిన్న అసెంబ్లీ లో వైఎస్ఆర్ సీపీ నాయకులు, టిడిపి నాయకుల మధ్య జరిగిన ఘటన రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలోనే ఈ ఘటనపై పలువురు రాజకీయ నేతలు స్పందించారు. అలాగే అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు తన భార్యను అవమానించారని మీడియా ఎదుట కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ ఘటనపై ఇప్పటికే నందమూరి బాలకృష్ణ స్పందించగా తాజాగా జూనియర్ ఎన్టీఆర్ కూడా స్పందించారు.
ఈ క్రమంలోనే ఎన్టీఆర్ మాట్లాడుతూ నిన్న అసెంబ్లీలో జరిగిన ఘటన తనను ఎంతగానో కలిచివేసిందని ఎన్టీఆర్ స్పష్టం చేశారు.అయితే తాను ఒక కుటుంబ సభ్యుడిగా మాట్లాడటం లేదని ఒక దేశ పౌరుడిగా మాట్లాడుతున్నానని తెలియజేసిన ఎన్టీఆర్ స్త్రీలపట్ల పరుషంగా మాట్లాడటం అరాచక పరిపాలనకు నాంది పలుకుతుంది అంటూ ఎన్టీఆర్ వ్యాఖ్యానించారు.
మనదేశంలో స్త్రీలను గౌరవించడం సంస్కృతి అని ఈ అరాచక పరిపాలనను పక్కనపెట్టి సమస్యలపై పోరాడి రాబోయే తరానికి బంగారు బాట వేయాలని ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ అసెంబ్లీ ఘటన పై చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
ఈ క్రమంలోనే ఎన్టీఆర్ వ్యాఖ్యలకు పలువురు ఎన్టీఆర్ కు మద్దతుగా నిలబడగా మరికొందరు ఆయన మాటలను వ్యతిరేకిస్తున్నారు. గతంలో కూడా టిడిపి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఈ విధమైనటువంటి ఎన్నో అరాచకాలు జరిగాయని ఎంతో మంది మహిళా ఉద్యోగుల పై దాడులు కూడా జరిగాయని పలువురు ఈ సందర్భంగా గుర్తు చేశారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…