Tag Archives: poona kaur

Ap Cm: ఏపీ సీఎం పై ప్రశంసలు కురిపించిన నటి పూనమ్.. పోస్ట్ వైరల్!

Ap Cm: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పట్ల ఇప్పటికే ఎంతోమంది రాజకీయ నాయకులు ప్రశంసలు కురిపించిన సంగతి మనకు తెలిసిందే. ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించారని ఈయన పరిపాలన విధానంపై ఎంతో మంది ప్రశంసల వర్షం కురిపించారు.

ఇక త్వరలోనే మరోసారి ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ మొత్తం రాజకీయ వేడి రాజుకుంది ఇలాంటి తరుణంలోనే ప్రముఖ వివాదాస్పద నటి పూనమ్ సోషల్ మీడియా వేదికగా ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ప్రశంసిస్తూ చేసినటువంటి పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.

సినిమాలలో నటిస్తూ గుర్తింపు పొందడం కంటే ఈమె సోషల్ మీడియా వేదికగా వివాదాస్పద పోస్టులు చేస్తూ పెద్ద ఎత్తున వార్తలలో నిలిచారు. ఇలా వివాదాస్పద పోస్టుల ద్వారా ఫేమస్ అయినటువంటి పూనం ఇటీవల పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి ఎన్ని సీట్లు కేటాయించారనే విషయం తెలియడంతో ఏకంగా కుక్క ఫోటోని షేర్ చేస్తూ చేసినటువంటి పోస్ట్ వైరల్ గా మారింది.

ఇకపోతే కరోనా సమయంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయాలు చేపట్టిన పాలన గురించి పూనమ్ ప్రశంసలు కురిపిస్తూ ట్వీట్ చేశారు. కొవిడ్ మహామ్మారి విజృభించిన సమంయలో చేనేత కార్మికులకు వైసీపీ అండగా నిలిచిందని, వారి కోసం చాలా మంచి పనులు చేసిందని ఆమె ట్విటర్ లో పోస్టు చేసింది.

చేనేత కార్మికులకు అండగా..
ఇక చేనేత కార్మికుల సమస్యలపై క్రియాశీలకంగా పనిచేసే కార్యకర్తగా తాను చెబుతున్నానని ఇది ఒక గొప్ప విషయమని ఈ సందర్భంగా పూనమ్ ఏపీ ముఖ్యమంత్రి పరిపాలన విధానంపై చేసినటువంటి ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.