Tag Archives: President

Manchu Vishnu: నటుడు విశ్వక్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన మా అధ్యక్షుడు.. ఏమన్నారంటే?

Manchu Vishnu: గత మూడు రోజుల నుంచి సినిమా ఇండస్ట్రీలో ఏదైనా హాట్ టాపిక్ ఉంది అంటే అది విశ్వక్ సేన్, యాక్షన్ హీరో అర్జున్ సినిమా వివాదమే అని చెప్పాలి. మొదటిసారి అర్జున్ సొంత నిర్మాణంలో ఆయన దర్శకత్వంలో తన కుమార్తెను తెలుగు తెరకు పరిచయం చేయబోతున్నారు. యంగ్ హీరో విశ్వక్ హీరోగా తన కుమార్తెను హీరోయిన్ గా తెలుగు పరిశ్రమకు పరిచయం చేయాలన్న ఉద్దేశంతో అర్జున్ ఈ సినిమా పనులన్నింటినీ పూర్తి చేశారు.

ఈ సినిమా షూటింగ్ ప్రారంభమవుతుందన్న సమయంలో విశ్వక్ సినిమా నుంచి తప్పుకోవడంతో ఈ విషయం పెద్ద ఎత్తున వివాదంగా మారింది. ఈ క్రమంలోనే అర్జున్ ప్రెస్ మీట్ లు పెట్టడం అర్జున్ వ్యాఖ్యలకు విశ్వక్ స్పందిస్తూ తన రీజన్స్ తాను వెల్లడించారు.ఇకపోతే ఈ విషయంపై అర్జున్ చాలా సీరియస్ అవ్వడమే కాకుండా తన సినిమా నుంచి తప్పుకోవడం అంటే తన గౌరవాన్ని కించపరిచినట్లనీ భావించినటువంటి ఈయన నటుడు విశ్వక్ పై మా అధ్యక్షుడు మంచు విష్ణుకు ఫిర్యాదు చేసినట్టు తెలుస్తుంది.

ఈ క్రమంలోనే మంచు విష్ణు సైతం ఈ విషయంపై స్పందిస్తూ నటుడు విశ్వక్ పై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. మీలాంటి ఒక సీనియర్ హీరోని ఇబ్బంది పెట్టినటువంటి ఆ యంగ్ హీరోను అసలు వదిలిపెట్టనని మంచు విష్ణు చెప్పినట్టు సమాచారం. అసలు సమస్య ఏంటి ఈ సినిమా నుంచి తప్పుకోవడానికి గల కారణాలను మంచు విష్ణు తెలుసుకున్నారు.

Manchu Vishnu: విశ్వక్ పై చర్యలకు సిద్ధమైన మా అధ్యక్షుడు…

ఈ సినిమా నుంచి విశ్వక్ తప్పుకోవడానికి చెప్పినటువంటి రీజన్స్ సరైనవా లేదా అని తెలుసుకొని ఆయన హీరో విశ్వక్ పై చర్యలు తీసుకోవడానికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. అయితే ఎలాంటి పరిస్థితులలోనూ అర్జున్ సినిమాని ఆపకుండా ముందుకు తీసుకు వెళ్లడానికి మా అధ్యక్షుడు భరోసా కల్పించారని సమాచారం.ఇలా మంచు విష్ణు నటుడు విశ్వక్ పై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. మరి ఈ విషయం ఇక్కడితో ఆగుతుందా లేకపోతే ఎలాంటి వివాదాలకు దారితీస్తుందో తెలియాల్సి ఉంది.

Manchu vishnu: బుల్లితెర కార్యక్రమంలో సందడి చేసిన మా ప్రెసిడెంట్.. వైరల్ అవుతున్న వీడియో!

Manchu vishnu: వెండితెర నటుడిగా మా అధ్యక్షుడిగా ఎంత పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు మంచు విష్ణు. ఈ మధ్యకాలంలో మంచు విష్ణు తరచు ఏదో ఒక విషయం ద్వారా వివాదాలలో నిలుస్తూ ఉంటారు. అయితే ఇలా తరచు వార్తల్లో ఉండే ఈయన తాజాగా బుల్లితెర కార్యక్రమాలలో సందడి చేశారు. జీ తెలుగులో ప్రసారమవుతున్న డాన్స్ ఇండియా డాన్స్ కార్యక్రమంలో భాగంగా విష్ణు ఈ కార్యక్రమంలో సందడి చేశారు.

ఇక ఈ కార్యక్రమానికి హోస్టుగా వ్యవహరిస్తున్నటువంటి అకుల్ బాలాజీ మంచు విష్ణుని వేదికపైకి ఆహ్వానిస్తూ అన్నొచ్చిండు అంటూ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ప్లే చేశారు. సాధారణంగా బుల్లితెర కార్యక్రమాలకు దూరంగా ఉండే మంచు విష్ణు తన సినిమా జిన్నా విడుదల కానున్న నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు నిమిత్తం బుల్లితెర కార్యక్రమంలో సందడి చేశారు.

ఇక ఈ కార్యక్రమానికి మంచు విష్ణు రావడంతోనే కంటెస్టెంట్ రోహిణి వెళ్లి విష్ణుతో కలిసి ఫన్ క్రియేట్ చేశారు. ఈ క్రమంలోనే రోహిణి మాట్లాడుతూ తన పెళ్లికి మీ టెంట్ హౌస్ నుంచి అన్నీ రావాలని అడుగుతుంది రోహిణి ఇలా అడిగేసరికి వెంటనే విష్ణు స్పందిస్తూ నా టెంట్ హౌస్ చేస్తే పెళ్లిళ్లు ఆగిపోతాయంటూ షాక్ ఇవ్వడమే కాకుండా నాకన్నా అందగాళ్ళు చాలామంది ఉన్నారంటూ తనపై పంచ్ వేశారు.

Manchu vishnu: అందుకు సెన్సార్ ఒప్పుకోదు…

ఇక ఈ డాన్స్ షోలో భాగంగా ఓ పెర్ఫార్మెన్స్ అయిపోయిన తర్వాత చీర ప్రాముఖ్యత చెప్పమని అడగగా విష్ణు ఈ విషయం గురించి మాట్లాడుతూ ఇలా పబ్లిక్ లో చీర గురించి చెప్పమని అడిగితే ఏం చెప్పాలి నేను నా ఫాంటసీతో చెప్పానంటే అందుకు సెన్సార్ ఒప్పుకోదు అంటూ ఈయన పన్ క్రియేట్ చేశారు. ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

https://www.youtube.com/watch?v=ddeGaRxH3nI

ఆఫ్ఘనిస్తాన్ ప్రెసిడెంట్ గా తాలిబన్ చీఫ్ అబ్దుల్ ఘనీ!

తాలిబన్లకు ఆఫ్ఘన్ ప్రభుత్వం లొంగిపోయింది. తాలిబాన్లు దురాక్రమణను కొనసాగించి కాబూల్ ను పూర్తిగా స్వాధీనం చేసుకున్నారు. భద్రతా బలగాలు సైతం ఎలాంటి చర్యలకు ఉపక్రమించ లేదు. దీంతో ప్రస్తుత అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ తన పదవికి రాజీనామా చేశారు. అనంతరం తాలిబాన్ చీఫ్ అబ్దుల్ ఘనీ కొత్త ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యారు.

మరోవైపు ఆఫ్ఘన్ ప్రభుత్వ మంత్రులు, అధికారులు ఇతర దేశాలకు పారిపోయారు. సీఎం అశ్రఫ్ ఘనీ సైతం అమెరికాకు పారిపోయినట్లు తెలుస్తోంది. ఆఫ్ఘనిస్తాన్ విడిచి వెళ్లేవారికి ఎలాంటి ఇబ్బందులూ కలిగించమని తాలిబాన్లు స్పష్టం చేశారు. అమెరికా తన రాయబార కార్యాలయం తో పాటు సిబ్బందిని హెలికాప్టర్ల ద్వారా తరలించింది.

కరోనా సమస్య సమసి పోలేదు_ రాష్ట్రపతి రామ్ నాథ్ కొవింద్

75 వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ జాతినుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా దేశ ప్రజలందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు రాష్ట్రపతి. స్వాతంత్ర సమరయోధులను స్మరించుకోవాలని అన్నారు రాష్ట్రపతి.దేశ ప్రజాస్వామ్యానికి పార్లమెంట్ దేవాలయం వంటిదని పేర్కొన్నారు.

కాగా దేశంలో కోవిడ్ సమస్య సమసిపోలేదని అన్నారు రామ్ నాథ్ కోవింద్. దేశ వ్యాప్తంగా 50 కోట్ల పైగా డోసులు పంపిణీ చేశామని స్పష్టం చేశారు. కరోనా ప్రభావం వ్యాపారులు, వలసదారులపై పడిందని చెప్పారు. లాక్‌డౌన్‌ వల్ల ప్రభావితమైన రంగాల ఊతానికి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని పేర్కొన్నారు.