Manchu vishnu: వెండితెర నటుడిగా మా అధ్యక్షుడిగా ఎంత పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు మంచు విష్ణు. ఈ మధ్యకాలంలో మంచు విష్ణు తరచు ఏదో ఒక విషయం ద్వారా వివాదాలలో నిలుస్తూ ఉంటారు. అయితే ఇలా తరచు వార్తల్లో ఉండే ఈయన తాజాగా బుల్లితెర కార్యక్రమాలలో సందడి చేశారు. జీ తెలుగులో ప్రసారమవుతున్న డాన్స్ ఇండియా డాన్స్ కార్యక్రమంలో భాగంగా విష్ణు ఈ కార్యక్రమంలో సందడి చేశారు.
ఇక ఈ కార్యక్రమానికి హోస్టుగా వ్యవహరిస్తున్నటువంటి అకుల్ బాలాజీ మంచు విష్ణుని వేదికపైకి ఆహ్వానిస్తూ అన్నొచ్చిండు అంటూ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ప్లే చేశారు. సాధారణంగా బుల్లితెర కార్యక్రమాలకు దూరంగా ఉండే మంచు విష్ణు తన సినిమా జిన్నా విడుదల కానున్న నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు నిమిత్తం బుల్లితెర కార్యక్రమంలో సందడి చేశారు.
ఇక ఈ కార్యక్రమానికి మంచు విష్ణు రావడంతోనే కంటెస్టెంట్ రోహిణి వెళ్లి విష్ణుతో కలిసి ఫన్ క్రియేట్ చేశారు. ఈ క్రమంలోనే రోహిణి మాట్లాడుతూ తన పెళ్లికి మీ టెంట్ హౌస్ నుంచి అన్నీ రావాలని అడుగుతుంది రోహిణి ఇలా అడిగేసరికి వెంటనే విష్ణు స్పందిస్తూ నా టెంట్ హౌస్ చేస్తే పెళ్లిళ్లు ఆగిపోతాయంటూ షాక్ ఇవ్వడమే కాకుండా నాకన్నా అందగాళ్ళు చాలామంది ఉన్నారంటూ తనపై పంచ్ వేశారు.
ఇక ఈ డాన్స్ షోలో భాగంగా ఓ పెర్ఫార్మెన్స్ అయిపోయిన తర్వాత చీర ప్రాముఖ్యత చెప్పమని అడగగా విష్ణు ఈ విషయం గురించి మాట్లాడుతూ ఇలా పబ్లిక్ లో చీర గురించి చెప్పమని అడిగితే ఏం చెప్పాలి నేను నా ఫాంటసీతో చెప్పానంటే అందుకు సెన్సార్ ఒప్పుకోదు అంటూ ఈయన పన్ క్రియేట్ చేశారు. ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…