Categories: FeaturedMovie News

Bigg Boss6: ఏం పీకావ్ అంటూ ఆదిరెడ్డి పై ఓ రేంజ్ లో ఫైర్ అయిన నాగార్జున.. అసలేమైందంటే?

Bigg Boss6:బుల్లితెరపై ప్రసారమవుతున్నటువంటి బిగ్ బాస్ కార్యక్రమం నేటితో నాలుగవ వారం పూర్తి కానుంది.21 మంది కంటెస్టెంట్లతో ప్రారంభమైన ఈ కార్యక్రమం ఇప్పటికే మూడు వారాలను పూర్తి చేసుకొని ముగ్గురు కంటెస్టెంట్లు ఎలిమినేట్ గాక నేడు మరొక కంటెస్టెంట్ బిగ్ బాస్ హౌస్ వీడనున్నారు.ఈ క్రమంలోనే వారం రోజులపాటు టాస్కులు గొడవలు అంటూ ఎంతో హాట్ హాట్ గా ఈ కార్యక్రమం కొనసాగగా శని ఆదివారం మాత్రం నాగర్జున కంటెస్టెంట్లతో ముచ్చటిస్తూ వారి చేసిన తప్పులను ఎత్తిచూపుతుంటారు.

ఇక ఆదివారం సండే ఫన్డే అంటూ కంటెంట్లతో సరదాగా ఆటలు ఆడిస్తూ ఒక కంటెస్టెంట్ ను బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు తీసుకు వస్తారు. ఈ క్రమంలోనే శనివారం నాగార్జున కంటెస్టెంట్లతో ముచ్చటించారు. అయితే వారం రోజులపాటు ఎవరు ఎలాంటి తప్పు చేశారనే విషయం గురించి ప్రస్తావిస్తూ వారందరికీ బాగా క్లాసు పీకినట్టు తెలుస్తోంది.

ఈ క్రమంలోనే బాలాదిత్య చాలా కోపంగా ఉన్నారంటూ వెటకారంగా మాట్లాడిన నాగార్జున అలాగే బిగ్ బాస్ దత్తపుత్రిక గీత గురించి ఫన్నీ కామెంట్ చేశారు.ఇకపోతే ఫుడ్ విషయంలో ఆర్జే సూర్య చేసిన విషయం మనకు తెలిసిందే. ఈయన ఫుడ్ తినకుండా తన ప్లేట్ తీసుకెళ్లి డస్ట్ బిన్ లో పడేశారు. ఈ క్రమంలోనే నాగార్జున ఆర్జే సూర్యుని నిలబెట్టి మరి తనకి క్లాస్ తీసుకున్నారు.

Bigg Boss6: ఈవారం ఎలిమినేట్ అయ్యేది తానేనా…

గతవారం బిగ్ బాస్ కెప్టెన్ గా వ్యవహరించినటువంటి ఆదిరెడ్డికి సైతం నాగార్జున చేత చివాట్లు తప్పలేదు.ఈ క్రమంలోనే నాగార్జున ఆదిరెడ్డితో మాట్లాడుతూ ఫుడ్ విషయంలో తాను ఎవరికి పనిష్మెంట్ ఇవ్వను ఎందుకంటే బిగ్ బాస్ లో తక్కువ ఫుడ్ ఉందనీ చెప్పావు కదామరి ఈ వారం కెప్టెన్ గా నువ్వు ఏం పీకావు అంటూ పెద్ద ఎత్తున ఆదిరెడ్డి పై నాగార్జున ఫైర్ అయ్యారు. మొత్తానికి ఒక్కో కంటెస్టెంట్ పై ఒక్కో తప్పుని చూపిస్తూ నాగార్జున సభ్యులకు బాగానే వార్నింగ్ ఇచ్చారని తెలుస్తోంది. బిగ్ బాస్ నుంచి ఈవారం ఆరోహి బయటకు రానున్నట్లు వార్తలు వస్తున్నాయి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 week ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago