Manchu Vishnu: గత మూడు రోజుల నుంచి సినిమా ఇండస్ట్రీలో ఏదైనా హాట్ టాపిక్ ఉంది అంటే అది విశ్వక్ సేన్, యాక్షన్ హీరో అర్జున్ సినిమా వివాదమే అని చెప్పాలి. మొదటిసారి అర్జున్ సొంత నిర్మాణంలో ఆయన దర్శకత్వంలో తన కుమార్తెను తెలుగు తెరకు పరిచయం చేయబోతున్నారు. యంగ్ హీరో విశ్వక్ హీరోగా తన కుమార్తెను హీరోయిన్ గా తెలుగు పరిశ్రమకు పరిచయం చేయాలన్న ఉద్దేశంతో అర్జున్ ఈ సినిమా పనులన్నింటినీ పూర్తి చేశారు.
ఈ సినిమా షూటింగ్ ప్రారంభమవుతుందన్న సమయంలో విశ్వక్ సినిమా నుంచి తప్పుకోవడంతో ఈ విషయం పెద్ద ఎత్తున వివాదంగా మారింది. ఈ క్రమంలోనే అర్జున్ ప్రెస్ మీట్ లు పెట్టడం అర్జున్ వ్యాఖ్యలకు విశ్వక్ స్పందిస్తూ తన రీజన్స్ తాను వెల్లడించారు.ఇకపోతే ఈ విషయంపై అర్జున్ చాలా సీరియస్ అవ్వడమే కాకుండా తన సినిమా నుంచి తప్పుకోవడం అంటే తన గౌరవాన్ని కించపరిచినట్లనీ భావించినటువంటి ఈయన నటుడు విశ్వక్ పై మా అధ్యక్షుడు మంచు విష్ణుకు ఫిర్యాదు చేసినట్టు తెలుస్తుంది.
ఈ క్రమంలోనే మంచు విష్ణు సైతం ఈ విషయంపై స్పందిస్తూ నటుడు విశ్వక్ పై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. మీలాంటి ఒక సీనియర్ హీరోని ఇబ్బంది పెట్టినటువంటి ఆ యంగ్ హీరోను అసలు వదిలిపెట్టనని మంచు విష్ణు చెప్పినట్టు సమాచారం. అసలు సమస్య ఏంటి ఈ సినిమా నుంచి తప్పుకోవడానికి గల కారణాలను మంచు విష్ణు తెలుసుకున్నారు.
ఈ సినిమా నుంచి విశ్వక్ తప్పుకోవడానికి చెప్పినటువంటి రీజన్స్ సరైనవా లేదా అని తెలుసుకొని ఆయన హీరో విశ్వక్ పై చర్యలు తీసుకోవడానికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. అయితే ఎలాంటి పరిస్థితులలోనూ అర్జున్ సినిమాని ఆపకుండా ముందుకు తీసుకు వెళ్లడానికి మా అధ్యక్షుడు భరోసా కల్పించారని సమాచారం.ఇలా మంచు విష్ణు నటుడు విశ్వక్ పై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. మరి ఈ విషయం ఇక్కడితో ఆగుతుందా లేకపోతే ఎలాంటి వివాదాలకు దారితీస్తుందో తెలియాల్సి ఉంది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…