Tag Archives: rainy season

వర్షాకాలంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి: FAASI

ప్రస్తుతం కరోనా వైరస్ ఉద్ధృతి కారణంగా ప్రజలు అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. దానికి తోడు వర్షాకాలం ప్రారంభం అవడంతో సర్వసాధారణంగా వచ్చే జలుబు, దగ్గు,జ్వరం వంటి సీజనల్ వ్యాధులతో పాటు మనం తీసుకునే ఆహారం మరియు దోమల ద్వారా వ్యాపించే మలేరియా, కలరా, డెంగ్యూ,డయేరియా,చికన్ గున్యా,టైఫాయిడ్ వంటి వ్యాధులనుఎదుర్కోడానికి ప్రజల ఆరోగ్యంపై మరింత ఎక్కువ దృష్టి పెట్టాల్సిన అవశ్యకత ఎంతైనా ఉందని పలు ఆరోగ్య సంస్థలతోపాటు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రజలను హెచ్చరిస్తున్నారు.

కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నడిచే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా విభాగం సూచనల ప్రకారం వర్షాకాలంలో ఎదురయ్యే సీజనల్ వ్యాధులతో పాటు మనం తీసుకునే ఆహారం వల్ల ఎక్కువ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని వాటి నుంచి రక్షణ పొందడానికి ప్రజలకు అవగాహన కల్పిస్తూ సోషల్ మీడియా వేదికగా కొన్ని సూచనలను ప్రజలకు తెలియజేసింది ఆ చిట్కాలేంటో ఇప్పుడు చూద్దాం.

వర్షాకాలంలో మనం తొందరగా వ్యాధి కారకాలకు గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి వ్యాధినిరోధక శక్తిని పెంచి ఆహారాన్ని తీసుకోవడంతో పాటు కొన్ని ఆరోగ్య సూత్రాలు పాటించాల్సిన అవసరం ఉంటుంది. మొదట మనఇంట్లోనూ ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉండేటట్లు చూసుకోవాలి లేదంటే దోమలు చేరి ప్రమాదకర వ్యాధులకు కారణం కావచ్చు. ప్రతిరోజు వంట చేయడానికి ముందు పాత్రలను శుభ్రం చేసుకోవాలి.వర్షాకాలంలో నిల్వ ఉంచిన ఆహారంలో సూక్ష్మజీవులు త్వరగా పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి సాధ్యమైనంత వరకు తాజా ఆహారాన్ని వేడిగా ఉన్నప్పుడే తినడం మంచిది. యాంటీ వైరల్ యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు కలిగిన ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవాలి.

వాన కాలంలో తప్పని సరిగా కాకరకాయను తినాల్సిందే.. ఎందుకో తెలుసా?

మనకు ఆరోగ్యాన్ని ప్రసాదించడంలో కాకర కాయకు ప్రత్యేక స్థానం ఉంది. కాకరకాయ తినటానికి చేదుగా ఉన్నా మన నిండు జీవితానికి సరిపడా పోషక విలువలు సమృద్ధిగా లభిస్తాయి.ముఖ్యంగా కాకరకాయలో ఉన్న యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు,యాంటీ వైరల్ గుణాలు వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధులను సమర్ధవంతంగా ఎదుర్కొని శరీరానికి అవసరమైన వ్యాధినిరోధక శక్తిని పెంపొందిస్తాయి.

వర్షాకాలంలో కాకరకాయను కేవలం కూర రూపంలోనే కాకుండా జ్యూస్ రూపంలో నైనా వారానికి ఒకసారి తీసుకుంటే సకల వ్యాధులకు సర్వరోగ నివారిణిగా పనిచేసి సీజనల్ గా వచ్చే ప్రమాదకర ఫ్లూజ్వరాల నుంచి రక్షణ కల్పిస్తుంది అంతే కాకుండా కాకరకాయలో ఉండే హైపోగ్లసమిక్ పదార్ధము రక్తంలోని ఇన్సులిన్ స్థాయిని నియంత్రించి మధుమేహ వ్యాధిని అదుపులో ఉంచుతుంది.కాకర గింజలలలో రక్తములో గ్లూకోజ్ ను తగ్గించే చారన్‌టిన్‌ ఇన్సులిన్‌ వంటి పదార్ధము ఉంటుంది .

కాకరకాయలో విటమిన్ బి1, విటమిన్ బి2, విటమన్ బి3, థైయమిన్, క్యాల్సియం, బీట కేరొటిన్ ఉన్నాయి.ఇవి శరీరంలో వివిధ రకాల క్యాన్సర్ కారకాలను సమర్థవంతంగా ఎదుర్కొంటాయి. కాకరకాయలో తక్కువ కెలొరీలూ,ఎక్కువ కార్బొహైడ్రేట్లూ,పీచూ పదార్థం పుష్కలంగా ఉండడంతో జీర్ణశక్తి మెరుగుపడుతుంది. అలాగే రక్తంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి గుండె సంబంధిత వ్యాధులను దూరం చేస్తుంది. ఔషధ గుణాలు కలిగిన కాకరకాయను వారానికి ఒకటి లేదా రెండు సార్లు ఆహారంలో తీసుకోవడం ఎంతో ఉత్తమం.