Tag Archives: rare honor

NTR -Ram Charan: మరో అరుదైన గౌరవం దక్కించుకున్న రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్..?

NTR -Ram Charan: దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్ఆర్ఆర్ విడుదలై సంవత్సరం గడిచింది. అయినప్పటికీ ఆ సినిమా హవా మాత్రం తగ్గటం లేదు. ఇప్పటికీ మన దేశంలో మాత్రమే కాకుండా విదేశాలలో కూడ ఈ సినిమా రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఇక ఈ సినిమాలో నటించిన మన తెలుగు హీరోలకు కూడా అరుదైన గౌరవం లభిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఎంత ప్రతిష్టాత్మకంగా విడుదలైన ఈ సినిమా ఇప్పటికే ఎన్నో అవార్డులు సొంతం చేసుకుంది.

ప్రపంచ సినీ రంగంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించి ఆస్కార్ అవార్డులతో పాటు గోల్డెన్ గ్లోబ్ అవార్డు కూడా దక్కించుకుంది. అలాగే ఎన్నో అవార్డులు సొంతం చేసుకున్న ఈ సినిమాకి తాజాగా మరొక అరుదైన గౌరవం దక్కింది. ఈ విషయాన్ని ఆర్ఆర్ఆర్ టీం తెలియచేసింది. దేశ విదేశాలలో ఆర్ ఆర్ ఆర్ ఉన్న ఫాలోయింగ్ గురించి అందరికీ తెలిసిందే. ఇక జపాన్ లో కొమరం భీం, అల్లూరి సీతారామరాజు ఇప్పటికి ప్రకంపనలు సృష్టిస్తున్నారు.

తాజాగా జపాన్ లో ఆర్ఆర్ఆర్ హీరోలైన రాంచరణ్, ఎన్టీఆర్ లకి అరుదైన గౌరవం లభించింది. జపాన్ లో పాపులర్ మ్యాగజైన్ ఆన్ ఆన్ కవర్ పేజీపై రాంచరణ్,ఎన్టీఆర్ ఫోటోలు ప్రచురించారు. ఇలా జపాన్ లో పాపులర్ మ్యాగజైన్ కవర్ పేజ్ పై మన హీరోల ఫోటోలు రావటం అరుదైన గౌరవం అని చెప్పవచ్చు. ఆన్ ఆన్ కవర్ పేజీ లుక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


NTR -Ram Charan: సంతోషంలో తారక్ చరణ్ ఫాన్స్..

ఇక జపాన్ లో విడుదలైన ఈ ఆర్ ఆర్ ఆర్ సినిమా ఇప్పటికే జపాన్ లో 1 బిలియన్ యెన్ వసూలు చేసింది. అంతే కాకుండా ఇప్పటికీ ఆర్ఆర్ఆర్ సినిమా చూడటం కోసం జపాన్ వాసులు ఎగబడుతున్నారు. రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ సినిమా మన తెలుగు సినిమా గొప్పతనాన్ని ప్రపంచానికి తెలిసేలా చేసింది. ఇక ఈ సినిమాలో ప్రధాన పాత్రలలో నటించిన రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కి కూడా ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు సొంతం చేసింది. ఇక ఎంతో కాలంగా భారతీయ సినిమాకు ఆస్కార్ అవార్డు దక్కాలని ఆశించిన ప్రజలకు ఈ సినిమా ఆస్కార్ అవార్డు దక్కించుకొని ఆ కోరిక నెరవేర్చింది.

Adipurush: అరుదైన గౌరవాన్ని అందుకున్న ప్రభాస్ ఆదిపురుష్… సంతోషంలో తేలిపోతున్న డైరెక్టర్?

Adipurush: ప్రభాస్ హీరోగా పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం ఆదిపురుష్.రామాయణం ఇతిహాసం నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్రలో సందడి చేయగా కృతి సనన్ సీతమ్మ పాత్రలో నటిస్తున్నారు. ఇక బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ రావణాసురుడి పాత్రలో నటిస్తున్నారు. ఇలా ఈ సినిమా ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా కొన్ని పనుల కారణంగా వాయిదా పడతా వస్తుంది.

ఇక ఈ సినిమా వచ్చేయడాది సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదలకు సిద్ధమవుతుంది. అయితే ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసినటువంటి వీడియోలో పోస్టర్లు పెద్ద ఎత్తున వివాదానికి కారణమయ్యాయి.అసలు రాముడికి గడ్డం మీసాలు పెట్టడం ఏంటి హిందువుల పవిత్రంగా భావించే శ్రీరాముడిని ఇలా రూపురేఖలు మార్చి చూపించడంతో చాలామంది విమర్శలు చేశారు.

ఇలా ఎన్నో విమర్శలను ఎదుర్కొన్నటువంటి ఈ చిత్రం మరొక అరుదైన గౌరవాన్ని అందుకుంది. ట్రిబెకా ఫిలిం ఫెస్టివల్ ఈ సినిమా ప్రదర్శనకు ఎంపిక కావడంతో ఈ విషయాన్ని డైరెక్టర్ ఓం రౌత్ సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ సంతోషాన్ని వ్యక్తం చేశారు. సంతోషాన్ని మించిన విషయం ఇది 2023 జూన్ 13వ తేదీ న్యూయార్కులో జరగనున్న ట్రిబెకా ఫిలిం ఫెస్టివల్ లో మన సినిమా ప్రదర్శన కానుండడం ఎంతో సంతోషంగా ఉంది.


Adipurush: సంతోషంలో ప్రభాస్ ఫ్యాన్స్…

ఈ ఫిలిం ఫెస్టివల్ కు ఆది పురుష్ సినిమాను ఎంపిక చేసిన ట్రిబెకా జ్యూరీ సభ్యులకు కృతజ్ఞతలు అలాగే ఆది పురుష్ టీం అందరికీ ధన్యవాదాలు అంటూ ఈయన తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇలా ఈ సినిమా విడుదల కాకముందు ఎన్నో విమర్శలను ఎదుర్కొంది అయితే విడుదల కాకముందు కూడా ఈ సినిమా ఇలాంటి గుర్తింపు అందుకోవడంతో ప్రభాస్ అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Sr.NTR: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ గారికి అరుదైన గౌరవాన్ని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం!

Sr.NTR: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి కేంద్ర ప్రభుత్వం అరుదైన గౌరవాన్ని ప్రకటించింది. నందమూరి తారక రామారావు సినీ రాజకీయ సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఆయన శత దినోత్సవ కార్యక్రమాలలో భాగంగా వంద రూపాయల వెండి నాణెంపై ఎన్టీఆర్ బొమ్మతో విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

పూర్తిగా వెండితో తయారు చేసిన వంద రూపాయల నాణెంపై ఎన్టీఆర్ ప్రతిమ రూపొందించనున్న నాణెం నమూనాను మింట్ అధికారులు మాజీ కేంద్ర మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరికి చూపిస్తూ ఈ నాణెం పై సలహాలు సూచనలు కోరారు. 2022 మే 28వ తేదీ నుంచి ఎన్టీఆర్ గారి శత జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి.

ఇలా ఏడాది పాటు ఈ జయంతి ఉత్సవాలను ఎంతో ఘనంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. సాధారణంగా ఇలాంటి నాణేలపై
చారిత్రక ఘటనలు, , ప్రముఖల గుర్తుగా నాణెలను విడుదల చేస్తుంటారు. ఇక ఎన్టీఆర్ సినిమా రంగంలో మాత్రమే కాకుండా రాజకీయాలలో కూడా ఎంతో మంచి ఆదరణ గుర్తింపు సంపాదించుకున్నారు.

Sr.NTR: సంతోషంలో నందమూరి అభిమానులు….


ఈ క్రమంలోనే ఈయన ప్రతిమతో వెండి నాణెం విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో నందమూరి అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే 1964 నుండి ఇలా నాణెల విడుదల చేయడం ప్రారంభించారు.తొలుత నెహ్రు స్మారకార్ధం నాణెం విడుదల చేశారు.