Tag Archives: raveena tandon

Raveena Tandon: నటుడు అక్షయ్ కుమార్ తో నిశ్చితార్థం రద్దు… అప్పటి విషయాలను గుర్తు చేసుకున్న నటి రవీన టాండన్!

Raveena Tandon: నటి రవీనా టాండన్ పరిచయం అవసరం లేని పేరు ఒకానొక సమయంలో బాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్రతారగా ఓ వెలుగు వెలిగినటువంటి ఈమె ప్రస్తుతం సినిమాలలో కీలక పాత్రలలో నటిస్తూ సందడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే గత ఏడాది విడుదలైన కే జి ఎఫ్ సినిమాలో కీలకపాత్రలో నటించిన రవీనా టాండన్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

ఈ ఇంటర్వ్యూ సందర్భంగా రవీనా టాండన్ మాట్లాడుతూ…గతంలో తాను నటుడు అక్షయ్ కుమార్ తో డేటింగ్ లో ఉన్న విషయం మనకు తెలిసిందే. అయితే వీరి ప్రేమ నిశ్చితార్థం వరకు వెళ్లి చివరికి రద్దయింది. ఈ క్రమంలోనే ఈ విషయాన్ని గుర్తు చేసుకున్నారు. 90s లో మా జోడి హిట్ జోడి అని ఈమె తెలిపారు. అయితే మా పరిచయం ప్రేమగా మారి పెళ్లి వరకు వెళ్లిందని అయితే నిశ్చితార్థం వరకు వెళ్లి ఇద్దరం బ్రేకప్ చెప్పుకున్నామని తెలిపారు.

నిశ్చితార్థం బ్రేకప్ ఎప్పుడు జరిగింది అనేది సరిగా తెలియదు కానీ మేమిద్దరం బ్రేకప్ చెప్పుకొని నేను ఇంకొకరితో డేటింగ్ లో ఉండగా అక్షయ్ కూడా మరొకరితో డేటింగ్ లో ఉన్నారు. ఇలా ఇద్దరం చెరొకరితో డేటింగ్ లో ఉండడం వల్ల ఈ విషయం వల్ల మేం పెద్దగా ఇబ్బంది పడలేదని తెలిపారు. కాలేజీలో వారానికి ఒకబాయ్ ఫ్రెండ్ ని మారుస్తాం కానీ నిశ్చితార్థం క్యాన్సిల్ అయ్యేసరికి అది అలాగే మైండ్ లో ఉండిపోయింది.

Raveena Tandon: ప్రస్తుత కాలంలో బ్రేకప్ సర్వసాధారణం….


ప్రస్తుత కాలంలో ప్రేమలు బ్రేకప్ సర్వసాధారణం ఇలా విడాకులు తీసుకున్న వారు కూడా జీవితంలో ముందుకు వెళ్తున్నారు కనుక అదేం పెద్ద సమస్య కాదని తెలిపారు. ఇక నటి రవినా టాండెన్ బిజినెస్మెన్ అనిల్ తడానిని వివాహం చేసుకున్నారు.ఈమెకు ఇద్దరు సంతానం కాగా అక్షయ్ కుమార్ నటి ట్వింకిల్ ఖన్నాను వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఇద్దరు సంతానం కలరు. అయితే అక్షయ్ కుమార్ తో తన నిశ్చితార్థం బ్రేకప్ గురించి రవీనా టాండన్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Raveena Tandon: నాపై బాడీ షేమింగ్ జరిగింది… ఆ ఒక్క కారణంతోనే అహంకారి అనే ముద్రవేశారు: రవీనా టాండన్

Raveena Tandon: రవీనా టాండన్ పరిచయం అవసరం లేని పేరు. హిందీలో ఎన్నో బ్లాక్‌ బస్టర్‌ సినిమాల్లో నటించి ఉత్తరాది ఆడియెన్స్‌ను ఆమె ఉర్రూతలూగించారు. అందం అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నటువంటి ఈమె తెలుగులో కూడా పరిశ్రమలలో నటించారు. సినిమా ద్వారా కూడా మంచి విజయాన్ని అందుకున్నారు. ఇదిలా ఉండగా తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి నటి రవీనా టాండన్ గతంలో తాను ఎదుర్కొన్నటువంటి బాడీ షేమింగ్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.

తాను కెరియర్ మొదట్లో కాస్త బొద్దుగా ఉండటం వల్ల తన గురించి పెద్ద ఎత్తున బాడీ షేమింగ్ చేశారని తన ప్రైవేట్ పార్ట్స్‌నల్లగా ఉండటం వల్ల వల్గర్ కామెంట్స్ చేశారని ఈ సందర్భంగా ఆమె ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులు గురించి తెలిపారు. ఇకపోతే తాను సినిమాలలో నటించేటప్పుడు అభ్యంతరకరమైన సన్నివేశాలలో అసలు నటించనని తెలిపారు.

ఇప్పటివరకు తన సినీ కెరియర్లో కేవలం రెండు సార్లు మాత్రమే రేప్ సన్నివేశాలలో నటించానని అయితే ఈ సన్నివేశాలలో తన దుస్తులు ఏమాత్రం చెరగకుండా ఎలాంటి అభ్యంతరకరంగా ఉండే విధంగా నటించానని తెలిపారు. అదేవిధంగా కిస్ సన్నివేశాలలోనూ, స్విమ్ సూట్ ధరించడానికి కూడా నో చెప్పేదాన్ని. ఇక పాటలలో కూడా ఏవైనా తనకు నచ్చని డాన్స్ మూవ్మెంట్ ఉంటే చేయనని కరాకండిగా చెప్పేదాన్ని.

Raveena Tandon: ఎన్నో అవకాశాలను కోల్పోయాను…


ఈ విధంగా తాను సినిమాలలో నటించేటప్పుడు ఇలాంటి వాటికి నో చెప్పటం వల్ల చాలామంది ఇదే కారణంగా చూపిస్తూ తన పై అహంకారి అనే ముద్రవేశారని ఈ సందర్భంగా రవీనా టాండన్ వెల్లడించారు. ఇకపోతే ఈ కారణంతోనే చాలా సినిమా అవకాశాలు కూడా తనకు రాకుండా పోయాయని ఈమె తెలియజేశారు.

Raveena Tandon: స్టూడియోలో ఫ్లోర్ శుభ్రం చేసేదాన్ని… కేజిఎఫ్ నటి కామెంట్స్ వైరల్!

Raveena Tandon: కేజిఎఫ్ సినిమా ద్వారా స్టార్ నటిగా మారిపోయిన నటి రవీనా టాండన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.‘ఫత్తర్‌ కే ఫూల్‌’’అనే హిందీ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈమె మొదటి సినిమాతోనే ఫిలింఫేర్ అవార్డు అందుకున్నారు. హిందీతో పాటు తెలుగులో కూడా రథసారధి, బంగారు బుల్లోడు, ఆకాశవీధిలో పాండవులు పాండవులు తుమ్మెద వంటి చిత్రాలలో నటించారు.

Raveena Tandon: స్టూడియోలో ఫ్లోర్ శుభ్రం చేసేదాన్ని… నాలో మోడల్ ను గుర్తించింది అతనే… కేజిఎఫ్ హీరోయిన్ కామెంట్స్ వైరల్!

ఈ విధంగా దక్షిణాది సినిమాల్లోనూ బాలీవుడ్ ఇండస్ట్రీలో నటించిన రవీనాటాండన్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన కేజిఎఫ్ చిత్రం ద్వారా మరింత పాపులారిటీ సంపాదించుకున్నారు. ఇక ఈ సినిమా విజయవంతం కావడంతో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె తను ఇండస్ట్రీలోకి రాకముందు ఎలాంటి పనులు చేసేది అనే విషయాల గురించి ముచ్చటించారు.

Raveena Tandon: స్టూడియోలో ఫ్లోర్ శుభ్రం చేసేదాన్ని… నాలో మోడల్ ను గుర్తించింది అతనే… కేజిఎఫ్ హీరోయిన్ కామెంట్స్ వైరల్!

ఈ ఇంటర్వ్యూ సందర్భంగా రవీనాటాండన్ మాట్లాడుతూ 1990 ముందు వరకు తనకు సినిమాల్లోకి రావాలన్న ఆలోచన రాలేదని తెలిపారు. కాలేజీ చదువుతున్న రోజుల్లో జెనెసిస్‌ పీఆర్‌లో ఇంటర్న్‌షిప్‌కు వెళ్లాను. అక్కడ యాడ్‌ ప్రహ్లాద్‌ కక్కర్‌కు సహాయంగా ఉండటమే కాకుండా స్టూడియోలో పనిచేస్తూ ఫ్లోర్ శుభ్రం చేసే దాన్ని, అలాగే ఎవరైనా వాంతి చేసుకున్న దానిని కూడా శుభ్రం చేసేదాన్ని అని తెలిపారు.

నన్ను మోడల్ చేసింది అతనే…

అక్కడే తన స్నేహితులతో కలిసి పనిచేస్తున్న ఈమెను తన స్నేహితులు ఎన్నోసార్లు చాలా అందంగా ఉన్నావు సినిమాల్లో ట్రై చేయొచ్చు కదా అని చెప్పేవారు. అప్పుడే నాలో ఉన్న మోడల్ ను గుర్తించింది మాత్రం శాంతను షీరే అనే ఫోటోగ్రాఫర్, డైరెక్టర్. అతని నన్ను మోడల్ గా నిలబెట్టారు. ఇలా మోడల్ గా ఉన్న తనకు సినిమా అవకాశాలు వచ్చాయని అయితే తాను సినిమాలు చేయడానికి ఒప్పుకోకపోవడంతో ప్రహ్లాద్‌ కక్కర్‌కు సూచన మేరకు హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టానని ఈ సందర్భంగా రవీనాటాండన్ కి తన గతం గురించి తెలియజేశారు. ప్రస్తుతం ఈమె చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Raveena Tandon: సోదరుడితో లింక్ పెట్టారు.. ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాను రవీనా టాండన్..!

Raveena: సెలబ్రెటీలు ఎక్కడుంటే అక్కడే రూమర్లు స్ప్రెడ్ అవుతుంటాయి. ముఖ్యంగా సినీ తారల విషయంలో ఈ గాసిప్స్ ఎక్కువగా వస్తుంటాయి. ఎవరిని కలిసినా.. ఎవరితో మాట్లాడినా మీడియాలో సెన్సెషన్ అవుతుంటుంది. దీని ఆధారంగా పలు మీడియాలు కథనాలు అల్లేస్తుంటాయి.

అయితే ఇవి కొన్ని సందర్భాల్లో భాగానే ఉన్నా.. ఎక్కువ సందర్భాల్లో వారిని తీవ్ర వేదనకు గురిచేస్తాయి. సినిమా హీరోయిన్లకు ఎవరితో పడితే వారితో సంబంధాలను అంటకట్టి రూమర్స్ స్ప్రెడ్ చేస్తుంటారు.  ఇలాంటి ఘటనే గతంలో బాలీవుడ్ హీరోయిన్ కు రవీనా టాండన్ కు కూడా ఎదుదైంది. గతంలో చాలా సార్లు ఇలా మీడియా వల్ల బాధపడానని ఆమె తెలిపింది.

Raveena Tandon: సోదరుడితో లింక్.. ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాను ప్రముఖ హీరోయిన్..!

తన కోస్టార్స్ తో సంబంధాలను అంటగడుతూ.. చాలా సందర్భాల్లో రూమర్లను స్ప్రెడ్ చేశారని బాధపడింది. చివరకు తన సోదరుడితో కూడా సంబంధాన్ని అంటగట్టారని వాపోయింది. ఓ షూటింగ్ సందర్భంగా తనను దించేందుకు వచ్చిన సోదరుడితో కూడా సంబంధాన్ని అంటగట్టారని.. రవీనా టాండన్ బాయ్ ఫ్రెండ్ ను కనుకున్నామంటూ వార్తలు రాశారని అంది.

హలో చెప్పినా.. దాంట్లో బూతులు వెతుక్కుంటారని..

దీంతో చాలా రోజులు నిద్ర లేని రాత్రులు గడిపానని వెల్లడించింది. మనం హలో చెప్పినా.. దాంట్లో బూతులు వెతుక్కుంటారని జర్నలిస్టుల స్వభావాన్ని వెల్లడించింది.  పేంద్ర, ఆకాశ వీధిలో వంటి సినిమాలో తెలుగు తెరకు కూడా రవీనాటాండన్ పరిచయం అయింది. ఎక్కువగా బాలీవుడ్ లోనే సినిమాలు చేయడంతో టాలీవుడ్ లో పెద్దగా సినిమా చేయలేదు. చివరి సారిగా తెలుగులో మోహన్ బాబు, మంచువిష్ణు, మనోజ్ కుమార్, హన్సిక నటించిన ‘ పాండవులు పాండవులు తుమ్మెద’ సినిమాలో రవీనా టాండన్ యాక్ట్ చేసింది.

వారి రాజకీయ లబ్ది కోసం ఆర్యన్ బలవుతున్నాడు.. సంచలన వ్యాఖ్యలు చేసిన సీనియర్ నటి!

బాలీవుడ్ బాద్ షా షారుఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో అరెస్టయి ప్రస్తుతం జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న సంగతి మనకు తెలిసిందే. ముంబై తీరంలోని క్రూయిజర్ షిప్ రేవ్ పార్టీ లో డ్రగ్స్ తీసుకుంటున్నట్లు అధికారులకు సమాచారం రావడంతో వెంటనే సోదాలు నిర్వహించడంతో అక్కడ ఆర్యన్ ఖాన్ ఉండడంతో అతనిని అధికారులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.

ఆర్యన్ ఖాన్ అరెస్టు కావడంతో ఒక్కసారిగా బాలీవుడ్ ఇండస్ట్రీ షాక్ కి గురైంది. అయితే ఈ విషయం తెలిసిన వెంటనే ఎంతో మంది షారుక్ ఖాన్ ను కలిసి తనకు మద్దతు తెలిపారు. ప్రస్తుతం జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న ఆర్యన్ ఖాన్ బెయిల్ ను కూడా కోర్టు నిరాకరించి అతనికి మరికొన్ని రోజులు రిమాండ్ విధించింది.

ఈ క్రమంలోనే ఈ విషయంపై సీనియర్ నటి రవీనాటాండన్ స్పందించారు. ఈ నటి ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ ఆర్యన్ కు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె స్వీట్ చేస్తూ… కేవలం కొందరు సిగ్గు లేని రాజకీయాల కోసం ఒక యువకుడి భవిష్యత్తును నాశనం చేస్తున్నారు. కేవలం వారి సొంత లాభం కోసం తనను ఈ కేసులో ఇరికించి కేసును పక్కదారి పట్టిస్తున్నారని ఈమె ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రస్తుతం రవీనాటాండన్ చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇలా కొందరు షారుక్ తనయుడికి మద్దతు తెలపగా మరికొందరు మాత్రం అతని పై విమర్శలు చేస్తున్నారు. గత శుక్రవారం జరిగిన విచారణలో భాగంగా అతని బెయిల్ ను తిరస్కరించిన కోర్టు అతనికి మరో 14 రోజుల పాటు రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే.