Raveena Tandon: నటి రవీనా టాండన్ పరిచయం అవసరం లేని పేరు ఒకానొక సమయంలో బాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్రతారగా ఓ వెలుగు వెలిగినటువంటి ఈమె ప్రస్తుతం సినిమాలలో కీలక పాత్రలలో నటిస్తూ సందడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే గత ఏడాది విడుదలైన కే జి ఎఫ్ సినిమాలో కీలకపాత్రలో నటించిన రవీనా టాండన్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.
ఈ ఇంటర్వ్యూ సందర్భంగా రవీనా టాండన్ మాట్లాడుతూ…గతంలో తాను నటుడు అక్షయ్ కుమార్ తో డేటింగ్ లో ఉన్న విషయం మనకు తెలిసిందే. అయితే వీరి ప్రేమ నిశ్చితార్థం వరకు వెళ్లి చివరికి రద్దయింది. ఈ క్రమంలోనే ఈ విషయాన్ని గుర్తు చేసుకున్నారు. 90s లో మా జోడి హిట్ జోడి అని ఈమె తెలిపారు. అయితే మా పరిచయం ప్రేమగా మారి పెళ్లి వరకు వెళ్లిందని అయితే నిశ్చితార్థం వరకు వెళ్లి ఇద్దరం బ్రేకప్ చెప్పుకున్నామని తెలిపారు.
నిశ్చితార్థం బ్రేకప్ ఎప్పుడు జరిగింది అనేది సరిగా తెలియదు కానీ మేమిద్దరం బ్రేకప్ చెప్పుకొని నేను ఇంకొకరితో డేటింగ్ లో ఉండగా అక్షయ్ కూడా మరొకరితో డేటింగ్ లో ఉన్నారు. ఇలా ఇద్దరం చెరొకరితో డేటింగ్ లో ఉండడం వల్ల ఈ విషయం వల్ల మేం పెద్దగా ఇబ్బంది పడలేదని తెలిపారు. కాలేజీలో వారానికి ఒకబాయ్ ఫ్రెండ్ ని మారుస్తాం కానీ నిశ్చితార్థం క్యాన్సిల్ అయ్యేసరికి అది అలాగే మైండ్ లో ఉండిపోయింది.
ప్రస్తుత కాలంలో ప్రేమలు బ్రేకప్ సర్వసాధారణం ఇలా విడాకులు తీసుకున్న వారు కూడా జీవితంలో ముందుకు వెళ్తున్నారు కనుక అదేం పెద్ద సమస్య కాదని తెలిపారు. ఇక నటి రవినా టాండెన్ బిజినెస్మెన్ అనిల్ తడానిని వివాహం చేసుకున్నారు.ఈమెకు ఇద్దరు సంతానం కాగా అక్షయ్ కుమార్ నటి ట్వింకిల్ ఖన్నాను వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఇద్దరు సంతానం కలరు. అయితే అక్షయ్ కుమార్ తో తన నిశ్చితార్థం బ్రేకప్ గురించి రవీనా టాండన్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…