Rocking Rakesh: జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో రాకింగ్ రాకేష్ కిరాక్ ఆర్పీ వంటి వాళ్ళు ఒకరు అయితే మల్లెమాల వారితో మనస్పర్ధలు కారణంగా ఆర్పీ ఈ కార్యక్రమం నుంచి బయటకు వచ్చి జబర్దస్త్ కార్యక్రమం అలాగే మల్లెమాల వారి పై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఇలా ఎన్నో వివాదాలు ఎదుర్కొన్న అనంతరం ఈయన బుల్లితెర కార్యక్రమాలకు దూరమయ్యారు.
ప్రస్తుతం బుల్లితెర కార్యక్రమాలకు దూరంగా ఉన్నటువంటి ఆర్పీ బిజినెస్ రంగంలోకి అడుగుపెట్టారు. ఈ క్రమంలోనే హైదరాబాదులో నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు అనే కర్రి పాయింట్ నిర్వహిస్తూ అతి తక్కువ సమయంలోనే బిజినెస్ లో ఎంతో సక్సెస్ అయ్యారు. అయితే గత కొంతకాలంగా ఈయన రెస్టారెంట్ గురించి నెగిటివ్ రివ్యూలు వస్తున్న సంగతి తెలిసిందే.
ఇలా తన రెస్టారెంట్లో ఫుడ్ ఏమాత్రం టేస్ట్ గా లేదంటూ నెగిటివ్ రివ్యూ రావడంతో ఈ వార్తలపై స్పందించిన ఆర్పీ కొందరు ఉద్దేశపూర్వకంగానే తన చేపలు పులుసు పై కుట్ర చేస్తున్నారని ఇదంతా పెయిడ్ బ్యాచ్ పనే అంటూ ఈయన ఈ వార్తలపై స్పందించారు. ఎవరెన్ని కుట్రలు చేసినా నీతిగా నిజాయితీగా చేస్తున్న తన బిజినెస్ ను దెబ్బతీయలేరని తెలిపారు.
ఇదిలా ఉండగా తాజాగా మరొక జబర్దస్త్ కమెడియన్ రాకింగ్ రాకేష్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే ఈయనకు ఆర్పీ రెస్టారెంట్ గురించి పలు ప్రశ్నలు ఎదురయ్యాయి. ఈ సందర్భంగా రాకేష్ మాట్లాడుతూ ఆర్పీ చేపల పులుసు జబర్దస్త్ పెట్టిన బిక్ష అంటూ కామెంట్లు చేశారు. మరి ఈ మధ్యకాలంలో ఎప్పుడైనా మీరు ఆర్పీను కలిసారా అని అడగడంతో అంత పెద్ద వాళ్లను కలిసే అదృష్టం తనకు ఇంకా రాలేదని మేము ఏదో చిన్న చిన్న ఆర్టిస్టులం వాళ్లు పెద్దవాళ్లు అంటూ పరోక్షంగా ఆర్పీ పై విమర్శలు చేశారు. దీంతో రాకేష్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…