Movie News

Prudhvi Raj: వెనుక నుండి వాటేసుకుంటూ మళ్ళీ అడ్డంగా దొరికిపోయిన పృథ్వీరాజ్… జబర్దస్త్ తన్మయితో రొమాంటిక్ డాన్స్!

Prudhvi Raj: ఇండస్ట్రీలో హీరో హీరోయిన్లతో పాటు ఇతర నటీనటులు కూడా మంచి గుర్తింపు పొందారు. ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది కమెడియన్లుగా మంచి గుర్తింపు పొందారు. ఇలా కమెడియన్ గా గుర్తింపు పొందిన వారిలో పృధ్వీ కూడా ఒకరు. 30 ఇయర్స్ ఇన్ ఇండస్ట్రీ అంటూ ఒకే ఒక్క డైలాగ్ తో ఫేమస్ అయిన పృద్వి ఎన్నో సినిమాలలో విలన్ గా కమేడియన్ గా నటించి మంచి గుర్తింపు పొందాడు.

ఇలా నటుడిగా గుర్తింపు పొందిన పృద్వికి జగన్ ప్రభుత్వం టిడిడి చైర్మన్ గా పదవీ బాధ్యతలు అప్పగించింది. అయితే అక్కడ సిబ్బందితో పృద్వి తప్పుగా ప్రవర్తించడంతో ఆ పదవి నుండి తొలగించారు. దానికి సంబంధించిన ఆడియో కూడా లీక్ అయ్యింది.
ఇలా ఆడియో లీక్ అవటంతో పృద్వి అనేక విమర్శలు ఎదుర్కొన్నాడు. ఇక తాజాగా పృధ్వీ చేసిన పనికి మరొకసారి వార్తల్లో నిలిచాడు.

తాజాగా జబర్దస్త్ ఆర్టిస్ట్ తన్మయితో రీల్ వీడియోలో పృధ్వీ హంగామా చేశాడు. ఈ వీడియోలో ‘మాస్టారు మాస్టారు.. నా మనసుని గెలిచారు’ అంటూ సాగే ఈ పాటకు తన్మయిని పట్టుకుని రొమాంటిక్‌గా స్టెప్పులు వేయటానికి పృధ్వీ ప్రయత్నం చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇలా ఈ వీడియో బయటకి రావడంతో దీనిపై కూడా నెటిజన్స్ వివిధ రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

Prudhvi Raj: మరోసారి అడ్డంగా దొరికిపోయిన పృథ్వీరాజ్…


ఈ క్రమంలో ‘వెనుక నుంచి గట్టిగా వాటేసుకోవటంలో నీ తర్వాతే ఎవరయినా’, ‘వెనక నుంచి పట్టుకున్నది ఈవిడనేనా?’, ‘మీ ఈడు జోడు బాగుంది’ అంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు. ఇలా ఈ వీడియో ద్వారా పృధ్వి మరొకసారి అందరి ముందు అడ్డంగా దొరికిపోయాడు. గతంలో వచ్చిన విమర్శల కారణంగా సినిమా ఇండస్ట్రీలో కూడా అవకాశాలు తగ్గాయి. దీంతో వైసిపి ప్రభుత్వం మీద తరచూ విమర్శలు చేస్తూ తన ప్రతీకారం తీర్చుకునే పనిలో ఉన్నాడు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కి మద్దతుగా ఉంటూ జగన్ ప్రభుత్వం మీద విమర్శలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నాడు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago