Balakrishna: నందమూరి నటసింహం బాలకృష్ణ తాజాగా వేద సినిమా ప్రీ రిలీజ్ వేడుకలలో పాల్గొన్నారు. ఈ సినిమా గత ఏడాది కన్నడ భాషలో విడుదల అయ్యి ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమాని ఫిబ్రవరి 9వ తేదీ తెలుగులో విడుదల చేయనున్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్లో ఈ సినిమా వేడుకను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా నందమూరి బాలకృష్ణ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
ఇక ఈ కార్యక్రమంలో భాగంగా నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ..పలు ఆసక్తికరమైన విషయాలను తెలిపారు. ఇక ఈ సినిమాలో శివరాజ్ కుమార్ నటించగా తన భార్య నిర్మాతగా వ్యవహరించారు. ఈ క్రమంలోనే ఆయన శివరాజ్ కుమార్ భార్యపై ప్రశంసలకు కురిపిస్తూ ఇది మహిళా సాధికారతకు నిదర్శనమని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో భాగంగా శివరాజ్ కుమార్ తండ్రి రాజ్ కుమార్, అలాగే ఏఎన్ఆర్ గురించి కూడా మాట్లాడుతూ వారిని తాను బాబాయి అని పిలిచే వారీననీ తెలిపారు. ఇక రాజ్ కుమార్ ఎన్టీఆర్ గార్లకు జన్మించడం తాము చేసుకున్న అదృష్టమని తెలిపారు. ఇక వారసత్వాన్ని తీసుకెళ్లడం అంటే ఎంతో కష్టంతో కూడుకున్న పని అని, అయితే వారి పేరు చెప్పుకొని ఎక్కువ కాలం ఇండస్ట్రీలో కొనసాగలేమని తెలిపారు.
ఒక సినిమా ద్వారా వారసత్వాన్ని మాత్రమే తీసుకెళ్లకుండా తమకుంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు. ఈ విషయంలో రాజ్ కుమార్ ముగ్గురు సోదరులు విజయం సాధించారని తెలిపారు.ఇక దివంగత నటుడు పునీత్ రాజ్ కుమార్ గురించి మాట్లాడుతూ ఆయన మన మధ్య ఉన్న లేకపోయినా ఆయన స్థానం ఎప్పటికీ తనదేనని తెలిపారు. ఒక చిన్న పని చేసిన ఆర్పాటంగా చెప్పుకునే ప్రస్తుత కాలంలో ఎన్నో మంచి పనులు చేసిన పునీత్ ఎలాంటి ఆర్భాటాలు చేయలేదని ఈ సందర్భంగా పునీత్ రాజ్ కుమార్ ను గుర్తు చేసుకున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…