బాలీవుడ్ బాద్ షా షారుఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో అరెస్టయి ప్రస్తుతం జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న సంగతి మనకు తెలిసిందే. ముంబై తీరంలోని క్రూయిజర్ షిప్ రేవ్ పార్టీ లో డ్రగ్స్ తీసుకుంటున్నట్లు అధికారులకు సమాచారం రావడంతో వెంటనే సోదాలు నిర్వహించడంతో అక్కడ ఆర్యన్ ఖాన్ ఉండడంతో అతనిని అధికారులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.
ఆర్యన్ ఖాన్ అరెస్టు కావడంతో ఒక్కసారిగా బాలీవుడ్ ఇండస్ట్రీ షాక్ కి గురైంది. అయితే ఈ విషయం తెలిసిన వెంటనే ఎంతో మంది షారుక్ ఖాన్ ను కలిసి తనకు మద్దతు తెలిపారు. ప్రస్తుతం జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న ఆర్యన్ ఖాన్ బెయిల్ ను కూడా కోర్టు నిరాకరించి అతనికి మరికొన్ని రోజులు రిమాండ్ విధించింది.
ఈ క్రమంలోనే ఈ విషయంపై సీనియర్ నటి రవీనాటాండన్ స్పందించారు. ఈ నటి ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ ఆర్యన్ కు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె స్వీట్ చేస్తూ… కేవలం కొందరు సిగ్గు లేని రాజకీయాల కోసం ఒక యువకుడి భవిష్యత్తును నాశనం చేస్తున్నారు. కేవలం వారి సొంత లాభం కోసం తనను ఈ కేసులో ఇరికించి కేసును పక్కదారి పట్టిస్తున్నారని ఈమె ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రస్తుతం రవీనాటాండన్ చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇలా కొందరు షారుక్ తనయుడికి మద్దతు తెలపగా మరికొందరు మాత్రం అతని పై విమర్శలు చేస్తున్నారు. గత శుక్రవారం జరిగిన విచారణలో భాగంగా అతని బెయిల్ ను తిరస్కరించిన కోర్టు అతనికి మరో 14 రోజుల పాటు రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…