Tag Archives: sensational decision

ఏపీ ప్రజలకు శుభవార్త .. సంచలన నిర్ణయం తీసుకున్న జగన్ ప్రభుత్వం..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యుత్ వినియోగదారులకు శుభవార్త చెప్పింది. ఇంధన సర్దుబాటు ఛార్జీలను ( ట్రూ-అప్ ఛార్జీలను)నవంబర్ నెలలో వసూలు చేశారు. వాటిని డిసెంబర్ లో వచ్చే బిల్లులో నవంబర్ నెలకు సంబధించి రిఫండ్ ఛార్జీలను సర్దుబాటు చేసి.. డిసెంబర్ లో బిల్లులను వినియోగదారులకు పంపిస్తామన్నారు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. విద్యుత్ వినియోగదారుల నుంచి వసూలు చేసిన ట్రూ-అప్ ఛార్జీలను తిరిగి చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) నిర్ణయించింది. ఇందుకు సంబంధించి డిస్కమ్‌లకు కమిషన్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. డిస్కమ్‌లు ఈ ఏడాది సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో వినియోగదారుల నుండి మొత్తం సేకరించాయి.

మెజారిటీ సంస్థలు, సంఘాలే కాకుండా అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ మినహా అన్ని రాజకీయ పార్టీలు ట్రూ-అప్ ఛార్జీల వసూలును వ్యతిరేకించాయి. కోవిడ్ సంక్షోభం కారణంగా ప్రజలు ఇప్పటికే తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని ఎత్తి చూపుతూ వారు APERCకి అభ్యర్థనలను సమర్పించారు. ట్రూ-అప్ ఛార్జీలను వసూలు చేసే ఆలోచనను విరమించుకోవాలన్నారు.

దీనిలో భాగంగానే.. ఏపీఎస్పీడీసీఎల్‌ పరిధిలో నవంబర్‌ నెల బిల్లుల నుంచే ట్రూ అప్‌ ఛార్జీలను వినియోగదారులకు తిరిగి వెనక్కి చెల్లిస్తూ సర్దుబాటు ప్రక్రియ ప్రారంభించారు. ఏపీఈపీడీసీఎల్‌ డిసెంబర్‌ నుంచి చేపట్టింది. ఈ నిర్ణయంతో రాష్ట్రంలో 1.86 కోట్ల మంది వినియోగదారులకు ఊరట లభించింది. సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సిహెచ్. బాబురావు ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని.. తమ కృషికి మంచి ఫలితాలు వచ్చాయన్నారు.

పోసాని పై టాలీవుడ్ ఇండస్ట్రీ సంచలన నిర్ణయం.. ఐదు సంవత్సరాల పాటు నిషేధం?

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ పబ్లిక్ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో భాగంగా పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పై చేసిన వ్యాఖ్యలకు సినీ నటుడు వైసీపీ నాయకుడు పోసాని మురళి కృష్ణ పవన్ కళ్యాణ్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ క్రమంలోనే పోసాని చేసిన వ్యాఖ్యలకు పవన్ కళ్యాణ్ అభిమానులు తనని బూతులు తిడుతున్నారని, తన భార్యను ఎంతో అవమానకరమైన మాటలు మాట్లాడుతున్నారని ప్రెస్ మీట్ పెట్టి మరి పవన్ కళ్యాణ్ పై ఆగ్రహం వ్యక్తం చేశాడు.

ఈ క్రమంలోనే పోసాని పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యుల గురించి అసభ్యంగా మాట్లాడటం తీవ్ర దుమారం రేపింది. ఈ విషయంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పలువురు సినీ సెలబ్రిటీలు అభిమానులు పోసాని పై విరుచుకుపడ్డారు. ఈ క్రమంలోనే పోసాని ఇంటిపై పవన్ అభిమానులు దాడి చేశారంటూ పోసాని ఆరోపించారు. ఇదిలా ఉండగా పోసాని మురళి కృష్ణ పవన్ కళ్యాణ్ పై చేసిన వ్యాఖ్యలకు నిర్మాతలు సైతం విసుగు చెందుతున్నారు.

ఇక ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మా ఎలక్షన్లు జరుగుతున్న నేపథ్యంలో మా అధ్యక్షత పదవికి పోటీ చేసిన వారు సైతం పోసాని వ్యాఖ్యలను ఖండించారు. సినిమా ఇండస్ట్రీలో అందరు ఐక్యంగా ఉండాల్సిన సమయంలో ఇలా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం వల్ల ఇండస్ట్రీ పరువుపోతుంది అంటూ తెలియజేశారు.

లేకపోతే పోసాని పవన్ కళ్యాణ్ పై చేసిన ఆరోపణలకు కాను అతనిపై చిత్ర పరిశ్రమ చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం.ఈ క్రమంలోనే అతనికి ఐదు సంవత్సరాల పాటు ఇండస్ట్రీ నుంచి నిషేధం చేయాలని పలువురు నిర్మాతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితేపోసాని పై అధికారికంగా చర్యలు తీసుకుంటారా లేకపోతే అనధికారికంగా అతనికి ఏ విధమైనటువంటి అవకాశాలు రాకుండా చేస్తారా అనేది తెలియాల్సి ఉంది. మరి మా అధ్యక్ష ఎన్నికలు జరిగిన తర్వాత టాలీవుడ్ పోసాని పై ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి.

ఆ ఉత్తరంతో చలించిపోయిన ఏంజెలినా జోలి.. ఆఫ్ఘాన్ ల కోసం నిలబడిన నటి.. !

బాహ్య ప్రపంచానికి, వివాదాలకు దూరంగా ఉంటూ.. హాలీవుడ్​ కు చెందిన ప్రఖ్యాత నటి ఏంజెలినా జోలి కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఆమె పలువురు సెలెబ్రెటీలకూ ఆమె రోల్​మోడల్ గా ఉంది. ఇప్పటి వరకు తనకు ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ కూడా లేదు. అయితే ఆమె ఇన్​స్టాగ్రామ్​ అకౌంట్​ తెరిచి సంచలన ప్రకటన చేసింది. ఇలా చేయడానికి గల కారణం ఓ ఉత్తరం. ఓ ఉత్తరం ఆమెను కదిలించి అకౌంట్ ను ఓపెన్ చేయించిందని తెలిపింది.

ఇంతకీ ఆ ఉత్తరంలో ఏముందంటే.. తాను ఆఫ్టనిస్థాన్ లో ఉద్యోగం చేసేదానిని అని.. తాలిబన్ల రాకతో ఉద్యోగం పోయి రోడ్డున పడ్డానని.. మాకు హక్కులు ఉండేవని.. తాలిబన్ల రాకతో అంతా తలకిందులు అయిపోయిందని.. ఆ ఉత్తరంలో ఓ యువతి వాపోయింది. వారిని చూసి తాము భయపడుతున్నామని..మా కలలన్నీ నీరుగారిపోయాయని.. ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. తాలిబన్లు మారారని కొందరు చెబుతున్నారు… నేనలా భావించడం లేదు.

ఇప్పుడు మా జీవితాలు చీకటి మయమయ్యాయి. స్వేచ్ఛను కోల్పోయాం. మళ్లీ మేం బందీలైపోయాం.. అంటూ ఆమె కన్నీటితో వ్యాఖ్యలను రాసినట్లు రాసింది. అంతే ఉత్తరం చదివి చలించిపోయింది ఏంజెలినా. అయితే దీనిపై సోషల్ మీడియా వేదికగా పోరాడతానని.. వారి గళాన్ని ప్రపంచానికి వినిపిస్తానని హాలీవుడ్‌ నటి ఏంజెలినా జోలి అన్నారు. దీని కోసమే ఆమె సోషల్ మీడియాలో ఖాతా తెరిచారు. అఫ్ఘనిస్తాన్ వాసులు తమ బాధలను పంచుకోవడినికే ఈ ఖాతాను అంకితం ఇస్తున్నట్లు ఆమె తెలిపారు.

దీని ద్వారా ఆ దేశ పౌరుల బాధలను ప్రపంచానికి తెలియజేస్తానని తెలిపారు. అయితే ఆమె ఇన్‌స్టాలో ఖాతా ప్రారంభించిన వెంటనే ఏంజెలినా జోలికి 68 లక్షల మంది ఫాలోవర్లు రాగా.. తొలి పోస్టుకి 29 లక్షల లైక్స్‌ రావడం విశేషం. వాళ్ల ఆగడాలకు నాంది ఇక్కడ నుంచే మొదలైందంటూ.. కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

ఇక అందరికీ గుడ్ బై అంటూ.. బండ్ల గణేష్ సంచలన నిర్ణయం..

టాలీవుడ్ లో ఒక కమెడియన్ గా తన కెరీర్ ను మొదలు పెట్టి ఇప్పుడు బడా నిర్మాతగా మారిన బండ్ల గణేష్ గురించి అందరికీ తెలిసిందే. అయితే అతను ఈ మధ్య రాజకీయాల్లో కూడా కాస్తంత హడావుడి కూడా చేశాడు. అయితే ఆ హడావుడిలోనే అతనికి విమర్శలు కూడా వచ్చాయి.

ఇక సోషల్ మీడియాలో అయితే అతనిపై ట్రోల్స్ విపరీతంగా చేశారు. అయితే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే బండ్ల గణేష్ ఓ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. తన జీవితం ఎప్పుడూ కాంట్రవర్సీకి గురవ్వడంత తనకు ఇష్టం లేదని అతడు ఓ ట్వీట్ చేశాడు.. ఇక ముందు తన ట్విట్టర్ అకౌంట్ కు గుడ్ బై చెప్పేస్తాను.

తనకు ఎలాంటి కాంట్రవర్సీలు వద్దు. నా జీవితంలో కాంట్రవర్సీ లకు తావివ్వకుండా జీవించాలని అనుకుంటున్నట్లు వివరణ ఇచ్చాడు. దీంతో ఒక్కసారిగి అతడి ఫాలోవర్స్ షాక్ తిన్నారు. ఏమైంది అంటూ రీట్వీట్ చేశారు. అయితే అతని నుంచి మాత్రం ఎలాంటి సమాధానం రాలేదు. గత కొన్నిరోజుల క్రితం బండ్ల గణేష్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు సంబంధించిన ఫోటోలను పోస్ట్ చేస్తూ దేవర అని సంబోధించిన విషయం తెలిసిందే.

త్వరలోనే పవన్ కళ్యాణ్ తో సినిమా కూడా చేయబోతున్నట్లు అతడు క్లారిటీ కూడా ఇచ్చాడు. అయితే ఇలా సడన్ గా ఈ ట్వీట్ చేయడానికి గల కారణం మాత్రం నెటిజన్లకు అర్థం కావట్లేదు. ఇది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అతడు చేసిన ఈ ట్వీట్ తెగ వైరల్ అయిపోయింది.

కేంద్రం సంచలన నిర్ణయం.. పురుషులకు శిశు సంరక్షణ సెలవులు..?

కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. పురుష ఉద్యోగులు సైతం శిశు సంరక్షణ సెలవులు తీసుకునే అవకాశం కల్పించింది. కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ సహాయమంత్రి జితేంద్రసింగ్‌ ఈ మేరకు కీలక ప్రకటన చేశారు. విడాకులు తీసుకున్న వాళ్లు, పెళ్లి అయినా భార్య చనిపోయిన వాళ్లు, ఒక్కరే పేరెంట్ గా ఉన్నవాళ్లు తమ పిల్లల ఆలనాపాలనా చూసుకోవాల్సి వస్తే శిశు సంరక్షణ సెలవులు తీసుకోవచ్చని కేంద్రం వెల్లడించింది.

తప్పనిసరిగా పిల్లల బాధ్యతలు చూసుకోవాల్సిన తండ్రులకు ఈ నిర్ణయం మేలు చేస్తుందని కేంద్రం చెబుతోంది. కేంద్రం నిర్ణయం ద్వారా సింగిల్‌ పేరెంట్‌ పురుష ఉద్యోగులు 365 రోజుల సెలవులకు 80 శాతం జీతాన్ని పొందవచ్చు. సాధారణంగా ఉద్యోగులకు పర్యాటక సెలవుల ప్రయోజనాలు లభిస్తాయనే సంగతి తెలిసిందే. కేంద్రం శిశు సంరక్షణ సెలవులో ఉన్న పురుషులు సైతం పర్యాటక సెలవుల ప్రయోజనాలను పొందవచ్చు.

పిల్లలు శారీరక లేదా మానసిక సమస్యలతో బాధ పడుతుంటే పిల్లలకు 22 సంవత్సరాలు వచ్చే వరకు శిశు సంరక్షణ సెలవులు పెట్టుకునే అవకాశం ఉంది. అయితే కేంద్రం తాజాగా ఈ నిబంధనలను పూర్తిస్థాయిలో సవరించింది. కేంద్రం పురుషులకు చైల్డ్ కేర్ లీవులను ప్రకటించడంపై ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పిల్లల ఆలనాపాలనా చూసుకునే తండ్రులకు ఈ నిర్ణయం ద్వారా ప్రయోజనం చేకూరనుంది.

గత కొన్నేళ్ల నుంచి పురుష ఉద్యోగులలో కొందరు పురుష ఉద్యోగులు చైల్డ్ కేర్ లీవులను మంజూరు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. చైల్డ్ కేర్ లీవులు లేకపోవడం వల్ల పిల్లల ఆలనాపాలనా చూసుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతున్నయని తెలుపుతున్నారు. కేంద్రం పురుష ఉద్యోగుల విజ్ఞప్తులను పరిశీలించి ఈ నిర్ణయం తీసుకుంది.

విద్యార్థుల సెలవుల విషయంలో జగన్ సర్కార్ సంచలన నిర్ణయం..?

ప్రపంచ దేశాలను గజగజా వణికిస్తున్న కరోనా మహమ్మారి వల్ల గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సంవత్సరం విద్యారంగంలో కీలక మార్పులు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. కార్పొరేట్, ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలు చాలా నెలల నుంచే ఆన్ లైన్ క్లాసుల ద్వారా పాఠాలు చెబుతుండగా జగన్ సర్కార్ నవంబర్ 2వ తేదీ నుంచి పాఠశాలలను తెరిచేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్రంలోని పాఠశాలలన్నీ నవంబర్ 2 నుంచి రీఓపెన్ కానున్నాయి.

విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ నవంబర్ నెలంతా హాఫ్ డే స్కూళ్లు నిర్వహిస్తారని.. ప్రతిరోజు పావుగంట సమయం కరోనా సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి టీచర్లు విద్యార్థులకు బోధిస్తారని తెలిపారు. కరోనా, లాక్ డౌన్ ఇప్పటికే విద్యార్థులు నాలుగున్నర నెలల పనిదినాలను నష్టపోయిన నేపథ్యంలో సంక్రాంతి, వేసవి సెలవులను తగ్గిస్తున్నట్టు వెల్లడించారు. అయితే ప్రభుత్వం తల్లిదండ్రులు అనుమతిస్తేనే పిల్లలు పాఠశాలలకు రావాలని సూచిస్తోంది.

నెల రోజులపాటు పాఠశాలలను నిర్వహించిన తరువాత పరిస్థితులకు అనుగుణంగా జగన్ సర్కార్ తరగతుల నిర్వహణ విషయంలో ముందుకెళ్లనుంది. కరోనా వైరస్ పై ప్రజల్లో గతంతో పోలిస్తే భయం తగ్గినా వైరస్ ఉధృతి కొనసాగుతున్న నేపథ్యంలో స్కూళ్లు, కాలేజీల నిర్వహణ కోసం ప్రభుత్వం రెండు రోజుల్లో ప్రత్యేక మార్గదర్శకాలను విడుదల చేయడానికి సిద్ధమవుతోంది.

స్కూళ్లు తెరిచిన తరువాత కొన్ని రోజుల పాటు పరిస్థితులను పూర్తిస్థాయిలో సమీక్షించనుంది. టాస్క్‌ఫోర్స్‌ కమిటీల ఏర్పాటు ద్వారా జిల్లా స్థాయిలో స్కూళ్లలో పరిస్థితులను పరిశీలించనున్నారు. విద్యార్థులు కరోనా వైరస్ సోకకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు చెబుతున్నారు.

జగన్ మరో సంచలన నిర్ణయం.. వాళ్లకు 5 లక్షల రూపాయలు..!

తెలుగు రాష్ట్రాలను గత కొన్ని రోజులుగా వర్షాలు గజగజా వణికిస్తున్నాయి. ఏపీలో భారీ వర్షాలు, వరదల వల్ల లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా తూర్పుగోదావరి లాంటి జిల్లాల్లో పరిస్థితి ఇప్పటికీ అదుపులోకి రాలేదు. పలు ప్రాంతాల్లో వరదల వల్ల కొంతమంది మృతి చెందారు. తెలంగాణతో పోలిస్తే మృతుల సంఖ్య తక్కువగానే ఉన్నా చనిపోయిన వారి కుటుంబాలు పడుతున్న ఆవేదన అంతాఇంతా కాదు. దీంతో మృతుల కుటుంబాలను ఆదుకోవడానికి జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.

రాష్ట్రంలో వరదల వల్ల చనిపోయిన వారి కుటుంబాలకు 5 లక్షల రూపాయల పరిహారం అందించాలని అధికారులను జగన్ ఆదేశించారు. రాష్ట్రంలో వర్షాలు, వరదల వల్ల రైతులు భారీగా నష్టపోయారని ఈ నెల 31వ తేదీలోపు పంటనష్టం అంచనా వేయాలని అధికారులకు సూచించారు. యుద్ధ ప్రాతిపదికన ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలను చేపట్టాలని.. బాధితులకు నిత్యావసర సరుకుల పంపిణీ వేగంగా జరగాలని చెప్పారు.

నేడు కలెక్టర్లు, ఎస్పీలు, ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించిన జగన్ సమావేశం సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. కరోనా వైరస్, భారీ వర్షాలు, వరదలు, నాడు నేడు, ఇతర అంశాల గురించి సీఎం జగన్ ప్రధానంగా చర్చించారు. ఇళ్లు కూలిన వారికి తక్షణమే సహాయం అందే విధంగా చర్యలు చేపట్టాలని.. కలెక్టర్లు ఇళ్లు కూలిన వారి విషయంలో మానవతా దృక్పథంతో వ్యవహరించాలని అన్నారు.

చనిపోయిన వాళ్ల కుటుంబాలకు పరిహారం అందే విధంగా కలెక్టర్లే చర్యలు చేపట్టాలని తెలిపారు. ఈ నెల 31వ తేదీలోపే బడ్జెట్ ప్రతిపాదనలు కూడా పూర్తి కావాలని చెప్పారు. వరద బాధిత ప్రాంతాల్లో విద్యుత్ పునరుద్ధరణ వేగంగా జరిగేలా కృషి చేసిన కలెక్టర్లను సీఎం అభినందించారు.

జియో సంచలన నిర్ణయం.. 2,500 రూపాయలకే స్మార్ట్ ఫోన్..?

దేశీయ టెలీకాం రంగంలో జియో సృష్టించిన సంచలనాలు అన్నీఇన్నీ కావు. జియో రాకతో దేశంలోని ప్రజలకు అనేక ప్రయోజనాలు కలిగాయి. ఒకప్పుడు 1 జీబీ డేటా కోసం 100 రూపాయలకు పైగా ఖర్చు చేయాల్సి ఉండగా జియో తక్కువ ధరకే ఉచిత కాల్స్, డేటాకు ఛార్జీలను వసూలు చేస్తూ టెలీకం రంగంలో అంతకంతకూ ఎదుగుతోంది. అనంతరం జియో ఫోన్ల ద్వారా టెలీకాం రంగంలో జియో మరో సంచలనం సృష్టించింది.

ఫీచర్ ఫోన్లు అయిన జియో ఫోన్లలో కూడా వాట్సాప్, యూట్యూబ్ లను అందుబాటులోకి తెచ్చి జియో ఫీచర్ ఫోన్ల విక్రయాల్లో ఇతర కంపెనీలతో పోలిస్తే ఎక్కువ మార్కెట్ ను సొంతం చేసుకుంది. రోజురోజుకు ప్రజల్లో స్మార్ట్ ఫోన్ వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో జియో మరో సంచలన నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. గతంలోనే జియో స్మార్ట్ ఫోన్ ను అందుబాటులోకి తెస్తామని కీలక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే.

అయితే ఆ స్మార్ట్ ఫోన్ ధర అందరూ 4,000 రూపాయలకు అటూఇటుగా ఉంటుందని భావించారు. అయితే జియో మాత్రం అంతకంటే తక్కువ ధరకే స్మార్ట్ ఫోన్ ను అందుబాటులోకి తీసుకొస్తూ ఉండటం గమనార్హం. జియో కంపెనీ ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ జియో సంస్థ 2,500 రూపాయల నుంచి 3,000 రూపాయల లోపు ధరకే స్మార్ట్ ఫోన్ ను అందుబాటులోకి తెస్తున్నట్టు వెల్లడించారు.
అయితే అధికారికంగా ఈ మేరకు ప్రకటన వెలువడాల్సి ఉంది.

2,500 నుంచి 3,000 రూపాయల లోపు స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి వస్తే ఇతర స్మార్ట్ ఫోన్ల అమ్మకాలపై జియో స్మార్ట్ ఫోన్ ప్రభావం తీవ్రంగా పడే అవకాశం ఉంది. అతి త్వరలో జియో స్మార్ట్ ఫోన్ ప్రజలకు అందుబాటులోకి రానుందని సమాచారం.