ప్రపంచ దేశాలను గజగజా వణికిస్తున్న కరోనా మహమ్మారి వల్ల గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సంవత్సరం విద్యారంగంలో కీలక మార్పులు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. కార్పొరేట్, ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలు చాలా నెలల నుంచే ఆన్ లైన్ క్లాసుల ద్వారా పాఠాలు చెబుతుండగా జగన్ సర్కార్ నవంబర్ 2వ తేదీ నుంచి పాఠశాలలను తెరిచేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్రంలోని పాఠశాలలన్నీ నవంబర్ 2 నుంచి రీఓపెన్ కానున్నాయి.
విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ నవంబర్ నెలంతా హాఫ్ డే స్కూళ్లు నిర్వహిస్తారని.. ప్రతిరోజు పావుగంట సమయం కరోనా సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి టీచర్లు విద్యార్థులకు బోధిస్తారని తెలిపారు. కరోనా, లాక్ డౌన్ ఇప్పటికే విద్యార్థులు నాలుగున్నర నెలల పనిదినాలను నష్టపోయిన నేపథ్యంలో సంక్రాంతి, వేసవి సెలవులను తగ్గిస్తున్నట్టు వెల్లడించారు. అయితే ప్రభుత్వం తల్లిదండ్రులు అనుమతిస్తేనే పిల్లలు పాఠశాలలకు రావాలని సూచిస్తోంది.
నెల రోజులపాటు పాఠశాలలను నిర్వహించిన తరువాత పరిస్థితులకు అనుగుణంగా జగన్ సర్కార్ తరగతుల నిర్వహణ విషయంలో ముందుకెళ్లనుంది. కరోనా వైరస్ పై ప్రజల్లో గతంతో పోలిస్తే భయం తగ్గినా వైరస్ ఉధృతి కొనసాగుతున్న నేపథ్యంలో స్కూళ్లు, కాలేజీల నిర్వహణ కోసం ప్రభుత్వం రెండు రోజుల్లో ప్రత్యేక మార్గదర్శకాలను విడుదల చేయడానికి సిద్ధమవుతోంది.
స్కూళ్లు తెరిచిన తరువాత కొన్ని రోజుల పాటు పరిస్థితులను పూర్తిస్థాయిలో సమీక్షించనుంది. టాస్క్‌ఫోర్స్ కమిటీల ఏర్పాటు ద్వారా జిల్లా స్థాయిలో స్కూళ్లలో పరిస్థితులను పరిశీలించనున్నారు. విద్యార్థులు కరోనా వైరస్ సోకకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు చెబుతున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…