Tag Archives: sensational remarks

తనను పోటీ నుంచి చిరంజీవి తప్పుకోమ్మన్నారు.. మంచు విష్ణు!

మూవీ ఆర్టిస్టు అసోషియేషన్ (మా) ఎన్నికలు ముగిశాయి. అధ్యక్షుడిగా మంచు విష్ణు గెలుపొందారు. అతడితో పాటు అతడి ప్యానెల్ సభ్యులు కూడా ఘన విజయం సాధించారు. మా ఎన్నికల ముందు ఎంతో రచ్చ జరిగింది. ఒకరిపై ఒకరు దూషణలు కూడా చేసుకున్నారు. ముగిసిన తర్వాత కూడా విభేదాలు తగ్గినట్లు కనిపించడం లేదు.

అందుకు ప్రకాష్ రాజ్, నాగబాబు, శివాజీ రాజా రాజీనామాలు చేశారు. అయితే మంచు విష్ణు ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే మీడియాతో ముచ్చ‌టించారు. అతడు అక్కడ చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారాయి. అతడు అధ్యక్షుడిగా పోటీ చేస్తున్న సమయంలో తనను ఎన్నికల నుంచి తప్పుకోమని చిరంజీవి చెప్పారని అన్నారు. ప్ర‌కాశ్‌రాజ్ పోటీలో ఉన్నాడు క‌దా, విష్ణుని పోటీ నుంచి త‌ప్పుకోమ‌ని చెప్పొచ్చు క‌దా అని మోహ‌న్ బాబుకు చిరంజీవి చెప్పార‌ని మంచు విష్ణు పేర్కొన్నారు.

కానీ ఎట్టి పరిస్థితిలో ఎన్నికలు జరగాల్సిందే అని నాన్న , తాను అనుకోవడం వల్లనే పోటీలో నిల్చున్నాన‌ని మంచువిష్ణు తెలిపారు. రామ్ చరణ్ అంటే తనకు చాలా ఇష్టం అని.. అతడు తనకు మంచి మిత్రుడు అని.. అతడు తనకు ఓటు వేయలేదనే విషయం తనకు తెలుసు అని చెప్పాడు.

చిరంజీవి మాట ఎప్పుడు రామ్ చరణ్ తప్పడు.. వాళ్ల నాన్న మాట అంటే అతడు అంతాలా పాటిస్తాడు.. అలాగే తాను కూడా నాన్న మాటను జవదాటను అంటూ చెప్పాడు. అందుకు నాన్న తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉన్నాను అంటూ చెప్పుకొచ్చాడు. అయితే నాగబాబు రాజీనామాను తాను ఆమోదించనని.. ఆ రాజీనామాను ఉపసంహరించుకోవాలని అతడు కోరాడు. గెలుపోటములు సహజం అని.. ఆయన అన్నారు.

పాన్ ఇండియా అనడం కాదు.. ఆ సీన్ రాజమౌళిని తీయ మనండి చూద్దాం.. కోట శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు !

తెలుగు సినిమా ఇండస్ట్రీలో విలక్షణ నటుడిగా ఎన్నో సినిమాలలో నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్న నటుడు కోట శ్రీనివాసరావు ఒకరు. ఒకప్పుడు విలన్ పాత్రలో ఎంతో అద్భుతంగా నటించేవారు. ఎంతగా అంటే ఈయనను చూస్తే ఆడవాళ్ళు సైతం భయపడేవారు. అంతగా తన విలనిజాన్ని కళ్ళకు కట్టినట్టు చూపించారు. అయితే ప్రస్తుతం కోట శ్రీనివాసరావు వయసు పైబడటం చేత పెద్దగా అవకాశాలు రాలేదని చెప్పవచ్చు.

ఈ క్రమంలోనే ఒకఇంటర్వ్యూలో పాల్గొన్న కోట శ్రీనివాసరావు నేటితరం సినిమాల గురించి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు.ఈ క్రమంలోనే పాత సినిమాలకు ఈ సినిమాలకు మధ్య ఏదైనా వ్యత్యాసం ఉందా అనే ప్రశ్న ఎదురు కావడంతో అందుకు స్పందించిన కోటశ్రీనివాస్ రావు ఎలాంటి తేడా లేదండి అప్పటి సినిమాలు తల్లిపాలు అయితే ఇప్పటి సినిమాలు డబ్బాపాలు అంతే తేడా ఉందని చెప్పారు.

అప్పటి సినిమాలలో హాస్యం ఉండేది, ఇప్పటి సినిమాలలో కామెడీ ఉంటుంది పెద్ద తేడా ఏమీ లేదు. ఈ క్రమంలోనే ఒకప్పటి సినిమాలకు ఇప్పటి సినిమాల గురించి తెలియజేస్తూ.. బాహుబలి చిత్రాన్ని దర్శకుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. పెద్ద ఎత్తున గ్రాఫిక్స్ ఉండటం ఈ సినిమాకి హైలైట్ అయ్యాయని చెప్పవచ్చు.

అయితే బాహుబలి సినిమా విడుదల ముందు అందరూ ఎంతో ఆతృతగా ఎదురు చూశారు. అయితే ఆ సినిమా విడుదలై మంచి విజయం అందుకుంది. అయితే ఇప్పుడు ఈ సినిమా గురించి పెద్దగా మాట్లాడటం లేదు. కానీ మాయాబజార్ చిత్రం టీవీలో వస్తుంది అంటే ఇప్పటికి కూడా ఆ సినిమా గురించి మాట్లాడుకుంటారు. మాయాబజార్ చిత్రంలో ఉన్నటువంటి కొన్ని సన్నివేశాలను ఈ తరం వారిని తీయమనండి చూద్దాం.. అలాంటి సన్నివేశాలు తీయాలంటే ఇప్పుడు ఎన్ని కోట్లు ఖర్చు చేస్తారు ఇప్పటి తరం వాళ్ళు.. అంటూ నేటి తరం సినిమాల గురించి కోట శ్రీనివాసరావు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

ఆ బాంబు బ్లాస్ట్ వెనుక భారత్ హస్తం ఉందంటూ.. సంచలన వ్యాఖ్యలు చేసిన పాక్!

గత నెల 23న పాకిస్థాన్ లోని లాహోర్ ప్రాంతంలో బాంబ్ బ్లాస్ట్ జరిగిన సంగతి మనకు తెలిసిందే. ఈ బాంబు దాడిలో ముగ్గురు మరణించగా 24 మంది తీవ్రంగా గాయపడినట్లు పాక్ మీడియా సంస్థలు తెలియజేశాయి. అయితే ఈ విధంగా పాకిస్తాన్ లో బాంబు బ్లాస్ట్ కావడానికి ఇండియా పాత్ర ఉందని పాకిస్తాన్ కీలక వ్యాఖ్యలు చేసింది. పాకిస్తాన్ బాంబు దాడి వెనుక ఇండియా హస్తముందని,పాకిస్తాన్ జాతీయ భద్రతా సలహాదారు మోయీద్ యూసుఫ్ ఆరోపించారు. ఆదివారం ఇస్లామాబాద్‌లో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో తెలిపారు.

పాకిస్తాన్ లో జరిగిన ఈ ఘటన భారత ఇంటెలిజెన్స్ సంస్థ ‘రా’ కుట్రలో భాగంగానే ఇదంతా జరిగిందని ఆయన ఆరోపించారు.అయితే ఈ బాంబు ఘటనలో నిందితులను అరెస్టు చేసే వారి దగ్గర నుంచి ఎలక్ట్రానిక్ వస్తువులను స్వాధీనం చేసుకున్నామని, ఆ వస్తువులను ఫోరెన్సిక్ నిపుణులను విశ్లేషిస్తే సంచలన విషయాలు బయట పడ్డాయి ఈ సందర్భంగా యూసఫ్ తెలిపారు.

అయితే ఈ బాంబు దాడి వెనుక ఉన్న వ్యక్తి ఎవరు అతని వివరాలను మాత్రం చెప్పకపోగా త్వరలోనే ఈ దాడి వెనుక ఉన్న వారు ఎవరు అనే విషయాలను పూర్తిగా వెల్లడిస్తామని పేర్కొన్నారు. అయితే ఈ బాంబు 2008వ సంవత్సరంలో ముంబై పేలుళ్ల ప్రధాన సూత్రధారి హఫీజ్ సయీద్ ఇంటి సమీపంలో పేలుడు సంభవించింది.హఫీజ్ఇంటి ముందు గుర్తుతెలియని వ్యక్తులు వాహనాన్ని ఆపి వెళ్లగా కొద్దిసేపటికే బాంబు పేలింది అని ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు. అయితే ఈ ప్రమాదంలో హఫీజ్ తప్పించుకున్నారు.

ముంబై పేలుళ్ల సూత్రధారిగా మారిన హఫీజ్ ను ఇండియాకు మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టు. యూఎస్ జస్టిస్ డిపార్ట్‌మెంట్ కూడా అతడిని టెర్రరిస్ట్‌గా ప్రకటించింది. హఫీజ్ సయీద్‌ తలపై 10 మిలియన్ డాలర్ల రివార్డు కూడా ఉంది. ఐనప్పటికీ అతడికి పాకిస్తాన్ ప్రభుత్వం రక్షణ కల్పిస్తుందని ఇండియాతో పాటు అమెరికా వంటి దేశాలు విమర్శలు గుప్పిస్తున్నాయి.