Tag Archives: Shaun Muttathi

Naatu Naatu Song: డబ్బులు ఇచ్చి ఆస్కార్ కొన్నారు… ఆస్కార్ పై అక్కస్సు వెళ్లగక్కిన బాలీవుడ్.. ఏకిపారేస్తున్న నెటిజెన్స్!

Naatu Naatu Song: ఒక తెలుగు సినిమా అంతర్జాతీయ వేదికపై ఆస్కార్ అవార్డు అందుకోవడాన్ని కొందరు గర్విస్తూ ఉండగా మరికొందరు తమ అసూయను వెళ్ళగకుతున్నారు. ఇలా ఒక తెలుగు సినిమా అంతర్జాతీయ వేదికపై ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ అవార్డు అందుకోవడంతో బాలీవుడ్ మాత్రం ఎలాంటి సంతోషం వ్యక్తం చేయకుండా ఆస్కార్ అవార్డు రావడానికి కూడా తప్పుపడుతున్నారు.

ఈ క్రమంలోనే ప్రముఖ బాలీవుడ్ నటి జాక్వలిన్ ఫెర్నాండిస్ స్నేహితుడు షాన్ ముత్తతిల్ ‘నాటు నాటు’ సాంగ్‌ కు ఆస్కార్‌ రావడంపై నెగటివ్ కామెంట్స్ చేశాడు. ఈ సందర్భంగా ఈయన సోషల్ మీడియా వేదికగా ఆస్కార్ అవార్డు గురించి మాట్లాడుతూ ఇండియాలోనే అవార్డు అమ్ముతారు అనుకున్నాను.. కానీ ఆస్కార్ అవార్డులను కూడా అమ్ముతున్నారు అంతా డబ్బుతోనే జరుగుతుంది. మన దగ్గర డబ్బు ఉంటే ఏదైనా పొందవచ్చు అంటూ ఈయన కామెంట్ చేశారు.

ఇలా తెలుగు సినిమా ఆస్కార్ అవార్డును అందుకోవడంతో ఓర్చుకోలేనటువంటి బాలీవుడ్ సెలబ్రిటీలు ఇలా డబ్బులు ఇచ్చి కొన్నారు అంటూ కామెంట్లు చేశారు. అయితే ఈయన చేసిన ఈ కామెంట్ల పై నేటిజన్స్ స్పందిస్తూ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఒక తెలుగు సినిమా ఇలాంటి అవార్డు అందుకోవడంతో బాలీవుడ్ ఓర్చుకోలేక పోతుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Naatu Naatu Song: కొన్ని అలవాటు సౌత్ ఇండస్ట్రీకి లేదు….

ఇక మరికొందరు ముందు మీరు నటనను నేర్చుకొని అవార్డుల గురించి మాట్లాడండి అంటూ కామెంట్లు చేయగా మరి కొందరు మాత్రం ఇలా అవార్డులను కొనుగోలు చేసే ఆనవాయితీ మీ బాలీవుడ్ సినిమాల మాదిరిగా దక్షణాది సినిమాలకు అలవాటు లేదంటూ తీవ్రస్థాయిలో బాలీవుడ్ ఇండస్ట్రీ పై పలువురు సెలబ్రిటీలపై మండిపడుతూ కామెంట్లు చేస్తున్నారు.