Tag Archives: simhasanam

Actress Mandakini : ఆ రోజుల్లో కుర్రాళ్ళ మతులు పోగొట్టిన “మందాకిని’ నటించిన ఆ రెండు చిత్రాలు బ్లాక్ బస్టర్స్.?!

Actress Mandakini : 1980’s మందాకిని తన అందం అభినయంతో కుర్రాళ్ళ మతులు పోగొట్టింది అనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. “రామ్ తేరీ గంగా మైలీ ” చిత్రం (1985) రాజీవ్ కపూర్ సరసన హీరోయిన్ గా చలనచిత్ర నిర్మాత-దర్శకుడు రాజ్ కపూర్ ద్వారా ఈ చలనచిత్రంలో  మందాకిని తన పాత్రతో ప్రేక్షకులందరినీ తనవైపు తిప్పుకుంది.

ఆ రోజుల్లో ఈ చిత్రం బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది మరియు మందాకిని ఉత్తమ నటిగా ఫిల్మ్‌ఫేర్ నామినేషన్‌ను సంపాదించింది. ఈ సినిమాలోని పాత్రతో ఆమె సంచలనం సృష్టించింది. ఆ తర్వాత ఆమె మిథున్ చక్రవర్తితో డాన్స్ డ్యాన్స్, ఆదిత్య పంచోలితో కహాన్ హై కానూన్ మరియు ప్యార్ కర్కే దేఖో వంటి మరికొన్ని విజయవంతమైన చిత్రాలలో నటించింది.. ఆ తర్వాత తెలుగులో రెండు చిత్రాల్లో నటించారు.


“సింహాసనం” సినిమాకి దర్శకత్వం, నిర్మాత, హీరో అన్ని సూపర్ స్టార్ కృష్ణ గారే వ్యవహరించారు. కృష్ణ సరసన జయప్రద హీరోయిన్ గా నటించారు. బాలీవుడ్ నటి మందాకిని విషకన్య గా బప్పిలహరి స్వరపరిచిన “వహవా నీ యవ్వనం.. పాటలో హీరో కృష్ణ తో స్టెప్పులేసి తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేశారు. ఆ రోజుల్లో ఈ సినిమాను నిర్మించడం కోసం 3.5 కోట్ల రూపాయలు ఖర్చు కాగా సినిమా విడుదలై 5 కోట్లు వసూలు చేసి రికార్డు సృష్టించింది. ఇక ఈ సినిమా 100 రోజుల ఫంక్షన్ చెన్నైలో నిర్వహించారు. 37 సంవత్సరాల క్రితమే “సింహాసనం” చిత్రం ఎన్నో రికార్డులను సృష్టించి అద్భుతమైన విజయాన్ని సాధించింది.

ఆ తర్వాత ఆమె బాలకృష్ణతో మరో సినిమాలో నటించారు. “అనసూయమ్మ గారి అల్లుడు” చిత్రంతో ప్రారంభమైన బాలయ్య కోదండరాంరెడ్డి కాంబిననేషన్ ఎన్నో విజయవంతమయిన చిత్రాలు వీరి కాంబినేషన్ లో వచ్చాయి. అలా “భార్గవరాముడు”1987 లో వచ్చిన సినిమా. జయ ప్రొడక్షన్స్ పతాకంపై, రావు గోపాలరావు సమర్పణలో ఎస్. జయ రామారావు నిర్మించాడు. ఎ.కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించాడు.

ఇందులో నందమూరి బాలకృష్ణ, విజయశాంతి ప్రధాన పాత్రల్లో నటించగా, చక్రవర్తి స్వరపరిచిన బాణీలకు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, జానకి ఆలపించిన “అల్లుకోరా అందగాడా…అనే పాటకు మందాకిని చిందులు,అందాలు కుర్రాళ్ళను కుర్చీలో కూర్చోకుండ చేసాయి.ఆ తర్వాత మందాకిని బాలీవుడ్ లో అనేక చిత్రాల్లో నటించినప్పటికీ తెలుగులో కేవలం “సింహాసనం” “భార్గవరాముడు” చిత్రాల్లో మాత్రమే కనిపించారు.కానీ ఆమె మొదటి సినిమా విజయాన్ని మళ్లీ సృష్టించలేకపోయింది.తన 1996 చిత్రం “జోర్దార్” తర్వాత బాలీవుడ్ పరిశ్రమకు వీడ్కోలు పలకాలని నిర్ణయించుకుంది.

సూపర్ స్టార్ కృష్ణ సింహాసనం సినిమా గురించి ఈ విషయాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు.! అప్పట్లో బాహుబలి రేంజ్..!

సూపర్ స్టార్ కృష్ణ నటించిన ఎన్నో విజయవంతమైన సినిమాలలో “సింహాసనం” సినిమా ఒకటి అని చెప్పుకోవచ్చు.అయితే ఈ సినిమా విడుదలై దాదాపు 35 సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఈ తరం వారికి ఈ సినిమా గురించి బహుశా తెలియకపోయి ఉండొచ్చు.ఈ సినిమాలోని ప్రత్యేకత గురించి తెలిస్తే మాత్రం వెంటనే ఈ సినిమాను చూడకుండా ఉండలేరని చెప్పవచ్చు. మరి కృష్ణ గారు నటించిన “సింహాసనం” సినిమా ప్రత్యేకతలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం…

కృష్ణ సింహాసనం సినిమా దర్శకత్వం, నిర్మాత, ఎడిటర్, హీరో అన్ని సూపర్ స్టార్ కృష్ణ గారే వ్యవహరించారు. అంతేకాకుండా తెలుగులో మొట్టమొదటి 70 ఎంఎం స్టీరియోఫోనిక్‌ సౌండ్‌ సినిమా కూడా ఇదే అని చెప్పవచ్చు. ఈ సినిమా ప్రత్యేకత గురించి సింపుల్ గా చెప్పాలంటే 80 సంవత్సర కాలంలో ఈ సినిమా కూడా ఒక బాహుబలి సినిమా అని చెప్పవచ్చు. సింహాచలం సినిమా వసూళ్ల విషయంలో కానీ, రికార్డుల విషయంలో కానీ బాహుబలి సినిమాకు ఏ మాత్రం తీసిపోదని చెప్పవచ్చు.

ఈ సినిమా విడుదలైన సమయంలో సినిమా టికెట్ల కోసం ప్రేక్షకులు 12 కిలోమీటర్ల మేరా లైన్లో వేచి ఉన్నారంటే ఈ సినిమా ఎంతటి సంచలన విజయాన్ని సృష్టించిందో అర్థమవుతుంది. ఆ రోజుల్లో ఈ సినిమాను నిర్మించడం కోసం 3.5 కోట్ల రూపాయలు ఖర్చు కాగా ఈ కింద 5 కోట్లు వసూలు చేసి రికార్డు సృష్టించింది. ఇక ఈ సినిమా 100 రోజుల ఫంక్షన్ చెన్నైలో నిర్వహించగా కార్యక్రమానికి కృష్ణ అభిమానులు నాలుగు వందల బస్సులలో అక్కడికి చేరుకున్నారు. ఈ విధంగా 35 సంవత్సరాల క్రితమే అద్భుతమైన రికార్డులను సృష్టించిన సినిమా కృష్ణ నటించిన సింహాసనం సినిమా అని చెప్పవచ్చు.