Tag Archives: sr ntr

Chiranjeevi : ఎన్టీఆర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన చిరంజీవి.. అవే నన్ను నా ఫ్యామిలీ ని కాపాడాయంటూ?

Chiranjeevi: టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఈ వయసులో కూడా అదే ఊపుతో సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్నారు మెగాస్టార్. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఆయన వశిష్ట దర్శకత్వంలో రూపొందుతున్న విశ్వంభర సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఆ సంగతి పక్కన పెడితే తాజాగా చిరంజీవి ఎన్టీఆర్ గురించి ఆసక్తికర వాఖ్యలు చేశారు. తాజాగా విశాఖపట్నంలో లోక్ నాయక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ పుణ్య తిథి, ఏఎన్ఆర్ శతజయంతి వేడుకలు జరుగుతున్నాయి.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యారు. ఈ సందర్భంగా చిరంజీవి ఎన్టీఆర్, ఏఎన్నార్ గార్లతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. అయితే ఈ కార్యక్రమంలో చిరంజీవి ఎన్టీఆర్ తో జరిగిన ఒక సంఘటనని, ఆయన ఇచ్చిన ఒక సలహాని గుర్తుచేసుకున్నారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. నేను కెరీర్ లో అప్పుడప్పుడే ఎదుగుతున్నాను. ఒక రోజు ఎన్టీఆర్ గారి దగ్గరికి వెళ్లినప్పుడు రండి బ్రదర్ కూర్చోండి అన్నారు. భయం భయంగా కూర్చున్నాను. అప్పుడు ఆయన ఒక మాట చెప్పారు.

ఎన్టీఆర్ మాటలకు నా మనసు మార్చుకున్నాను..

మీరు సంపాదించిన డబ్బు అంతా ఇనుప ముక్కలు మీద పెట్టొద్దు, ఏదైనా మంచి ఇల్లు కట్టుకోండి. స్థలాల మీద పెట్టుకోండి మనల్ని కాపాడేది అదే అన్నారు. మనం ఎక్కువ కాలం ఇలాగే స్టార్ డమ్ తో ఉంటామని అనుకోకండి అని ఎంతో ముందుచూపుతో చెప్పారు. అప్పటిదాకా నేను మంచి కారు కొనుక్కుందామా, అప్పట్లో వచ్చే స్టైలిష్ టయోటా కారు కొనుక్కుందాం అనుకున్నాను. ఎన్టీఆర్ గారు చెప్పిన తర్వాత ఆ కార్ కొనడం ఆపేసి అక్కడక్కడా స్థలాలు కొనడం మొదలుపెట్టాను ఈ రోజు నా రెమ్యునరేషన్ కంటే కూడా ఆ స్థలాలే నన్ను, నా ఫ్యామిలీని కాపాడుతున్నాయి అని తెలిపారు చిరంజీవి. ఈ సందర్భంగా చిరంజీవి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Sr NTR: ఎన్టీఆర్ రాజకీయ ప్రస్థానానికి పునాది వేసిన నా దేశం.. ఎన్టీఆర్ ను ప్రజానాయకుడిగా మార్చిన సినిమా !

Sr NTR: తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు నందమూరి తారక రామారావు. ఎలాంటి పాత్రలోనైనా ఎంతో అవలీలగా పరకాయ ప్రవేశం చేసి ఎంతో అద్భుతంగా నటిస్తూ ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు.ఇలా సినిమా ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న అన్నగారు రాజకీయాలలో కూడా అదే పేరు ప్రఖ్యాతలు పొందారు. ఇకపోతే ఈయన సినీ కెరియర్ లో ఎన్నో అద్భుతమైన సినిమాలు ఉన్నాయి కానీ ఈయన రాజకీయ ప్రస్తానానికి పునాదిగా నిలిచిన చిత్రం నా దేశం.

ఈ విధంగా ఎన్టీఆర్ నటించిన నా దేశం సినిమా 1982 అక్టోబర్ 27న ప్రేక్షకుల ముందకు వచ్చిన ‘నాదేశం’ 2022 అక్టోబర్ 27 నాటికి 40 సంవత్సరాలు పూర్తి చేసుకుంది.మరి 40 వసంతాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా విశేషాలు ఏమిటి ఈ సినిమా ఎన్టీఆర్ రాజకీయ ప్రస్తానానికి ఏ విధంగా సహాయపడింది అనే విషయానికి వస్తే..

ఎన్టీఆర్ రాజకీయాలలోకి రావాలని భావించిన ఈయన 1982 మార్చి 29న తెలుగుదేశం పార్టీని ప్రకటించారు. ప్రజల్ని చైతన్య పరచడానికి ప్రజలలోకి తన పార్టీని తీసుకు వెళ్లడానికి చాలా తక్కువ సమయం ఉంది ఇలా రాజకీయపరంగా ఎన్టీఆర్ బిజీ అవుతున్న నేపథ్యంలో ఆయనకు కాల్ షీట్స్ ఇచ్చినటువంటి నిర్మాతలు ఆయన ముందు నిలబడి సినిమా చేయాలని అతనిపై ఒత్తిడి తీసుకువచ్చారు.

17 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకున్న నా దేశం…
ఈ క్రమంలోనే బాలీవుడ్ ఇండస్ట్రీలో అమితాబచ్చన్ నటించిన లావారిస్ సినిమా రైట్స్ కొనుగోలు చేసి ఈ సినిమాని తెలుగు నేటివిటీకి అనుకూలంగా పరుచూరి బ్రదర్స్ నా దేశం అనే సినిమాని తయారు చేశారు. కె. బాపయ్య దర్శకత్వంలో… పల్లవి దేవి ప్రొడక్షన్స్ బ్యానర్ లో ఈ సినిమా షూటింగ్ పనులను మొదలు పెట్టింది. ఈ సినిమా 1982 జూలై 22వ తేదీ హైదరాబాదులో షూటింగ్ ప్రారంభించుకొని కేవలం 17 రోజులలో మాత్రమే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది.ఇలా 40 లక్షల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమా ఏకంగా కోట్ల రూపాయల వసూలు రాబట్టింది.

Sr NTR:

ఈ సినిమా విడుదలైన 70 రోజులకు ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ తరఫున ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 10 కేంద్రాలలో నా దేశం సినిమా శత దినోత్సవ వేడుకలను జరుపుకుంది.ఇలా ఎన్టీఆర్ రాజకీయ ప్రస్థానానికి పునాది వేసిన సినిమాలలో నా దేశం సినిమాకి ఎంతో ప్రత్యేకత ఉందని చెప్పాలి. అయితే ఈయన సినీ కెరియర్ లో ఎన్నో ఇలాంటి పొలిటికల్ సినిమాలు వచ్చినప్పటికీ నా దేశం సినిమా మాత్రం ఎంతో ప్రత్యేకమని చెప్పాలి.

Sr NTR Family: నందమూరి కుటుంబానికి శాపంగా మారిన ఆగస్టు నెల.. ఆగస్టు కలిసి రాలేదా?

Sr NTR Family: నందమూరి కుటుంబంలో ప్రస్తుతం విషాదం చోటుచేసుకుంది.నందమూరి తారక రామారావు చిన్న కుమార్తె ఉమామహేశ్వరి సోమవారం మధ్యాహ్నం తన ఇంటిలో ఆత్మహత్య చేసుకున్న విషయం మనకు తెలిసిందే.అయితే ఈమె అనారోగ్య సమస్యల కారణంగా మానసిక ఆందోళనకు గురై ఇలా ఆత్మహత్యకు పాల్పడిందని వార్తలు వస్తున్నాయి. ఈ విధంగా మృతి చెందడంతో ఆ కుటుంబంలో జరిగిన విషాద సంఘటన మరోసారి బయటకు వచ్చాయి.

సీనియర్ ఎన్టీఆర్ కి నలుగురు కుమారులు నలుగురు కుమార్తెలు సంతానం. అయితే వీరిలో మొదటి కుమారుడు రామకృష్ణ పది సంవత్సరాల వయసులోనే మృతి చెందడంతో తిరిగి తన ఏడవ కుమారుడికి అదే పేరు పెట్టారు. అయితే తన మూడవ సంతానం సాయి కృష్ణ మరణించడంతో ఆయన కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది.ఇకపోతే ఎన్టీఆర్ నాలుగవ కుమారుడు హరికృష్ణ సైతం గత మూడు సంవత్సరాల క్రితం ఆగస్టు నెలలోనే రోడ్డు ప్రమాదానికి గురై మరణించిన విషయం మనకు తెలిసిందే.

ఇకపోతే హరికృష్ణ పెద్ద కుమారుడు కళ్యాణ్ రామ్ సోదరుడు జానకిరామ్ కూడా రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.కేవలం ఎన్టీఆర్ కు మాత్రమే కాకుండా ఆయన స్థాపించిన తెలుగుదేశం పార్టీకి కూడా ఆగస్టు నెల కలిసి రాలేదని చెప్పాలి. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఆగస్టు నెలలో రెండు సార్లు ఈ పదవిని కోల్పోయారు. ఇకపోతే 1995 ఆగస్టు నెలలో స్వయంగా చంద్రబాబు ఎన్టీఆర్ కి వెన్నుపోటు పొడిచారు. అప్పుడు జరిగిన వైస్రాయ్ స్కెచ్ కి ఇక ఎన్టీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి కాలేదు.

Sr NTR Family: ఎన్టీఆర్ కుటుంబానికి టిడిపి పార్టీకి ఇది శాపమా…

ఇకపోతే తాజాగా ఆగస్టు నెలలోనే మరోసారి ఎన్టీఆర్ చిన్న కుమార్తె ఉమామహేశ్వరి ఆత్మహత్య చేసుకోవడం అందరిలో విషాదం నింపింది.ఈ విధంగా ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు మాత్రమే కాకుండా ఆయన స్థాపించిన పార్టీకి ఆగస్టు నెల శాపంగా మారిందని, ఈ నెలను ఎన్టీఆర్ ఫ్యామిలీకి అలాగే టిడిపి పార్టీకి బ్యాడ్ సెంటిమెంట్ గా భావిస్తున్నారని చెప్పాలి.

Flash Back : ఏంటీ ఈ పాటకు నేను డ్యాన్స్ చేయాలా…? స్టార్ ప్రొడ్యూసర్ తో ఎన్టీఆర్ షాకింగ్ కామెంట్స్!?

Sr. NTR: సినిమా ఇండస్ట్రీలో ఎన్నో బడా బ్యానర్స్ ఉన్నాయి. అలాంటి వాటిలో శ్రీ వైజయంతి మూవీస్ బ్యానర్ ఒకటి. ఈ బ్యానర్ లో ఎన్నో సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్నాయి.ఇక వైజయంతి మూవీస్ బ్యానర్ లో మొట్టమొదటి సారిగా తెరకెక్కిన చిత్రం ఎదురులేని మనిషి. ఇందులో సీనియర్ ఎన్టీఆర్ వాణిశ్రీ జంటగా నటించారు.

1975 డిసెంబర్ 12వ తేదీ విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమాకు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. అప్పటి వరకు ఎన్టీఆర్ నటించిన సినిమాలలో మాదిరి కాకుండా ఈ సినిమాలో ఎన్టీఆర్ పూర్తిగా తన లుక్ మార్చి యవ్వనంగా కనిపించారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ లుక్ ప్రతి ఒక్క ప్రేక్షకుడిని ఎంతగానో ఆకట్టుకుంది.

ఇక ఈ సినిమాలో కసిగా ఉంది అనే పాట ఉంది. ఈ పాట విన్న తర్వాత ఎన్టీఆర్ ఏంటి ఈ పాటకు నేను డాన్స్ చేయాలా.. అంటూ అశ్వనీదత్ తో అన్నారు.ఈ మాటకు అశ్వనీదత్ మాట్లాడుతూ నేను మీకు పెద్ద అభిమానిని మిమ్మల్ని ఇలా చూడాలనుకోవడం నా కోరిక. ఇలాగే నాలాంటి ఎంతోమంది అభిమానులు కూడా మీలో కొత్తదనాన్ని కోరుకుంటారు అంటూ అశ్వనీదత్ చెప్పారు.

ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా మారాను…

ఇక అశ్వినీదత్ మాటలు విన్న ఎన్టీఆర్ ఏమాత్రం మాట్లాడకుండా వారు చెప్పిన విధంగా ఈ సినిమాలో కసిగా ఉంది అనే పాటకు వాణిశ్రీ తో కలిసి చిందులు వేశారు. ఇక ఈ పాట ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా బాక్సాఫీస్ వద్ద సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఇక ఇదే విషయాన్ని ఎన్టీఆర్ వంద రోజులు ఈ వేడుకలో మాట్లాడుతూ.. ప్రజలలో మారిన అభిరుచులకు అనుగుణంగా తాను మారానని, అశ్వినీదత్ చెప్పిన విధంగానే నేను చేశానని ఎన్టీఆర్ వందరోజుల వేడుకలో వెల్లడించారు.

Mahesh Babu: ఎన్టీఆర్‌-కృష్ణల మధ్య వైరం నిజమేనా..? మహేష్ బాబు ఏమన్నారో తెలుసా?

Mahesh Babu: నందమూరి బాలకృష్ణ జోష్ లో ఉన్నారు. ఆయన నటించిన ‘ అఖండ’ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. రికార్డ్ లు క్రియేట్ చేసింది. బాలయ్య కెరీర్ లోనే వందకోట్ల సినిమాగా నిలిచింది. ఇటు సినిమాతోనే కాకుండా.. ఓటీటీలో ప్రారంభమైన ‘అన్ స్టాపబుల్’ టాక్ షోలో అదరగొడుతున్నారు.

Mahesh Babu: ఎన్టీఆర్‌-కృష్ణల మధ్య వైరం నిజమేనా..? దీనిపై మహేష్ బాబు ఎమన్నారంటే..!


ఇప్పటికే ఈ షో ఎంత పెద్ద సక్సెస్ అయిందో అందరికి తెలుసు. ఇప్పటికే బాలయ్య… రాజమౌళి, బన్నీ, బోయపాటి, శ్రీకాంత్, మోహన్ బాబు వంటి వారితో టాక్ షో నిర్వహించారు. తాజాగా అన్ స్టాపబుల్ గ్రాండ్ ఫినాలేకు గెస్ట్ గా సూపర్ స్టార్ మహేష్ బాబు వచ్చారు. ఇప్పుడు ఇది అందరిలోనూ ఆసక్తి క్రియేట్ చేస్తోంది.

Mahesh Babu: ఎన్టీఆర్‌-కృష్ణల మధ్య వైరం నిజమేనా..? దీనిపై మహేష్ బాబు ఎమన్నారంటే..!

అయితే గతంలో నందమూరి తారకరామారావు- సూపర్‌స్టార్‌ కృష్ణ మధ్య వైరం ఉండేదని అందరూ అనుకుంటారు. ఎన్టీఆర్ ను టార్గెట్ చేస్తూ కొన్ని సినిమాలను కూడా కృష్ణ తీశారని అభిమానులు అనుకుంటారు. సినిమాలతో పాటు పొలిటికల్ గా కూడా వీరిద్దరి మధ్య వైరుధ్యాలు ఉన్నాయంటూ అందరూ అనుకుంటారు. 

సినిమా తర్వాత సినిమాను చూసి..


అయితే ఈ వివాదంపై మహేష్ బాబు అన్ స్టాపబుల్ ప్రోగ్రాంలో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. అందరూ అనుకున్నట్లుగా ఎన్టీఆర్-కృష్ణ మధ్య ఎలాంటి విభేదాలు లేవని అన్నారు. అల్లూరి సీతారామరాజు సినిమా సమయంలో నాన్న గారితో ఎన్టీఆర్  గారికి గొడవలు ఉన్నాయనే మాట అబద్దమని అని అన్నారు. ఈ సినిమా తర్వాత సినిమాను చూసి ఎన్టీఆర్ గారు ఎంతో అభినందించారని నాన్న ఎప్పుడూ అంటూ ఉండే వారిని మహేష్ బాబు అన్నారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్ లో వైరల్ అయ్యాయి.

Tollywood Interesting Facts: ఓకే కథతో వచ్చిన రెండు సినిమాలు.. ఏది హిట్టు… ఏది ఫ్లాప్!

Tollywood Interesting Facts: సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో కొన్నిసార్లు ఒకే తరహా సినిమాలు రెండు మూడు రావడం సర్వసాధారణం. కథలో కొన్ని మార్పులు చేర్పులు ఉన్నప్పటికీ కథాంశం మాత్రం ఒకటే ఉంటుంది. ఇలా ఎన్నో సినిమాలు బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాలను అందుకున్నవి ఉన్నాయి. ఈ క్రమంలోనే నట రత్న ఎన్టీఆర్ నట శేఖర్ కృష్ణ మధ్య ఈ విధమైనటువంటి పోటీ ఏర్పడింది.

Tollywood Interesting Facts: ఓకే కథతో వచ్చిన రెండు సినిమాలు.. ఏది హిట్టు… ఏది ఫ్లాప్!

కొమ్మూరు వేణుగోపాల్ రావు రాసిన ప్రేమ నక్షత్రం నవల ఆధారంగా కృష్ణ హీరోగా అదే పేరుతో ప్రేమ నక్షత్రం అనే సినిమా తెరకెక్కింది. ఈ నవలలో పెద్దగా మార్పులు చేయకుండా అదే తరహాలో ఈ సినిమాని తెరకెక్కించారు. ఇందులో కృష్ణ సరసన శ్రీదేవి నటించారు. ఇక ఈ సినిమాకి పి.సాంబశివరావు దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో శ్రీదేవి కృష్ణ భార్యాభర్తలుగా నటించారు. వీరిద్దరూ ఒకే కంపెనీలో పని చేస్తుంటారు అయితే ఆ యజమానికి ప్రేమ పెళ్లి అంటే నచ్చదు.

Tollywood Interesting Facts: ఓకే కథతో వచ్చిన రెండు సినిమాలు.. ఏది హిట్టు… ఏది ఫ్లాప్!

ఎన్నో సినిమాలలో ధైర్యంగా ఎవరినైనా ఎదిరించే పాత్రలో నటించిన కృష్ణ ఈ సినిమాలో తన యజమానికి భయపడుతూ నటించడం ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోయారు. ఇలా 1982 ఆగస్టు ఆరో తేదీన విడుదలైన ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను సందడి చేయలేక పోయిందని చెప్పాలి.

అప్పటికే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు…

ఇలా ఈ సినిమా విడుదలైన ఆరు నెలలకు ఎన్టీఆర్ నటించిన సింహం నవ్వింది అనే సినిమా విడుదలయింది బాలకృష్ణ యువ కథానాయకుడిగా నటించిన ఈ సినిమాకి యోగానంద దర్శకత్వం వహించారు. ఇది ఎన్టీఆర్ సొంత చిత్రం ఈ సినిమా సమయానికి ఎన్టీఆర్ ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఇక ఈ సినిమా కృష్ణ నటించిన ప్రేమ నక్షత్రం సినిమా కథ రెండు దాదాపు ఒకటే ఉన్నాయి. ఈ రెండు చిత్రాలలో ఆఫీస్ లో యజమాని ప్రేమ పెళ్లిలకు వ్యతిరేకంగా కనిపిస్తారు. కానీ ఈ సినిమా కథ మొత్తం సీనియర్ ఎన్టీఆర్ చుట్టూ తిరుగుతూ ఉండటం వల్ల ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది.