Chiranjeevi: టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఈ వయసులో కూడా అదే ఊపుతో సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్నారు మెగాస్టార్. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఆయన వశిష్ట దర్శకత్వంలో రూపొందుతున్న విశ్వంభర సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఆ సంగతి పక్కన పెడితే తాజాగా చిరంజీవి ఎన్టీఆర్ గురించి ఆసక్తికర వాఖ్యలు చేశారు. తాజాగా విశాఖపట్నంలో లోక్ నాయక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ పుణ్య తిథి, ఏఎన్ఆర్ శతజయంతి వేడుకలు జరుగుతున్నాయి.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యారు. ఈ సందర్భంగా చిరంజీవి ఎన్టీఆర్, ఏఎన్నార్ గార్లతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. అయితే ఈ కార్యక్రమంలో చిరంజీవి ఎన్టీఆర్ తో జరిగిన ఒక సంఘటనని, ఆయన ఇచ్చిన ఒక సలహాని గుర్తుచేసుకున్నారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. నేను కెరీర్ లో అప్పుడప్పుడే ఎదుగుతున్నాను. ఒక రోజు ఎన్టీఆర్ గారి దగ్గరికి వెళ్లినప్పుడు రండి బ్రదర్ కూర్చోండి అన్నారు. భయం భయంగా కూర్చున్నాను. అప్పుడు ఆయన ఒక మాట చెప్పారు.
ఎన్టీఆర్ మాటలకు నా మనసు మార్చుకున్నాను..
మీరు సంపాదించిన డబ్బు అంతా ఇనుప ముక్కలు మీద పెట్టొద్దు, ఏదైనా మంచి ఇల్లు కట్టుకోండి. స్థలాల మీద పెట్టుకోండి మనల్ని కాపాడేది అదే అన్నారు. మనం ఎక్కువ కాలం ఇలాగే స్టార్ డమ్ తో ఉంటామని అనుకోకండి అని ఎంతో ముందుచూపుతో చెప్పారు. అప్పటిదాకా నేను మంచి కారు కొనుక్కుందామా, అప్పట్లో వచ్చే స్టైలిష్ టయోటా కారు కొనుక్కుందాం అనుకున్నాను. ఎన్టీఆర్ గారు చెప్పిన తర్వాత ఆ కార్ కొనడం ఆపేసి అక్కడక్కడా స్థలాలు కొనడం మొదలుపెట్టాను ఈ రోజు నా రెమ్యునరేషన్ కంటే కూడా ఆ స్థలాలే నన్ను, నా ఫ్యామిలీని కాపాడుతున్నాయి అని తెలిపారు చిరంజీవి. ఈ సందర్భంగా చిరంజీవి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…