Movie News

Syamala Devi : ప్రభాస్ పై వేణు స్వామి చేసిన వాఖ్యలు మమ్మల్ని బాధపెట్టాయి: శ్యామల దేవి

Syamala Devi : రెబల్ స్టార్ కృష్ణంరాజు భార్య పాన్ ఇండియా హీరో ప్రభాస్ పెద్దమ్మ అయిన శ్యామలాదేవి గురించి మనందరికీ తెలిసిందే. కృష్ణంరాజు ఉన్నంతవరకు సోషల్ మీడియాకు, మీడియాకు కాస్త దూరంగా ఉంటూ వచ్చిన శ్యామల దేవి భర్త మరణం తర్వాత కొన్ని ఇంటర్వ్యూలకు హాజరవుతూ వచ్చారు. ఇక తాజాగా తన భర్త జయంతి సందర్భంగా శ్యామలాదేవి ఒక మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా ప్రభాస్ గురించి జ్యోతిష్యులు వేణు స్వామి చేసిన కామెంట్స్‌పై ఆమె ఎమోషనల్ అయ్యారు.

ఈ సందర్భంగా మీడియాతో శ్యామలాదేవి మాట్లాడుతూ.. కృష్ణంరాజు లేరన్న విషయాన్ని నేను ఇంకా జీర్ణించుకోలేకపోతున్నాను. ఆ విషాదం నుండి ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నానని ఆమె చెప్పారు. అందుకు గల కారణం ప్రభాస్, పిల్లలు ఇస్తున్న ధైర్యమే. వాళ్లు ఇచ్చే ధైర్యం వల్లే ఇప్పుడిప్పుడే నేను నెమ్మదిగా కోలుకుంటున్నాను. అలాగే ఇటీవల కొన్ని యూట్యూబ్ ఛానెల్స్‌లో మా కుటుంబంపై చేస్తున్న ట్రోల్స్ చాలా బాధ కలిగించాయి అని తెలిపారు శ్యామలాదేవి. ముఖ్యంగా కృష్ణంరాజు కుటుంబానికి, ప్రభాస్ కుటుంబానికి పడటం లేదని రాయడం వల్ల ఎటువంటి లాభం ఉంటుందో అని పేర్కొన్నారు.

ఆ మాటలు నన్ను చాలా బాధ పెట్టాయి..

ఇటీవల ప్రభాస్ ఆరోగ్యం గురించి జ్యోతిష్యులు వేణుస్వామి చేసిన కామెంట్స్ చూసానని అవి ఎంతగానో బాధించాయని శ్యామలాదేవి అన్నారు. ప్రభాస్ జాతకం తన మదర్‌కి మాత్రమే తెలుసునని వేణుస్వామికి ఎలా తెలుస్తుందని ప్రశ్నించారు. అంతేకాకుండా ఆ సమయంలో వేణు స్వామి ప్రభాస్ గురించి ఆయన జాతకం గురించి చేసిన వ్యాఖ్యలు నిజంగా మమ్మల్ని బాధపెట్టాయి అని ఆమె చెప్పుకొచ్చింది. అదేవిధంగా వేణుస్వామి వ్యాఖ్యలు పట్టించుకోవద్దని ప్రభాస్ అభిమానులకు సూచించినట్లు శ్యామలాదేవి తెలిపారు. కాగా గతంలో ప్రభాస్ గురించి ఆయన జాతకం గురించి పెళ్లి విషయాల గురించి సినిమాల గురించి వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో డార్లింగ్ ఫాన్స్ ఒక రేంజ్ లో విరుచుకుపడుతూ వేణు స్వామిపై ట్రోల్స్ చేశారు. సలార్ సినిమా విషయంలో కూడా షాకింగ్ కామెంట్స్ చేశారు వేణు స్వామి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago