Arjun Sarja: తెలుగు ప్రేక్షకులకు నటుడు అర్జున్ సర్జా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. శంకర్ దర్శకత్వంలో వచ్చిన జెంటిల్ మన్ సినిమాలో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నారు అర్జున్ సర్జా. ఈ సినిమా కంటే ముందే పలు తెలుగు సినిమాలలో నటించి మెప్పించారు. మా పల్లెలో గోపాలుడు, మన్నెం మొనగాడు, మావూరి మహారాజు, జెంటిల్‌మన్,శ్రీ మంజునాథ, పుట్టింటికి రా చెల్లి, శ్రీఆంజనేయం వంటి సినిమాలలో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో అర్జున్ సర్జా కి సంబంధించిన ఒక వార్త వైరల్ అవుతోంది.
కాగా ఇటీవలే అర్జున్ దేశ ప్రధాని నరేంద్ర మోడీని కలిసిన విషయం అందరికీ తెలిసిందే. ఇటీవలే అందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తమిళనాడు పర్యటనలో ఉన్న ప్రధాని మోడీ ఖేలో ఇండియా గేమ్స్ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి కుమార్తె ఐశ్వర్యతో కలిసి వెళ్లిన అర్జున్ ప్రధాని మోదీని మర్యాద పూర్వకంగా కలిసి జ్ఞాపికను అందించారు. అనంతరం చెన్నైలో తాను నిర్మించిన హనుమాన్ ఆలయాన్ని సందర్శించాలని అర్జున్ మోదీని కోరారు. ఇక అర్జున్ రిక్వెస్ట్ మేరకు మోదీ కూడా వస్తానని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వీరి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
సొంతంగా ఆలయం నిర్మించిన అర్జున్..
కాగా గతంలో టాలీవుడ్ డైరెక్టర్ కృష్ణవంశీ తీసిన శ్రీఆంజనేయం సినిమాలో అర్జున్ హనుమాన్ పాత్రలో నటించారు. ఆ తర్వాతనే ఆయనకు ఆంజనేయస్వామి గుడి కట్టాలనే కోరిక కలిగిందట. దాదాపుగా 17 సంవత్సరాల పాటు కష్టపడి అర్జున్ చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకి సమీపంలో హనుమాన్ ఆలయాన్ని నిర్మించారు. ఆ హనుమాన్ విగ్రహం దాదాపుగా 140 టన్నులు ఉంటుందట. భారీ హనుమాన్ విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేసారు. అర్జున్ సొంత ఖర్చులతో ఈ ఆలయాన్ని నిర్మించారట. ఈ ఆలయానికే మోదీని ఆహ్వానించారు అర్జున్ సజ్జా.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…