Pooja Kannan: పూజా కన్నన్.. సోషల్ మీడియాలో గత నాలుగు ఐదు రోజులుగా ఈ పేరు మారుమోగుతున్న విషయం మనందరికీ తెలిసిందే. హీరోయిన్ సాయి పల్లవి చెల్లిలిగా భారీగా గుర్తింపును తెచ్చుకుంది పూజా కన్నన్. అయితే త్వరలోనే పూజ పెళ్లి పీటలు ఎక్కబోతున్న విషయం తెలిసిందే. దీంతో గత రెండు మూడు రోజులుగా పేరు సోషల్ మీడియాలో మారుమోగుతూనే ఉంది. ఇప్పటికే సాయి పల్లవి ఇంట్లో పెళ్లి సందడి కూడా మొదలైనట్లు తెలుస్తోంది. అయితే మొదట్లో అందరూ ఈ కేవలం గాసిప్స్ అనుకుంటుండగా ఇటువంటి సమయంలోనే తాజాగా పూజా కొన్ని ఫోటోలను షేర్ చేసి ఆ వార్తలు నిజమే అని చెప్పకనే చెప్పింది.
ప్రస్తుతం పూజా షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కాగా లేడీ సూపర్ స్టార్ అయిన సాయి పల్లవి మాదిరిగానే పూజా కన్నన్ కూడా ఉంటుంది అన్న విషయం మనందరికీ తెలిసిందే. పూజా 2021లో విడుదలైన చిత్తిరాయి సెవ్వానం అనే చిత్రంతో హీరోయిన్ గా అలరించింది. సముద్రఖనికి కూతురు పాత్రలో నటించింది. ఆ తర్వాత పెద్దగా సినిమాలు చేయలేదు. కేవలం ఈ ఒక్క సినిమాలో మాత్రమే నటించి మెప్పించింది. సినిమాలలో నటించకపోయినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం పూజా కన్నన్ యాక్టివ్ గానే కనిపిస్తూ ఉంటారు. అక్క సాయిపల్లవితో కలిసి ఫొటోలకూ ఫోజులిస్తూ సందడి చేస్తుంటుంది.
పెళ్లి గురించి మరో అప్డేట్ ఇచ్చిన పూజా..
ఇక రీసెంట్ గా గుడ్ న్యూస్ కూడా చెప్పింది. తన ప్రియుడి గురించి చెప్పింది. తన ప్రియుడు వినీత్ ని పరిచయం చేస్తూ అందుకు సంబంధించిన ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసింది. తాజాగా తన పెళ్లిపై మరో అప్డేట్ ఇచ్చింది. ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు రెడీ అని చెప్పింది. ఇందుకు సంబంధించి ఒక ఫొటోను షేర్ చేసింది. అక్క సాయిపల్లవితో కలిసి ఉన్న ఫొటోను పంచుకుంది. చేతులకు మెరిసిపోతున్న మెహందీని కూడా చూపిస్తూ సంతోషం వ్యక్తం చేసింది. రేపు సాయిపల్లవి ఎంగేజ్ మెంట్ జరిగబోతున్నట్టు తెలుస్తోంది. అయితే పెళ్లి ఎప్పుడనేది తెలియలేదు. డేట్ పై ఇంకా క్లారిటీ రాలేదు. పూజా చేతులకు పెట్టుకున్న మెహేంది ని చూపిస్తూ ఫోటోలకు ఫోజులు ఇవ్వడంతో ఎంగేజ్మెంట్ పెళ్లి వార్తలు నిజమే అని చాలామంది నమ్ముతున్నారు.
మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో ఎన్నో బ్లాక్‌బస్టర్ చిత్రాలు వచ్చినా, ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సినిమాల్లో ‘పసివాడి ప్రాణం’…
చూపు లేకపోయినా సంగీతంతో కోట్ల హృదయాలను గెలుచుకున్న గాయని వైకమ్ విజయలక్ష్మి జీవితం నిజంగా ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. చిన్నప్పటి…
మహాభారతం భారతీయ ఇతిహాసాల్లో అత్యంత ప్రాముఖ్యత కలిగిన మహాగ్రంథంగా గుర్తింపు పొందింది. ధర్మం, అధర్మం మధ్య జరిగిన కురుక్షేత్ర యుద్ధం…
భారతీయ సంప్రదాయంలో రత్నాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. అందులోనూ ముత్యాలు ఎప్పటినుంచో పవిత్రత, ప్రశాంతత, శుభానికి ప్రతీకగా భావించబడుతున్నాయి. తెల్లని…
వివాహం అనేది ఇద్దరి మనుషుల మధ్య బంధమే కాదు, వారి ఆలోచనలు, స్వభావాలు, జీవన విధానాల కలయిక కూడా. వేద…
హిందూ సాంప్రదాయంలో కొన్ని మొక్కలకు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంటుంది. వాటిలో పారిజాతం మొక్కకు ఎంతో విశిష్ట స్థానం ఉంది.…