Movie News

Sai Kumari: ఫుడ్ స్టాల్ నడుపుతూ నెలకు ఏకంగా లక్షల్లో సంపాదిస్తున్న సాయికుమారి.. కష్టానికి హాట్సాఫ్ అంటూ?

Sai Kumari: ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా కూడా రోడ్డు పక్కన ఉండే ఫుడ్ స్టాల్ లకు డిమాండ్ విపరీతంగా పెరిగిపోతోంది. హోటల్స్ కాకుండా రోడ్డు పక్కన చిన్న చిన్న స్టాల్స్ పెట్టుకొని నెలకు లక్షల్లో సంపాదిస్తున్న వారి సంఖ్య ఎక్కువగానే ఉందని చెప్పవచ్చు. అలా ఇటీవల కాలంలో యూట్యూబ్ లలో బాగా ఫేమస్ అయిన వారిలో సాయి కుమారి కూడా ఒకరు. సాయి కుమారి అంటే గుర్తుపట్టకపోవచ్చు కానీ ఆమె ఫోటో చూస్తే చాలు ఓహో ఈమైనా అంటూ గుర్తుపట్టిస్తారు. తన స్టాల్ దగ్గర వచ్చి కస్టమర్లను ఎంతో ప్రేమగా నానా చెప్పు కన్నా అని పలకరిస్తూ ప్రతి ఒక్కరినీ ఆకర్షిస్తూ ఉంటుంది.

అంతేకాకుండా సాయికుమారి చేసే వంటకాలకు ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు. నిరంతరం ఆమె స్టాల్ దగ్గర ఎప్పుడు రష్ గానే ఉంటుందని చెప్పవచ్చు. అందుకు సంబంధించిన వీడియోలు యూట్యూబ్ లో చాలానే ఉన్నాయి. టేస్టీగా ఉండే వెజ్, నాన్ వెజ్ వంటకాలను సాయికుమారి మిగతా హోటళ్లు, రెస్టారెంట్లతో పోల్చి చూస్తే తక్కువ ధరలకే అందిస్తుండటంతో పాటు ప్రేమగా భోజనం వడ్డిస్తున్నారు. అయితే ఇప్పుడు ఇదంతా ఎందుకు అనుకుంటున్నారా.. టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ నటించిన ఊరు పేరు భైరవకోన సినిమా మరో రెండు వారాల్లో థియేటర్లలో విడుదల కానుంది.

తాజాగా ఈ మూవీ టీం సాయికుమారి ఫుడ్ స్టాల్ దగ్గరకు వెళ్లి వంటలను రుచి చూడటంతో పాటు ఆ వంటలను మెచ్చుకున్నారు. హీరో సందీప్ కిషన్ తో పాటు హీరోయిన్లు వర్ష బొల్లమ్మ, కావ్య థాపర్ ప్రమోషన్స్ లో భాగంగా ఈ ఫుడ్ కోర్ట్ లో వంటకాలను రుచి చూశారు. అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. సాయికుమారి నెల సంపాదన ఏకంగా రెండున్నర లక్షల రూపాయలకు అటూఇటూ ఉంటుందని తెలుస్తోంది.

అదంతా ప్రమోషన్స్ కోసమే..

ఫుడ్ స్టాల్ ద్వారా ఇంత భారీ రేంజ్ లో సంపాదించడం అంటే సులువు కాదని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఊరు పేరు భైరవకోన టీమ్ ప్రమోషన్స్ లో పాల్గొనడంతో సాయికుమారి ఫుడ్ స్టాల్ పేరు మరోసారి మారుమ్రోగుతోంది. ఊరు పేరు భైరవకోన సినిమా విషయానికి వస్తే.. 27 కోట్ల రూపాయల అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కబోతున్న ఈ మూవీని ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రాజేష్ దండా నిర్మించారు. రవితేజ హీరోగా నటించిన ఈగల్ సినిమాకు పోటీగా ఈ సినిమా రిలీజ్ కానుందని సమాచారం అందుతోంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 weeks ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 weeks ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

4 weeks ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

4 weeks ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

4 weeks ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

4 weeks ago