Sitara: తెలుగు ప్రేక్షకులకు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ముద్దుల కూతురు గారాల పట్టి సితార ఘట్టమనేని గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఇంత చిన్న వయసులోనే స్టార్ హీరోయిన్ రేంజ్ లో అభిమానులను సంపాదించుకుంది సితార. ఈ ముద్దుగుమ్మకు ఇంస్టాగ్రామ్ లో మిలియన్ల కొద్ది ఫాలోవర్స్ ఉన్నారు అన్న విషయం మనందరికీ తెలిసిందే. అంతేకాకుండా ఇంత చిన్న వయసులోనే తండ్రి అడుగుజాడల్లో ఎంతోమందికి సహాయం చేసి తన గొప్ప మనసును చాటుకుంటోంది. సితార గొప్ప మనసుకు నిదర్శనంగా గతంలో చాలానే జరిగిన విషయం తెలిసిందే.
పేద పిల్లలకు ఉచితంగా సైకిళ్లు పంపిణీ చేయడం తన పుట్టినరోజు వేడుకలను అనాధ పిల్లలతో కలిసి జరుపుకోవడంతో పాటు వారికి బహుమతులను కూడా ఇవ్వడం ఇలా ఎన్నెన్నో మంచి మంచి పనులు చేసి అందరి చేత శభాష్ అనిపించుకుంటుంది సితార. కాగా ఎప్పటికప్పుడు ఘట్టమనేని అభిమానులు కూడా సితార చేసే మంచి పనుల గురించి సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు. అంతేకాకుండా ఇటీవలే ఆమె ఒక లగ్జరీ జువెలరీ యాడ్ లో నటించగా దాదాపు కోటి రూపాయల రెమ్యూనరేషన్ రావడంతో ఆ డబ్బును కూడా చేసేసి అందరి చేత గ్రేట్ అంటూ మన్నలను కూడా పొందింది.
అనాధ పిల్లల కోసం స్పెషల్ స్క్రీనింగ్..
ఇది ఇలా ఉంటే తాజాగా మరొకసారి తన గొప్ప మనసును చాటుకుంది సితార. మరి ఇంతకీ ఆమె ఏం చేసింది అన్న విషయానికొస్తే.. తాజాగా సితార అనాథ పిల్లలకు గుంటూరు కారం స్పెషల్ స్క్రీనింగ్ వేయించి మంచి మనసు చాటుకుంది. చిన్న వయస్సులోనే ఇంత గొప్పగా ఆలోచించే గుణం సితారకే సొంతమని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. హైదరాబాద్ లోని ఏఎంబీ సినిమాస్ లో మహేష్ బాబు ఫౌండేషన్. చీర్స్ ఫౌండేషన్ తరపున స్పెషల్ షో ఏర్పాటు చేయించారని తెలుస్తోంది. భవిష్యత్తులో సితార మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇంత చిన్న వయసుకి తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ అందరి చేత శభాష్ అనిపించుకున్న సితార ఇంకా మంచి మంచి పొజిషన్లకు వెళ్లాలి అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…