Mahesh Babu: నందమూరి బాలకృష్ణ జోష్ లో ఉన్నారు. ఆయన నటించిన ‘ అఖండ’ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. రికార్డ్ లు క్రియేట్ చేసింది. బాలయ్య కెరీర్ లోనే వందకోట్ల సినిమాగా నిలిచింది. ఇటు సినిమాతోనే కాకుండా.. ఓటీటీలో ప్రారంభమైన ‘అన్ స్టాపబుల్’ టాక్ షోలో అదరగొడుతున్నారు.
ఇప్పటికే ఈ షో ఎంత పెద్ద సక్సెస్ అయిందో అందరికి తెలుసు. ఇప్పటికే బాలయ్య… రాజమౌళి, బన్నీ, బోయపాటి, శ్రీకాంత్, మోహన్ బాబు వంటి వారితో టాక్ షో నిర్వహించారు. తాజాగా అన్ స్టాపబుల్ గ్రాండ్ ఫినాలేకు గెస్ట్ గా సూపర్ స్టార్ మహేష్ బాబు వచ్చారు. ఇప్పుడు ఇది అందరిలోనూ ఆసక్తి క్రియేట్ చేస్తోంది.
అయితే గతంలో నందమూరి తారకరామారావు- సూపర్‌స్టార్ కృష్ణ మధ్య వైరం ఉండేదని అందరూ అనుకుంటారు. ఎన్టీఆర్ ను టార్గెట్ చేస్తూ కొన్ని సినిమాలను కూడా కృష్ణ తీశారని అభిమానులు అనుకుంటారు. సినిమాలతో పాటు పొలిటికల్ గా కూడా వీరిద్దరి మధ్య వైరుధ్యాలు ఉన్నాయంటూ అందరూ అనుకుంటారు.
అయితే ఈ వివాదంపై మహేష్ బాబు అన్ స్టాపబుల్ ప్రోగ్రాంలో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. అందరూ అనుకున్నట్లుగా ఎన్టీఆర్-కృష్ణ మధ్య ఎలాంటి విభేదాలు లేవని అన్నారు. అల్లూరి సీతారామరాజు సినిమా సమయంలో నాన్న గారితో ఎన్టీఆర్ గారికి గొడవలు ఉన్నాయనే మాట అబద్దమని అని అన్నారు. ఈ సినిమా తర్వాత సినిమాను చూసి ఎన్టీఆర్ గారు ఎంతో అభినందించారని నాన్న ఎప్పుడూ అంటూ ఉండే వారిని మహేష్ బాబు అన్నారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్ లో వైరల్ అయ్యాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…