Tag Archives: super star krishna

K Viswanath – Superstar Krishna : సూపర్ స్టార్ కృష్ణ, కె. విశ్వనాథ్ ఒకే స్కూల్ నుంచి వచ్చారు.. ఆ విషయాలు మీకు తెలుసా..

సూపర్ స్టార్ కృష్ణ సీనియర్ హీరోల్లో ఒకప్పుడు ట్రెండ్ సెట్ కేసిన వ్యక్తి. ప్రతీ సినిమాలో కొత్తదనం కోరుకునే మహానుభావుడు. మరో లెజెండరీ దర్శకుడు కె. విశ్వనాథ్ గురించి కూడా ఇక్కడ తెలుసుకుందాం. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే.. ఒక సినిమా ప్రస్తుతం హిట్ కొట్టాలంలే.. యంగ్ హీరో, హీరోయిన్లు, ఐటెం సాంగ్, ఫైట్స్ ఉండాలి. లేదంటే సినిమా అట్టర్ ప్లాప్ అవుతుంది.

అలాంటిది 1979 సంవత్సరంలో ఎలాంటి ఐటెం సాంగ్, ఫైట్స్ లేకుండా థియేటర్లలో ఒక సంవత్సరానికి పైగా ఆడిన సినిమా శంకరాభరణం. అంత డెటికేట్ గా పనిచేసిన దర్శకుడు కె. విశ్వనాథ్. అందుకే ప్రభుత్వం అతడికి పద్మ శ్రీతో సత్కరించింది. ఇదిలా ఉండగా.. సూపర్ స్టార్ కృష్ణ మరయు కళాతపస్వి కె. విశ్వనాథ్ ఒకే స్కూల్ నుంచి వచ్చారట.

అదేంటి అనుకుంటున్నారా.. వివరాల్లోకి వెళ్తే.. 1964లో ప్రముఖ దర్శక నిర్మాత ఆదుర్తి సుబ్బారావు అందరూ కొత్తవాళ్ళతో తాను తీస్తున్న ‘తేనె మనసులు’ కోసం కొత్త నటులు కావాలని ఇచ్చిన పత్రికా ప్రకటనకు స్పందించి కృష్ణ తెనాలి నుంచి తన ఫోటోలు పంపించాడు. పలు వడపోతల తర్వాత మద్రాసుకు పిలిపించి కృష్ణకు స్క్రీన్ టెస్ట్ చేసి ఆదుర్తి కృష్ణను ఇద్దరు కథానాయకుల్లో ఒకడిగా ఎంపికచేశాడు.

అప్పటి నుంచి అతడు సినీ ఇండస్ట్రీలో కొనసాగుతున్నాడు. కృష్ణ అని పేరు పెట్టింది కూడా అతడే. అందుకే ఇప్పటికి సూపర్ స్టార్ కృష్ణ ఇంట్లో ఆదుర్తి ఫొటో ఉంటుంది. అయితే కె. విశ్వనాథ్ కూడా ఆదుర్తి దగ్గర సౌండ్ రికార్డింగ్ అసిస్టెంట్ గా పనిచేశేవారట. తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు. ఇలా ఇద్దరు లెంజెడరీ సినీ ప్రముఖులు ఆదుర్తి సుబ్బారావు స్కూల్ నుంచి రావడం విశేషం.

Sudheer Babu: ఎన్ని జన్మలెత్తినా కృష్ణ గారికి అల్లుడు గానే పుట్టాలి… ఎమోషనల్ అయిన సుధీర్ బాబు!

Sudheer Babu: టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ గారు ఈనెల 15వ తేదీ అనారోగ్య సమస్యల కారణంగా మరణించిన విషయం తెలిసిందే.ఈ విధంగా కృష్ణ గారు మరణించడంతో ఆయన మరణ వార్తను ఇప్పటికీ అభిమానులు కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక కృష్ణ గారిని తలుచుకొని మాట్లాడుతున్న ప్రతిసారి మహేష్ బాబుతో పాటు ఇతర కుటుంబ సభ్యులకు కూడా ఎంతో ఎమోషనల్ అవుతున్నారు.

ఇక తాజాగా హైదరాబాద్లో కృష్ణ గారి పెద్దకర్మ సభను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో భాగంగా వేల సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. ఇక అభిమానుల కోసం మహేష్ బాబు కోట్ల రూపాయలు ఖర్చు చేసి 32 రకాల వంటకాలను తయారు చేయించారు.ఇక ఈ కార్యక్రమంలో భాగంగా మహేష్ బాబు కుటుంబ సభ్యులతో పాటు పలువురు సినీ సెలబ్రిటీలు కూడా కృష్ణ గారికి నివాళులు అర్పించారు.

అనంతరం కృష్ణ గారి విగ్రహవిష్కరణ కూడా చేపట్టారు.ఇకపోతే మహేష్ బాబు ఈ కార్యక్రమంలో భాగంగా మాట్లాడుతూ తన తండ్రిని తలుచుకొని ఎమోషనల్ అయ్యారు. అదేవిధంగా కృష్ణ గారి అల్లుడు సినీ నటుడు సుధీర్ బాబు సైతం ఈ కార్యక్రమంలో పాల్గొని ఒక్కసారిగా ఎమోషనల్ అవుతూ వేదిక పైన కన్నీళ్లు పెట్టుకున్నారు.

మావయ్యను తలుచుకొని ఎమోషనల్ అయిన సుధీర్ బాబు…

ఈ సందర్భంగా సుధీర్ బాబు మాట్లాడుతూ కృష్ణ మంచితనం గురించి తెలియజేయడమే కాకుండా తనకు ఎన్ని జన్మలెత్తినా కృష్ణ గారికి అల్లుడుగానే పుట్టాలని కోరుకుంటున్నాను అంటూ ఎమోషనల్ అయ్యారు. ఇలా సుధీర్ బాబు ఎమోషనల్ కావడంతో కృష్ణ గారి మనస్తత్వం ఎలాంటిదో అర్థమవుతుంది. ఇకపోతే కృష్ణ గారి పెద్దకర్మకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Ghattamaneni Family: హైదరాబాదులో సూపర్ స్టార్ కృష్ణ పెద్దకర్మ… వైరల్ అవుతున్న ఫొటోలు!

Ghattamaneni Family: టాలీవుడ్ సూపర్ స్టార్ నటశేఖరుడు కృష్ణ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కాంటినెంటల్ హాస్పిటల్ లో ఈనెల 15వ తేదీ తుది శ్వాస విడిచారు. ఇలా ఈయన మరణించడంతో ఒక్కసారిగా ఘట్టమనేని కుటుంబ సభ్యులు, టాలీవుడ్ ఇండస్ట్రీ షాక్ కి గురయ్యారు.ఇలా ఈయన మరణ వార్త ఇండస్ట్రీకి తీరని లోటు అని చెప్పాలి.

ముఖ్యంగా ఘట్టమనేని ఫ్యామిలీ సభ్యులను కృష్ణ మరణం ఎంతగానో కృంగదీసింది. మహేష్ బాబు ఒకే ఏడాదిలోనే అన్నయ్యను అలాగే తన తల్లి తండ్రిని కోల్పోవడంతో ఒక్కసారిగా శోకసద్రంలో మునిగిపోయారు.ఇలా కోలుకోకుండా ఒకరి మరణం తర్వాత మరొకరు మరణం మహేష్ బాబును ఎంతగానో కృంగదీసింది. ఇకపోతే కృష్ణ మరణించిన అనంతరం ఆయనకు చేయాల్సిన కార్యక్రమాలన్నింటిని మహేష్ బాబు పూర్తి చేశారు.

ఇకపోతే మహేష్ బాబు పెద్దకర్మ కార్యక్రమాన్ని హైదరాబాద్లో ఒక ఫంక్షన్ హాల్ లో ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఘట్టమనేని కుటుంబ సభ్యులతో పాటు సినీ సెలబ్రిటీలు, వేల సంఖ్యలో అభిమానులు హాజరయ్యారు.ఇలా ఈ కార్యక్రమానికి వచ్చిన అభిమానులందరికీ కోసం మహేష్ బాబు ఏకంగా 32 రకాల వంటకాలను తయారు చేయించి అభిమానుల కోసం వడ్డించారు.

మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను..

ఇకపోతే ఈ కార్యక్రమంలో మహేష్ బాబు తన తండ్రిని తలుచుకొని ఆయన నాకు విలువ కట్టలేని మీ అభిమానాన్ని ఇచ్చారు. ఆయన ఎప్పటికీ మన అందరి గుండెల్లో మన మధ్యనే ఉంటారు. ఇలా మీరందరూ నన్ను ఆదరించి అభిమానిస్తున్నందుకు రుణపడి ఉంటా అంటూ ఎమోషనల్ అయ్యారు. ప్రస్తుతం కృష్ణ పెద్దకర్మ కు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Mahesh Babu: నాన్న ఎప్పటికీ నా గుండెల్లో ఉంటారు.. తండ్రిని తలచుకుని ఎమోషనల్ అయిన మహేష్ బాబు !!

Mahesh Babu: టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ మరణం ఇండస్ట్రీకి తీరని లోటు. కృష్ణ గారి మరణం మహేష్ బాబు కుటుంబ సభ్యులను ఎంతగానో కలిసి వేసింది. ముఖ్యంగా మహేష్ బాబు తన తండ్రి మరణంతో ఒకసారిగా కృంగిపోయారు. ఓకే ఏడాదిలోనే ముగ్గురు కుటుంబ సభ్యులను కోల్పోవడం ఘట్టమనేని ఫ్యామిలీకి తీరని లోటు అని చెప్పాలి.

ఈ విధంగా ఓకే ఏడాదిలోనే అన్నయ్య, తల్లి తండ్రిని కోల్పోవడంతో మహేష్ బాబు ఎంతో ఎమోషనల్ అవుతున్నారు. 12 రోజులు పూర్తయిన ఇప్పటికీ ఆయన మరణ వార్తను జీర్ణించుకోలేకపోతున్నారు. ఇకపోతే హైదరాబాదులో ఓ ఫంక్షన్ హాల్లో కృష్ణ గారి పెద్దకర్మ సభ ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమంలో భాగంగా వేలాదిమంది అభిమానులతో పాటు ఘట్టమనేని కుటుంబ సభ్యులు సినీ సెలబ్రిటీలు కూడా హాజరై కృష్ణ గారికి నివాళులు అర్పించి మరోసారి ఆయనని గుర్తు చేసుకున్నారు.ఇకపోతే ఈ కార్యక్రమంలో భాగంగా మహేష్ బాబు వేదికపై తన తండ్రి గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు.

మీ అభిమానమే గొప్పది..


ఈ సందర్భంగా మహేష్ బాబు మాట్లాడుతూ… నాన్న నా జీవితంలో నాకు ఎన్నో ఇచ్చారు.. కోట్ల మంది అభిమానులను సంపాదించి పెట్టారు. ఇలా ఎన్నో ఇచ్చినప్పటికీ నాకు మీ అభిమానం ఎంతో గొప్పది. నాన్న నేడు మన మధ్యన లేకపోవచ్చు కానీ ఆయన జ్ఞాపకాలు మనతోనే ఉన్నాయి.ఆయన ఎప్పటికీ నా గుండెల్లోను మీ గుండెల్లోనూ ఉంటారు అంటూ తన తండ్రిని తలుచుకొని ఎమోషనల్ అయ్యారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Super Star Krishna: సూపర్ స్టార్ కృష్ణ పేరిట ఉన్న ఆస్తుల విలువ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

Super Star Krishna: సూపర్ స్టార్ కృష్ణ ఇక లేరు అన్న సంగతి సినీ ఇండస్ట్రీని మాత్రమే కాకుండా ఎంతోమంది అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తుంది. 80 సంవత్సరాలు వయసు కలిగినటువంటి కృష్ణ గారు ఐదు దశాబ్దాల నుంచి సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతూ సుమారు 350 పైగా సినిమాలలో నటించి ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించారు.

ఇలా తెలుగు చిత్ర పరిశ్రమలో చెరగని ముద్ర సాధించిన కృష్ణ నేడు తుది శ్వాస విడవడంతో ఈయన మరణం ఇండస్ట్రీకి తీరని లోటుగా మిగిలిపోయిందని చెప్పాలి.ఇక కృష్ణ మరణ వార్త తెలియగానే ఎంతోమంది సినీ ప్రముఖులు హుటాహుటిన ఆయన నివాసానికి చేరుకొని ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు.ఇక కృష్ణ మరణించడంతో ఆయన సినీ కెరియర్లో నటించిన అద్భుతమైన సినిమాల గురించి ఎంతోమంది గుర్తు చేసుకుంటున్నారు.

ఈ విధంగా ఐదు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న కృష్ణ ఆస్తిపాస్తుల గురించి కూడా ప్రస్తుతం వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇన్ని సంవత్సరాలుగా ఇండస్ట్రీలో కొనసాగిన కృష్ణ ఎన్నో ఆస్తులను కూడా పెట్టారు. కృష్ణ పేరిట సుమారు 300 కోట్ల రూపాయల ఆస్తులు కలిగి ఉన్నట్టు సమాచారం.

Super Star Krishna: వందల కోట్ల ఆస్తులు కూడబెట్టిన కృష్ణ..

కేవలం హైదరాబాద్లో మాత్రమే కాకుండా ఆయన సొంత గ్రామమైన బుర్రపాలెం, చెన్నై, బెంగళూరు వంటి నగరాలలో పెద్ద ఎత్తున ఆస్తులు ఉన్నట్టు తెలుస్తోంది. ఇక కృష్ణ గారి గ్యారేజీలో సుమారు 20 కోట్ల రూపాయల విలువ చేసే ఏడు ఖరీదైన కార్లు ఉన్నట్టు తెలుస్తోంది. ఇలా ఇండస్ట్రీలో దర్శకుడిగా నిర్మాతగా హీరోగా కొనసాగిన కృష్ణ భారీగానే ఆస్తులు కూడబెట్టినట్టు సమాచారం.

Super Star Krishna : డబుల్ హ్యాట్రిక్ త్రిపాత్రాభినయ చిత్రాలతో.. హీరో కృష్ణ రికార్డుల మోత మోగించారు.?!

Super Star Krishna : “కుమారరాజా” పి. సంబశివరావు దర్శకత్వంలో 1978 లో వచ్చిన సినిమా. ఈ చిత్రంలో కృష్ణ, జయప్రద, సత్యనారాయణ, జయంతి, లత ముఖ్య పాత్రల్లో నటించారు. ఇందులో కృష్ణ మూడు – అన్యాయమైన వ్యాపారవేత్త రాజశేఖర్, అతని నుండి విడిపోయిన కవల కుమారులు కుమార్, రాజా – పాత్రలను పోషించాడు. ఈ చిత్రానికి కె.వి.మహదేవన్ సంగీతం ఇచ్చాడు.ఈ చిత్రం రాజ్‌కుమార్ నటించిన 1978 కన్నడ చిత్రం శంకర్ గురుకు రీమేక్.

“పగబట్టిన సింహం” కృష్ణ మూడు పాత్రలలో  నటించిన యాక్షన్ డ్రామా చిత్రం, ఇందులో జయప్రద, ప్రభ, గీత, కైకాల సత్యనారాయణ, ప్రసాద్ బాబు నటించారు. చంద్ర సినీ ఆర్ట్స్ పతాకంపై,పి చంద్రశేఖర రెడ్డి దర్శకత్వంలో కలిదిండి విశ్వనాథ రాజు నిర్మించాడు. చెళ్ళపిళ్ళ సత్యం సంగీతం అందించాడు. ఈ చిత్రం 1982 సెప్టెంబరు 3 న విడుదలై, మంచి సమీక్షలు అందుకుంది.

“సిరిపురం మొనగాడు’ 1 జూన్ 1983న విడుదలైన భారతీయ తెలుగు-భాషా యాక్షన్ చిత్రం. కృష్ణ త్రిపాత్రాభినులైన శ్రీధర్, ఆనంద్ మరియు లయన్‌లతో పాటు జయప్రద, KR విజయ, కైకాల సత్యనారాయణ, నూతన్ ప్రసాద్ మరియు కాంతారావు నటించారుప్రధాన పాత్రలు. శ్రీకాంత్ పిక్చర్స్ బ్యానర్‌పై శ్రీకాంత్ నహతా ఈ చిత్రాన్ని నిర్మించగా కె.ఎస్.ఆర్.దాస్ దర్శకత్వం వహించారు.

“బంగారుకాపురం” ఆగస్టు 9, 1984న విడుదలైన తెలుగు సినిమా. శ్రీ పంచవతి చిత్రాలయ బ్యానర్ పై కోగంటి విశ్వేశ్వరరావు నిర్మించిన ఈ సినిమాకు పి.చంద్రశేఖర రెడ్డి దర్శకత్వం వహించాడు. ఘట్టమనేని కృష్ణ, జయసుధ, జయప్రద ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు జె.వి.రాఘవులు సంగీతాన్నందించాడు.

కృష్ణ నట జీవితంలో ఒక మణిపూస లాంటి సినిమా ‘రక్త సంబంధం’. నటుడిగా ఆయనను ప్రపంచానికి చాటిన సినిమాల్లో ఇదొకటి. ఇందులో కృష్ణ తండ్రీ కొడుకులుగా త్రిపాత్రాభినయం చేశారు. తండ్రి చక్రవర్తిగా, కొడుకులు కృష్ణ, విజయ్‌గా మూడు భిన్న పాత్రలను ఉన్నత స్థాయిలో పోషించారు. గంభీరంగా కనిపించే చక్రవర్తి పాత్రలో గొప్పగా అనిపిస్తారు. ఆవేదన జ్వాల దహించే కృష్ణగా అపూర్వ నటన ప్రదర్శించారు. చిలిపితనం, అమాయకత్వం కలగలసిన విజయ్‌గా ముచ్చట గొలిపారు.
చక్రవర్తి భార్య పాత్రలో జయంతి, విజయ్ ప్రియురాలిగా రాధ కనిపిస్తారు. డాక్టర్ రాజారావు పాత్రలో సత్యనారాయణ గురించి చెప్పాల్సిన పనిలేదు. విజయనిర్మల దర్శకత్వ ప్రతిభకు ఈ సినిమా ఒక నిదర్శనం.ఆమె కల్పించిన ప్రతి సన్నివేశమూ ఆకట్టుకుంటుంది.చక్రవర్తి సంగీతం వీనుల విందుగా నిలిచింది.

కృష్ణ త్రిపాత్రాభినయం చేసిన చివరి చిత్రంగా “బొబ్బిలిదొర” గా చెప్పవచ్చు. 1997 శ్రీ ప్రొడక్షన్స్, కంటిపూడి. పద్మావతి, భవాని నిర్మాణం, బోయపాటి కామేశ్వరరావు దర్శకత్వంలో కృష్ణ, సంఘవి, సంగీత హీరో, హీరోయిన్లుగా, విజయనిర్మల ప్రధానపాత్రలో కనిపించారు.ఇక ప్రత్యేక పాత్రలో కైకాల సత్యనారాయణ కనిపిస్తారు. సూపర్ స్టార్ కృష్ణ ఈ సినిమాలో హరిశ్చంద్ర ప్రసాద్, శరత్ చంద్ర ప్రసాద్,కృష్ణ ప్రసాద్ అను మూడు పాత్రల్లో కృష్ణ త్రిపాత్రాభినయం చేశారు. ఇలా ఆరు చిత్రాల్లో ద్విపాత్రాభినయం చేసి డబుల్ హ్యాట్రిక్ కొట్టిన హీరోగా తెలుగు సినీ చరిత్రలో సూపర్ స్టార్ కృష్ణ రికార్డు సృష్టించారు.

Super Star Krishna: నిర్మాతల హీరోగా చెరగని ముద్ర వేసుకున్న కృష్ణ.. ఎన్నో ప్రయోగాత్మక సినిమాలను పరిచయం చేసిన కృష్ణ!

Super Star Krishna: సూపర్ స్టార్ కృష్ణ తెలుగు చిత్రపరిషంలో చెరగని ముద్ర సంపాదించుకున్నారు. ఈయన తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమై ఎన్నో సాహస ప్రయోగాత్మక సినిమాలలో నటించి అద్భుతమైన సినిమాలను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. పద్మాలయ స్టూడియోస్ బ్యానర్ లో ఎన్నో అద్భుతమైన సినిమాలను నిర్మించారు. తొలి జేమ్స్ బాండ్ చిత్రం గూడచారి 116,తొలి కౌబాయ్ చిత్రం మోసగాళ్లకు మోసగాడు వంటి అద్భుతమైన సినిమాలను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసిన ఘనత కృష్ణకు చెల్లింది.

వీటితో పాటు తెలుగు ఫుల్ స్కోప్ మూవీ అల్లూరి సీతారామరాజు, తొలి 70 ఎంఎం సినిమా సింహాసనం వంటి సూపర్ హిట్ సాహస ప్రయోగాత్మక సినిమాలన్నీ కూడా కృష్ణ గారు నటించినవే. ఇప్పటికీ ఈ సినిమాలు టీవీలలో ప్రసారమైనప్పటికీ ప్రేక్షకులు కల్లార్పకుండా చూస్తారు.ఇలా ఎన్నో అద్భుతమైన సినిమాలను 50 సంవత్సరాల క్రితమే పాన్ ఇండియా స్థాయిలో తెరకేక్కించి అప్పట్లోనే మంచి పేరు ప్రఖ్యాతలు పొందారు.

ఈ విధంగా రోజుకు మూడు షిఫ్టులలో ఏడాదికి పది సినిమాలు చొప్పున విడుదల చేస్తున్న ఘనత హీరో కృష్ణకు మాత్రమే చెల్లింది.1964 నుంచి 1995 వరకు కృష్ణ సగటున పదేళ్ళకు వంద సినిమాల్లో నటించారు. ఒకే ఏడాదిలో కృష్ణ ఏకంగా 17 సినిమాలలో నటించి విడుదల చేశారంటే ఈయన సినిమాల కోసం ఎంతలా కష్టపడేవారో అర్థమవుతుంది.1972లో కృష్ణ హీరోగా నటించిన 17 సినిమాలను విడుదల చేసి అద్భుతమైన రికార్డు సాధించిన ఏకైక ఘనత కృష్ణ గారు సొంతం చేసుకున్నారు.

Super Star Krishna: అద్భుతమైన రికార్డులు సృష్టించిన కృష్ణ…

ఈ విధంగా చిత్ర పరిశ్రమ కోసం ఎన్నో సేవలు అందించిన కృష్ణ తన సినిమా వల్ల ఎవరైనా నిర్మాత నష్టపోయారు అంటే వెంటనే వారిని పిలిచి డబ్బులు వెనక్కి ఇవ్వడం లేదంటే తనకోసం మరొక సినిమా కథ సిద్ధం చేసుకోమని తాను ఫ్రీగా సినిమాలలో నటిస్తానని భరోసా ఇచ్చేవారు.ఇలా తన వల్ల ఎప్పుడూ నిర్మాతలు నష్టపోయిన దాఖలాలు లేవు అందుకే కృష్ణ గారిని నిర్మాతల హీరో అని పిలిచేవారు. ఇలాంటి ఎంతో మంచి మనస్తత్వం కలిగినటువంటి కృష్ణ నేడు తుది శ్వాస విడవడంతో ఈయన మరణం ఇండస్ట్రీకి తీరని లోటు అని,ఈయనతో వారికి ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకొని ఎమోషనల్ అవుతున్నారు.

Super Star Krishna : హీరోయిన్ లేదు.. డ్యూయెట్ లేదు.. హీరో కృష్ణ ఈ సినిమా ఎలా ఒప్పుకున్నారన్నారు.. కట్ చేస్తే సినిమా బ్లాక్ బస్టర్.!!

Super Star Krishna : 1980 సూపర్ స్టార్ కృష్ణ మాస్ చిత్రాలతో ప్రభంజనం సృష్టిస్తున్నారు. అప్పటికే 199 చిత్రాలలో హీరోగా నటించి తన సినీ జైత్రయాత్ర లో గుర్తుండిపోయే విధంగా 200లవ చిత్రం ఉండాలని మంచి కథ కొరకు వేచి చూస్తున్నారు. 100వ చిత్రంగా “అల్లూరి సీతారామరాజు” తన సినీ గమనాన్ని మార్చి వేయడంతో 200లవ చిత్రం కూడా అంతే విధంగా ఉండాలని భావించారు. ఆ క్రమంలో సోదరుడు హనుమంతరావు మలయాళంలో బాలన్ కే నాయర్, మమ్ముట్టిలు నటించిన “ఈనాడు” చిత్రాన్ని చూశారు. ఆయనకు బాగా నచ్చడంతో పద్మాలయ బ్యానర్ లో ఆ సినిమాను తెలుగులో రీమేక్ చేయాలని అనుకున్నారు.

మలయాళ చిత్రంలో హీరో ముసలివాడు కావున తెలుగులో ఆ పాత్రకి శ్రీధర్ ని ఎంపిక చేసుకున్నారు. దర్శకుడిగా సాంబశివరావును అనుకొని ఆయనకి ఈ కథ చెప్పారు. ఎందుకో సాంబశివరావుకి ఆ పాత్రకి కృష్ణగారు అయితే బాగుంటుందని అనిపించింది. ఆ విషయం కాస్త హీరో కృష్ణ కి చెప్పడంతో ఆ సినిమా చూసి హీరోకి తగ్గ కమర్షియల్ ఎలిమెంట్స్ లేవని పైగా అది వయసుమళ్ళిన పాత్ర.. మాస్ చిత్రాలతో జోరుమీదున్న నన్ను ఇలాంటి పాత్రలో ప్రేక్షకులు, తన అభిమానులు ఒప్పుకోరని చెప్పేశారు.

1980 ప్రథమార్థంలో విజయవంతమైన చిత్రాలకు కథ, సంభాషణలు అందిస్తున్న పరుచూరి సోదరులను పిలిపించి ఆ మలయాళ సినిమాని హీరో కృష్ణ చూడమన్నారు. ఆ చిత్రాన్ని చూసిన పరుచూరి సోదరులు హీరో కృష్ణకుఆ సినిమా సరిగా సరిపోతుందన్నారు. పరుచూరి సోదరులు అలా మాట్లాడడం కృష్ణకి వింతగా అనిపించింది.అందులో హీరోయిన్ లేదు పైగా వృద్ధ పాత్ర తను హీరోగా చేయడం బావుంటుందని మీరు అనడం బాగోలేదని హీరో కృష్ణ గారు అన్నారు.

కథలో మీకు తగిన కమర్షియల్ ఎలిమెంట్స్ ని యాడ్ చేస్తూ కొత్తగా రాస్తమన్నారు. కృష్ణ వారికి అవకాశం ఇవ్వడంతో పరుచూరి సోదరులు మలయాళ చిత్రంలోని వృద్ధపాత్రను యువపాత్రగా మలిచి కొన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి హీరో కృష్ణ ఇమేజ్ కు అనుగుణంగా కథ రాయడం జరిగింది. అది హీరో కృష్ణకు నచ్చడంతో తెలుగులో ఈ చిత్రాన్ని పునర్నిర్మించడానికి మరియు తను హీరోగా నటించడానికి ముందుకు వచ్చారు.

అలా 1982 జూన్ 9న చెన్నైలో ఈనాడు చిత్ర షూటింగ్ మొదలైంది. హీరో కృష్ణకు అల్లూరి సీతారామరాజు చిత్రం అంటే చాలా ఇష్టం అందుకే ఈ సినిమాలో హీరో పేరు రామరాజుగా పెట్టారు. చెన్నైలో కృష్ణ గార్డెన్స్ లో స్లమ్ ఏరియా సెట్ వేసి కొంత భాగాన్ని అక్కడ షూట్ చేయడం జరిగింది. ఆ తర్వాత గుంటూరు, తెనాలిలో మరికొంత భాగం షూటింగ్ జరుపుకుంది. అక్కడ సూపర్ స్టార్ కృష్ణ కి అభిమానులు ఎక్కువగా ఉండడంతో స్పెషల్ పోలీస్ ఫోర్స్ ని రంగంలోకి దించారు.

ఆ విధంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈనాడు చిత్రాన్ని చూసి ఓ హీరోయిన్ లేదు.. రొమాన్స్ లేదు.. హీరో కృష్ణ ఈ సినిమాను ఎలా ఒప్పుకున్నారని కొంత మంది సినీ ప్రముఖులు పెదవి విరిచారు. ఆ విమర్శలను సవాలుచేస్తూ 1982 డిసెంబర్ 17న “ఈనాడు” చిత్రం ఆంధ్రదేశమంతటా విడుదలై అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. ఆనాటి అభ్యుదయ చిత్రాలకు ఈ సినిమా రాచబాట వేసింది.

Super Star Krishna : సూపర్ స్టార్ కృష్ణ కెరీర్ లో బెస్ట్ మూవీ ఏంటో తెలుసా..?

Super Star Krishna : అలనాటి నటుల్లో విపరీతంగా ఫామ్ ఫాలోయింగ్ ఉన్న నటుడు సూపర్ స్టార్ కృష్ణ. సీనియర్ ఎన్టీఆర్ తో పోటీ పడి మరీ సినిమాలను తీసేవారు. అంతటి గుర్తింపు తెచ్చుకున్నారు ఈ సూపర్ స్టార్. అయితే అతడు నటించిన సినిమాల్లో సూపర్ హిట్ అయిన సినిమాల్లో ఒకటి “చుట్టాలున్నారు జాగ్రత్త”. ఈ సినిమా విడుదలై దాదాపు 40 ఏళ్లు కావొస్తోంది.

ఈ సందర్భంగా దాని గురించి కొన్ని విషయాలను తెలుసుకుందాం.. ఈ సినిమాను అలపర్తి సుర్యనారాయణ నిర్మించారు. మన్నవ బాలయ్య స్టొరీ, స్క్రీన్ ప్లే అందిచారు. సూపర్ స్టార్ కృష్ణ కెరీర్ లో ఈ సినిమా 167వది. ఈ సినిమాలో సూపర్ స్టార్ కృష్ణ సరసన హీరోయిన్లుగా శ్రీదేవి, గీతలు నటించారు.

డబుల్ రోల్ లో కృష్ణ నటించారు. ఈ సినిమాకు బి.వి ప్రసాద్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా కాన్సెప్ట్ తోనే పలు సినిమాలను దర్శక నిర్మాతలు రూపొందించారు. తమిళంలో రజనీకాంత్ హీరోగా రిమేక్ కూడా చేశారు. హిందీలో మవాలీ పేరుతో రీమేక్ చేశారు.

ఇక్కడ జితేంద్ర హీరోగా నటించారు. దీనికి సంగీతాన్ని విశ్వనాథ్ అందించారు. దీనిలో రావు గోపాలరావు, నూతన ప్రసాద్, సూర్యాకాంతం కీ రోల్స్ లో నటించారు. ఈ సినిమా బంపర్ హిట్ తో పాటు సూపర్ స్టార్ కృష్ణతో పాటు హీరోయిన్లకు, మన్నవ బాలయ్యకు చక్కటి పేరు తెచ్చిపెట్టింది. ఈ సినిమా తర్వాతనే కృష్ణ పలు సనిమాల్లో నటించి మంచి విజయాలను సొంతం చేసుకున్నారు.

Super Star Krishna : ఆ రోజుల్లో స్టార్ డమ్ రావడానికి శోభన్ బాబుకి 10 సంవత్సరాలు పట్టింది కానీ నాకు మాత్రం మూడో చిత్రంతో వచ్చేసింది. : హీరో కృష్ణ

సూపర్ స్టార్ కృష్ణ తెలుగు సినిమా రంగంలో కొత్త ఒరవడిని సృష్టించిన కథానాయకుడు. 1964 కంటే ముందు కృష్ణ కొన్ని చిత్రాల్లో చిన్న వేషాలు వేసినప్పటికీ ఆ తర్వాత హీరోగా నటించడం మొదలుపెట్టారు. నాలుగు దశాబ్దాల పాటు నిర్విరామంగా కొనసాగిన అతని సినీ జైత్రయాత్ర లో.. ఆయనా ఎన్నో రికార్డులను బ్రేక్ చేస్తూ.. యువ హీరోలకు సైతం పోటీనిచ్చిన హీరోగా చెప్పుకోవచ్చు. హీరోగా, నిర్మాతగా, దర్శకుడిగా అనేక చిత్రాల్లో నటిస్తూ బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరుగడించారు. 1964 దర్శకుడు ఆదుర్తిసుబ్బారావు తను తీస్తున్న సినిమాకి నూతన నటీనటులు కావాలని పేపర్ యాడ్ ఇచ్చారు. అది చదివిన హీరో కృష్ణ తన ఫోటోలను మద్రాస్ పంపించారు. అనేక వడపోతల తర్వాత దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు కృష్ణని ఈ సినిమాలో ఇద్దరు హీరోల్లో ఒకరిగా ఎంపికచేయడం జరిగింది. అలా ఆ సినిమాలో హీరోగా మొదలైన హీరో కృష్ణ సినీ ప్రయాణంలో అంచెలంచెలుగా ఎదిగారు.

ఇక అందాల నటుడు శోభన్ బాబు విషయానికి వస్తే..
మద్రాసులో లా కోర్సులో చేరినప్పటికీ నటన పైన ఆసక్తితో సినిమా ప్రయత్నాలు మొదలు పెట్టాడు. ఉదయం కాలేజీకి వెళ్ళి, మధ్యాహ్నం నుండి స్టూడియోల వెంట తిరిగేవాడు. అప్పుడే తన పేరును శోభన్ బాబుగా మార్చుకున్నాడు. పొన్నులూరి బ్రదర్స్ వారు దైవబలం చిత్రంలో రామారావు సరసన ఒక పాత్ర ఇచ్చారు. కానీ ఆ సినిమా విజయవంతం కాలేదు. ఆ సమయంలోనే నారాయణరావు నిర్మించిన భక్త శబరి చిత్రంలో ఒక మునికుమారునిగా నటించాడు. 1960 జూలై 15న విడుదలయిన ఆ సినిమా కాస్త విజయవంతమవ్వడంతో శోభన్ బాబు పేరు సినీరంగంలో పరిచయమయ్యింది. ఆ తర్వాత ఆయన అనేక చిత్రాల్లో నటించి ప్రేక్షకుల అభిమానాలను పొందారు.

అయితే ఒక ఇంటర్వ్యూలో కృష్ణ మాట్లాడుతూ.. 1960 ఆ ప్రాంతంలో తాను, సహనటుడు శోభన్ బాబు కలిసి పాండిబజార్ లోని వాణిమహల్ లో “చేసిన పాపం కాశికి పోయిన” అనే నాటకం వేసామని దానికి మా ఇద్దరికీ మంచి పేరు వచ్చింది. మొదటగా తేనె మనసులు, కన్నె మనసులు ఆ తర్వాత గూడచారి 116 చిత్రాలలో నటించానని.. మూడవ చిత్రంతోనే నాకు స్టార్డమ్ వచ్చింది. కానీ నా సహనటుడు శోభన్ బాబుకు.. మాత్రం 50 చిత్రాలలో నటించిన తర్వాత అంటే దాదాపు పది సంవత్సరాల తర్వాత ఆయనకు “మనుషులు మారాలి” సినిమాతో స్టార్ డమ్ వచ్చిందని హీరో కృష్ణ చెప్పారు. ఇంకో విషయం ఏమిటంటే మనుషులు మారాలి చిత్రం తానే చేయాల్సి ఉండేది. కానీ అప్పటికే అనేక చిత్రాల్లో నటిస్తూ ఉండడం వలన డేట్స్ అడ్జస్ట్ కాక ఆ సినిమా వదులుకున్నాను. అదే సినిమాతో శోభన్ బాబు సూపర్ హిట్ అందుకున్నాడని. ఆ చిత్రంతోనే ఆయనకు స్టార్ డమ్ కూడా వచ్చిందని ఆ ఇంటర్వ్యూలో హీరో కృష్ణ చెప్పుకొచ్చారు.