Tag Archives: tdp leader

Pawan Kalyan: పవన్ మాటలకు యూటర్న్ తీసుకున్న పిఠాపురం రాజకీయం.. మొదలైన కొత్త తలనొప్పి!

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాల పరంగా కొన్నిసార్లు ఆయన చేసే వ్యాఖ్యలు తనకు తలనొప్పిగా మారుతున్నాయి తాజాగా పిఠాపురంలో నిర్వహించినటువంటి సభలో భాగంగా ఈయన తాను కేంద్రం ఆదేశిస్తే కాకినాడ ఎంపీగా పోటీ చేయడానికి కూడా సిద్ధమేనంటూ కామెంట్లు చేశారు. నిజానికి ఇక్కడ జనసేన అభ్యర్థికి టికెట్ ఇవ్వడం లోకల్ టిడిపి నేత వర్మకు ఏమాత్రం ఇష్టం లేదు.

పవన్ కళ్యాణ్ కు టికెట్ ప్రకటించడంతో తాను టిడిపి పార్టీ నుంచి తప్పుకొని ఇండిపెండెంట్గా పోటీ చేస్తానని ప్రకటించారు కానీ చంద్రబాబు నాయుడు పిలిచి తనని బుజ్జగించి ఎమ్మెల్సీలో పదవి ఇస్తానని చెప్పి జనసేనకు సపోర్ట్ చేయాలని కోరారు. దీంతో వర్మ జనసేనకు మద్దతుగా తెలుపుతున్నారు. ఇద్దరు కలిసి ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ తాను కాకినాడ ఎంపీగా కూడా పోటీ చేయవచ్చు అంటూ కామెంట్లు చేశారు.

పిఠాపురం టికెట్ నాదే..
ఒకవేళ నేను కాకినాడ వెళ్లాల్సి వస్తే ఈ ప్లేస్ లో ఉదయ్ పోటీ చేస్తారు అంటూ ఈయన తెలిపారు. దీంతో వర్మ యూటర్న్ తీసుకున్నారు. ఒకవేళ ఈ స్థానం నుంచి పవన్ కళ్యాణ్ తప్పుకుంటే ఈ పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా వేరే వాళ్ళు నిలబడటానికి లేదని తానే పోటీ చేస్తాను అంటూ భీష్ముంచుకు కూర్చున్నారు. చంద్రబాబు ఆదేశాలతోనే పవన్ కళ్యాణ్ కోసం సీటును త్యాగం చేసినట్లు చెప్పుకొచ్చారు. ఎంతో బాధతో స్థానాన్ని వదులుకున్నానని.. ఒకవేళ పవన్ కళ్యాణ్ కాకినాడ ఎంపీగా పోటీచేస్తే పిఠాపురం టికెట్ తనదేనని అన్నారు.

Taraka Ratna: బాలయ్య దేవుడు… తారకరత్నను ఆయనే బతికించాడు… టీడీపీ నేత కామెంట్స్ వైరల్!

Taraka Ratna: ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు చాలా హాట్ హాట్ గా కొనసాగుతున్నాయి. వచ్చే ఎన్నికలలో ఎలాగైనా అధికార పీఠాన్ని దక్కించుకోవాలన్న ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున రాష్ట్రంలో పర్యటిస్తుంది. ఈ క్రమంలోనే టిడిపి ప్రధాన కార్యదర్శి, యువ నాయకుడు నారా లోకేష్ యువగలం అనే పేరుతో పాదయాత్ర మొదలుపెట్టిన విషయం మనకు తెలిసిందే.

ఈ పాదయాత్రలో భాగంగా లోకేష్ తో పాటు నందమూరి తారకరత్న కూడా పాల్గొన్నారు.ఈ క్రమంలోనే స్పృహ తప్పిపోయిన తారకరత్న శరీరం మొత్తం నీలి రంగులోకి మారిపోయింది. దీంతో ప్రాథమిక చికిత్స నిర్వహించిన అనంతరం ఆయనని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.అక్కడ వైద్యులు పల్స్ చెక్ చేయడంతో పల్స్ పూర్తిగా పడిపోయిందని సిపిఆర్ చేసిన తర్వాత పల్స్ రేట్ కనిపించిందని తెలిపారు.

ఇలా తారకరత్న ఆసుపత్రి పాలు కావడంతో పలువురు టీడీపీ శ్రేణులు ఈ విషయంపై స్పందించి వారి అభిప్రాయాలను తెలియజేశారు. మరోవైపు వైసీపీ అభిమానులు మాత్రం ఇదే అదునుగా భావించి లోకేష్ పాదయాత్ర పై ట్రోల్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే టిడిపి నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ గా మారాయి.

Taraka Ratna: బాలయ్య దేవుడు…


ఈ సందర్భంగా బుచ్చయ్య చౌదరి ఈ విషయంపై స్పందిస్తూ తారకరత్న చనిపోతాడు అనుకున్నాం కానీ బాలయ్య రాకతో బతికేసాడు అంటూ గోరంట్ల బుచ్చయ్య చౌదరి చేసినటువంటి ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. తారకరత్న విషయంలో ఇది ఒక మిరాకిల్ అని ఈయన వ్యాఖ్యానిస్తూ బాలకృష్ణను ఉన్నఫలంగా దేవుడిని చేసేసాడు దీంతో ఈ కామెంట్స్ కాస్త వైరల్ గా మారాయి.

Sharwanand: టీడీపీ నేత మనవరాలితో శర్వానంద్ వివాహం… శర్వానం చేసుకోబోయే అమ్మాయి బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా?

Sharwanand: టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లిస్ట్ లో ఉన్నటువంటి వారిలో నటుడు శర్వానంద్ ఒకరు ఈయనకు ఇప్పటికే పెళ్లి వయసు దాటిపోయిన ఇంకా పెళ్లి చేసుకోకపోవడంతో పెళ్లి గురించి వార్తలు వచ్చేవి అయితే ఇక శర్వానంద్ త్వరలోనే తన బ్యాచిలర్ లైఫ్ కు గుడ్ బై చెప్పి కొత్త జీవితంలోకి అడుగుపెట్టబోతున్నారని తెలుస్తోంది.

గత కొద్దిరోజులుగా శర్వానంద్ పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వచ్చాయి. అయితే ఈయన జనవరి 26వ తేదీ హైదరాబాదులో ఘనంగా నిశ్చితార్థం జరుపుకొనున్నారని తెలుస్తోంది. ఇక ప్రేమ వివాహం చేసుకుంటున్నారని గతంలో వార్తలు వచ్చాయి. అయితే ఇది ప్రేమ వివాహం కాదని పెద్దలు కుదిర్చిన వివాహం అని తెలుస్తోంది. ఇక ఈయన పెళ్లి చేసుకోబోయే అమ్మాయి టిడిపి నేత మనవరాలు అని సమాచారం.

శర్వానంద్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి పేరు రక్షిత రెడ్డి. ఈమె అమెరికాలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్. ఈమె తెలంగాణ హైకోర్టు న్యాయవాది మధుసూదన్ రెడ్డి కుమార్తె. మధుసూదన్ రెడ్డి సోదరుడు గంగారెడ్డి చిత్తూరు జిల్లాకు చెందిన తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే దివంగత బొజ్జల గోపాలకృష్ణా రెడ్డికి అల్లుడు కావడంతో రక్షిత రెడ్డి కూడా గోపాలరెడ్డికి మనవరాలు అవుతుంది.

Sharwanand:

ఇలా వీరిద్దరి వివాహం పెద్దలు నిశ్చయించిన వివాహం. జనవరి 26వ తేదీ వీరి వివాహం ఎలాంటి హగ్గు ఆర్పాటాలు లేకుండా చాలా సింపుల్ గా కుటుంబ సభ్యుల సమక్షంలో జరగబోతుంది ఇక వీరి వివాహం వేసవి సెలవులలో జరగబోతుందని తెలుస్తోంది. శర్వానంద్ పెళ్లి చేసుకుని కొత్త జీవితంలోకి అడుగుపెట్టడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Unstoppable With NBK 2: స్విమ్మింగ్ పూల్ ఫోటో పై స్పందించిన నారా లోకేష్.. ఆ ఫోటో నాదే అంటూ?

Unstoppable With NBK 2: నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అన్ స్టాపబుల్ సీజన్ 2 మొదలయ్యింది. నేటి మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఆహా లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే గత సీజన్ తో పోల్చుకుంటే ఈసారి సీజన్లో ఎంటర్టైన్మెంట్ డబల్ ఉంటుంది అని అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే అన్ స్టాపబుల్ సీజన్ 2 కి సంబంధించిన ప్రోమో ట్రైలర్ లకు ప్రేక్షకుల నుంచి భారీగా స్పందన లభించింది. అందుకు తగ్గట్టుగా మొదటి ఎపిసోడ్ కి బాలకృష్ణ వియ్యంకుడు టిడిపి అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు, తనయుడు నారా లోకేష్ అతిధులుగా విచ్చేశారు.

దీంతో ఆ ఎపిసోడ్ మరింత రసవత్తరంగా మారింది. ఇకపోతే ఆ సినిమా ట్రైలర్ లో 1995లో జరిగిన విషయాల గురించి అలాగే నారా లోకేష్ స్విమ్మింగ్ పూల్ ఫోటోల గురించి బాలకృష్ణ పలు ప్రశ్నలు సంధించిన విషయం తెలిసిందే. బాలకృష్ణ అడిగిన ప్రశ్నలపై చంద్రబాబు అలాగే నారా లోకేష్ కూడా ఆసక్తికరంగానే సమాధానం ఇచ్చారు. ఇకపోతే గతంలో నారా లోకేష్ కి సంబంధించిన కొన్ని పర్సనల్ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వరులు అయిన విషయం తెలిసిందే.

ఆ ఫోటోలలో ఉన్నారా లోకేష్ విదేశీ అమ్మాయిలతో కలిసి జలకాలు ఆడుతూ బీచ్ లో తిరుగుతూ ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో అప్పట్లో పెద్ద సెన్సేషన్ గా నిలిచాయి. అంతేకాకుండా ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ప్రతిపక్ష నాయకులు వాటిని సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్స్ చేస్తూ చంద్రబాబు ఫ్యామిలీ పై తీవ్ర స్థాయిలో విమర్శలను గుర్తించారు. కాగా ఆ ఫోటోలపై స్పందించిన లోకేష్.. ఆ ఫోటోలో ఉన్నది నేనే. అయినా అందులో తప్పు ఏముంది.

Unstoppable With NBK 2: కావాలంటే ఫోటోలు ఫ్రేమ్ కట్టిస్తాను..

2006లో కాలేజీ డేస్ లో సరదాగా దిగిన ఫోటోలు అవి. వారంతా నాతో పాటు నా సతీమణి బ్రహ్మణి కు కూడా కామన్ ఫ్రెండ్స్. వారితో నాకంటే బ్రహ్మణి ఎక్కువగా పరిచయం ఉంది.. ఫోటోలలో తప్పు ఏముంది అన్నది నాకైతే తెలియడం లేదు కావాలి అంటే ఆ ఫోటోలు ఫ్రేమ్ కట్టిస్తాను అంటూ తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు లోకేష్. కాగా అన్ స్టాపబుల్ సీజన్ 2 లో స్విమ్మింగ్ పూల్ ఫోటోలపై నారా లోకేష్ చేసిన వాక్యాలు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి.

చంద్రబాబు ఏడుపు పై సెటైర్ వేసిన రామ్ గోపాల్ వర్మ.. వైరల్ గా మారిన ట్వీట్..!

టాలీవుడ్ లో రామ్ గోపాల్ వర్మ సంచలనాలకు మారు పేరు. కాంట్రవర్సీలకు కింగ్ అని చెప్పవచ్చు. నిత్యం ఏదో వివాదం అతడి చుట్టూ తిరుగుతునే ఉంటుంది. ఎప్పుడు వివాదాస్పద వాఖ్యలు చేస్తూ నిత్యం సోషల్ మీడియాలో నిలుస్తూనే ఉంటారు. నిత్యం ఎవరినో ఒకరిని టార్గెట్ చేస్తూ వారిపై కామెంట్స్ చేయడం లాంటివి చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలోనే రాజకీయ నాయకులు, సినీ సెలబ్రిటీల పై కూడా సెటైర్స్ వేస్తూ ఉంటాడు.

తాజాగా రామ్ గోపాల్ వర్మ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై కూడా స్పందించారు.ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో చోటుచేసుకున్న పరిణామాలపై చంద్రబాబ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో టీడీపీ ఆఫీసులో మీడియాతో మాట్లాడుతూ బోరున విలపించారు. వెక్కి వెక్కి ఏడ్చారు. తాను ప్రజల కోసమే పోరాటం చేశానని చెప్పారు. తన భార్య ఏ రోజూ రాజకీయాల్లోకి రాలేదని అన్నారు. ఇవాళ నా భార్యను కించపరిచేలా దూషించారని కంటతడి పెట్టారు. తన జీవితంలో ఇలాంటి పరిణామాలు ఎప్పుడూ చూడలేదని అన్నారు.

నేడు జరిగిన ఘటనపై ఎం చెప్పాలో కూడా అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు. తనకు పదవులు అవసరం లేదని అన్నారు. తన పాలన కాలంలో ఎన్నో రికార్డులు సృష్టించానని తన రికార్డులు బద్దలు కొట్టాలంటే చాలా సమయం పడుతుందని వ్యాఖ్యానించారు. ఇదే విషయంపై రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో స్పందించారు.

ఈ మేరకు సోషల్ మీడియా ద్వారా తన ట్విట్టర్ ఖాతాలో ఒక పోస్టు చేశారు. ఆర్జీవి మిస్సింగ్ ట్రైలర్ ని చూసి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు బోరున ఏడ్చారు అంటూ రాంగోపాల్ వర్మ ట్వీట్ చేశారు. చంద్రబాబు ఏడ్చిన వీడియోని ఎడిట్ చేసి మూవీ ప్రమోషన్స్ లో వాడేశారు. చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతూ ఇదేం వాడకం అంటూ కామెంట్ చేస్తున్నారు. మరొక వైపు టిడిపి నేతలు, రామ్ గోపాల్ వర్మ పై ఒక రేంజ్ లో ఫైర్ అవుతున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.