Taraka Ratna: ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు చాలా హాట్ హాట్ గా కొనసాగుతున్నాయి. వచ్చే ఎన్నికలలో ఎలాగైనా అధికార పీఠాన్ని దక్కించుకోవాలన్న ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున రాష్ట్రంలో పర్యటిస్తుంది. ఈ క్రమంలోనే టిడిపి ప్రధాన కార్యదర్శి, యువ నాయకుడు నారా లోకేష్ యువగలం అనే పేరుతో పాదయాత్ర మొదలుపెట్టిన విషయం మనకు తెలిసిందే.
ఈ పాదయాత్రలో భాగంగా లోకేష్ తో పాటు నందమూరి తారకరత్న కూడా పాల్గొన్నారు.ఈ క్రమంలోనే స్పృహ తప్పిపోయిన తారకరత్న శరీరం మొత్తం నీలి రంగులోకి మారిపోయింది. దీంతో ప్రాథమిక చికిత్స నిర్వహించిన అనంతరం ఆయనని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.అక్కడ వైద్యులు పల్స్ చెక్ చేయడంతో పల్స్ పూర్తిగా పడిపోయిందని సిపిఆర్ చేసిన తర్వాత పల్స్ రేట్ కనిపించిందని తెలిపారు.
ఇలా తారకరత్న ఆసుపత్రి పాలు కావడంతో పలువురు టీడీపీ శ్రేణులు ఈ విషయంపై స్పందించి వారి అభిప్రాయాలను తెలియజేశారు. మరోవైపు వైసీపీ అభిమానులు మాత్రం ఇదే అదునుగా భావించి లోకేష్ పాదయాత్ర పై ట్రోల్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే టిడిపి నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ గా మారాయి.
ఈ సందర్భంగా బుచ్చయ్య చౌదరి ఈ విషయంపై స్పందిస్తూ తారకరత్న చనిపోతాడు అనుకున్నాం కానీ బాలయ్య రాకతో బతికేసాడు అంటూ గోరంట్ల బుచ్చయ్య చౌదరి చేసినటువంటి ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. తారకరత్న విషయంలో ఇది ఒక మిరాకిల్ అని ఈయన వ్యాఖ్యానిస్తూ బాలకృష్ణను ఉన్నఫలంగా దేవుడిని చేసేసాడు దీంతో ఈ కామెంట్స్ కాస్త వైరల్ గా మారాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…