టాలీవుడ్ లో రామ్ గోపాల్ వర్మ సంచలనాలకు మారు పేరు. కాంట్రవర్సీలకు కింగ్ అని చెప్పవచ్చు. నిత్యం ఏదో వివాదం అతడి చుట్టూ తిరుగుతునే ఉంటుంది. ఎప్పుడు వివాదాస్పద వాఖ్యలు చేస్తూ నిత్యం సోషల్ మీడియాలో నిలుస్తూనే ఉంటారు. నిత్యం ఎవరినో ఒకరిని టార్గెట్ చేస్తూ వారిపై కామెంట్స్ చేయడం లాంటివి చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలోనే రాజకీయ నాయకులు, సినీ సెలబ్రిటీల పై కూడా సెటైర్స్ వేస్తూ ఉంటాడు.
తాజాగా రామ్ గోపాల్ వర్మ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై కూడా స్పందించారు.ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో చోటుచేసుకున్న పరిణామాలపై చంద్రబాబ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో టీడీపీ ఆఫీసులో మీడియాతో మాట్లాడుతూ బోరున విలపించారు. వెక్కి వెక్కి ఏడ్చారు. తాను ప్రజల కోసమే పోరాటం చేశానని చెప్పారు. తన భార్య ఏ రోజూ రాజకీయాల్లోకి రాలేదని అన్నారు. ఇవాళ నా భార్యను కించపరిచేలా దూషించారని కంటతడి పెట్టారు. తన జీవితంలో ఇలాంటి పరిణామాలు ఎప్పుడూ చూడలేదని అన్నారు.
నేడు జరిగిన ఘటనపై ఎం చెప్పాలో కూడా అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు. తనకు పదవులు అవసరం లేదని అన్నారు. తన పాలన కాలంలో ఎన్నో రికార్డులు సృష్టించానని తన రికార్డులు బద్దలు కొట్టాలంటే చాలా సమయం పడుతుందని వ్యాఖ్యానించారు. ఇదే విషయంపై రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో స్పందించారు.
ఈ మేరకు సోషల్ మీడియా ద్వారా తన ట్విట్టర్ ఖాతాలో ఒక పోస్టు చేశారు. ఆర్జీవి మిస్సింగ్ ట్రైలర్ ని చూసి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు బోరున ఏడ్చారు అంటూ రాంగోపాల్ వర్మ ట్వీట్ చేశారు. చంద్రబాబు ఏడ్చిన వీడియోని ఎడిట్ చేసి మూవీ ప్రమోషన్స్ లో వాడేశారు. చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతూ ఇదేం వాడకం అంటూ కామెంట్ చేస్తున్నారు. మరొక వైపు టిడిపి నేతలు, రామ్ గోపాల్ వర్మ పై ఒక రేంజ్ లో ఫైర్ అవుతున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…