Tag Archives: Tiger Nageswara Rao movie

Raviteja: మరోసారి రెమ్యూనరేషన్ పెంచేసిన రవితేజ… ఏకంగా అన్ని కోట్లా!

Raviteja: ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో మాస్ మహారాజ రవితేజ ఒకరు. ఇండస్ట్రీలోకి వచ్చిన మొదటిలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు సినిమాలలో నటించిన రవితేజ అనంతరం హీరోగా అవకాశాలను అందుకున్నారు. ఇలా హీరోగా ఎంతో మంచి సక్సెస్ సాధించినటువంటి ఈయన హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలలో నటిస్తున్నారు.

ఇలా వరుస సినిమాలలో ఎంతో బిజీగా ఉన్నటువంటి రవితేజ ఒక్కో సినిమాకు 20 నుంచి 22 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. అయితే తాజాగా ఈయన తన రెమ్యూనరేషన్ పెంచినట్టు తెలుస్తుంది. ఈ క్రమంలోనే రవితేజ ప్రస్తుతం తన రెమ్యూనరేషన్ 25 కోట్లకు చేరిందని తెలుస్తోంది.

ఇలా ఒక్కసారిగా రెమ్యూనరేషన్ దాదాపు మూడు కోట్ల వరకు పెంచడంతో నిర్మాతలు కంగు తింటున్నారు.ఇలా రవితేజ ఈ స్థాయిలో రెమ్యూనరేషన్ పెంచడంతో కొన్ని సినిమాలు కనీసం ఓపెనింగ్స్ కూడా రాబట్ట లేకపోతున్నాయని బ్రేక్ ఈవెన్ కూడా కాలేకపోతున్నాయని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే రవితేజ ఈ స్థాయిలో రెమ్యూనరేషన్ పెంచడంతో నిర్మాతలు సైతం ఆలోచనలో పడ్డారని తెలుస్తుంది.

Raviteja: మూడు కోట్ల రెమ్యూనరేషన్ పెంచిన రవితేజ…


ఇక గత ఏడాది చివరిలో ధమాకా సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ సక్సెస్ అందుకున్న రవితేజ ఈ ఏడాది మొదట్లో వాల్తేరు వీరయ్య సినిమాలో కీలక పాత్రలో నటించి మరో సక్సెస్ అందుకున్నారు. అనంతరం రావణాసుర సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఫలితాలను అందుకోలేకపోయిందని చెప్పాలి. ఇక ప్రస్తుతం ఈయన టైగర్ నాగేశ్వరరావు సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.