Tag Archives: tollywood actors

Tollywood: మరోసారి ఏపీ సీఎం జగన్ ను కలవనున్న టాలీవుడ్ పెద్దలు… కారణం అదేనా?

Tollywood:ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చిత్రపరిశ్రమకు మధ్య గత కొంత కాలం నుంచి టికెట్ల రేట్ల విషయంపై పలు వివాదాలు విమర్శలు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలోనే నటుడు మోహన్ బాబు ఇలాంటి వివాదాలకు చోటివ్వకుండా రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలను కలిసి వారిని సన్మానించి మన ఇబ్బందులను తెలియచేయాలని వెల్లడించారు.

Tollywood: మరోసారి ఏపీ సీఎం జగన్ ను కలవనున్న టాలీవుడ్ పెద్దలు… కారణం అదేనా?

అయితే అప్పుడు మోహన్ బాబు చెప్పిన విధంగానే ఇప్పుడు టాలీవుడ్ సినీ ప్రముఖులు ఏపీ ముఖ్యమంత్రిని మరోసారి కలవడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది.గత కొంతకాలం నుంచి సినిమా టికెట్ల రేట్లను పెంచాలని ఎన్నోసార్లు ఏపీ ప్రభుత్వానికి విన్నపం చేసిన ప్రభుత్వం మాత్రం ఈ విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గేది లేదు అన్నట్టు ప్రవర్తించింది.

Tollywood: మరోసారి ఏపీ సీఎం జగన్ ను కలవనున్న టాలీవుడ్ పెద్దలు… కారణం అదేనా?

ఈ క్రమంలోనే మరోసారి చిరంజీవి ప్రభాస్ మహేష్ బాబు రాజమౌళి కొరటాల శివ తదితరులు వెళ్లి ఈ విషయం గురించి ముఖ్యమంత్రితో చర్చించిన కొద్ది రోజులకు కొత్త జీవో విడుదల చేశారు. ఈ జీవో ప్రకారం షరతులతో కూడిన టికెట్ల రేట్లను పెంచుతూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో చిత్ర పరిశ్రమకు ఊరట లభిస్తుందని పలువురు సినీ ప్రముఖులు భావిస్తున్నారు.

హాజరుకానున్న సినీ ప్రముఖులు…

ఈ క్రమంలోనే చిత్ర పరిశ్రమ పై సానుకూలంగా స్పందించిన ఏపీ ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్ రెడ్డిని మరోసారి టాలీవుడ్ పెద్దలు కలిసి సన్మాన సభ ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంలో జగన్ డేట్స్ అడ్జస్ట్ అయినప్పుడే అసలు స్పష్టత రానుంది. ఇకపోతే గతంలో సీఎంతో మీటింగుకు మమ్మల్ని ఆహ్వానించలేదని పలువురు విమర్శలు చేశారు. అయితే ఇప్పుడు సీఎం జగన్ ను కలవడం కోసం ఎవరెవరు వెళ్తారనే విషయం కూడా చర్చనీయాంశంగా మారింది.