Tag Archives: update

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. మరో అప్ డేట్ వచ్చేసింది..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఇటీవల తమ అభిమాన నటుడికి సంబంధించి సినిమా అప్ డేట్స్ ఇవ్వడం లేదని బాధపడ్డారు. అందులో ఓ అభిమాని అయితే ఏకంగా సూసైడ్ నోటే రాసేశాడు. మరో అభిమాని యూవీ క్రియేషన్స్ పై కేసు పెట్టండి సార్.. వాళ్లు తమ ఎమోషన్స్ తో ఆడుకుంటున్నారంటూ ఏకంగా సైబరాబాద్ పోలీసులకు ట్వీట్ చేశాడు.

ఇలా జరిగిన తర్వాత రాధే శ్యామ్ నుంచి అప్ డేట్ వచ్చింది. ఓ సాంగ్ ను విడుదల చేశారు చిత్ర సభ్యులు. ఇక తాజాగా ఈ సినిమా నుంచి క్రేజీ అప్ డేట్ వచ్చింది. ఇప్పటికే ఫస్ట్ గ్లింప్స్ విడుదల చేసి అంచ‌నాలు భారీగా పెంచిన మేక‌ర్స్ రెండో సాంగ్‌కి సంబంధించిన అప్‌డేట్ ఇచ్చింది. వన్ హార్ట్ టూ హార్ట్ బీట్స్ సాంగ్ లాంచ్‌కు ముందు దాని టీజర్ రేపు (నవంబర్ 29) విడుదల కానుంది.

‘రాధేశ్యామ్’ లవ్ ఆంథెమ్ సెకండ్ సాంగ్ హిందీ టీజర్‌ని మధ్యాహ్నం 1 గంటలకు లాంచ్ చేయనుండగా, తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ వెర్షన్‌లను రాత్రి 7 గంటలకు లాంచ్ చేయనున్నారు. దానికి సంబంధించిన పోస్టర్ ను సభ్యులు ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. ఇక ఈ సినిమా జనవరి 14 న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

పాన్ ఇండియా లెవల్లో విడుదల కానున్న ఈ సినిమా
గోపి కృష్ణ మూవీస్ ప్రైవేట్ లిమిటెడ్, యువీ క్రియేషన్స్‌ ద్వారా భారీ బడ్జెట్‌తో రూపొందుతోంది.
దీనికి జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందించగా, మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ప్రభాస్ సినిమాల్లో అన్నింటి కంటే ఈ సినిమా డిఫరెంట్ గా ఉండబోతోందని చిత్ర బృందం సభ్యులు తెలిపారు.

కమల్ హాసన్ హెల్త్ బులిటెన్ విడుదల.. వైద్యులు ఏం చెప్పారంటే..?

కరోనా కేసులు దేశంలో రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. దీంతో కరోనా థర్డ్ వేవ్ తప్పదనే అంచనాలకు వస్తున్నారు. జాగ్రత్తలు తీసుకోకపోతే.. మునుపటి పరిణామాల కంటే ఎక్కువగా ఉంటే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇదిలా ఉంటే. ఇటీవల తమిళ స్టార్ కమల్ హాసన్ కరోనా సోకి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే.

ప్రస్తుతం శ్రీ రామచంద్ర మెడికల్​ సెంటర్​ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే అతడు త్వరగా కోలుకోవాని తమిళనాడులోని కమల్ హాసన్ ఫ్యాన్స్ తో పాటు యావత్ దేశమంతా ప్రార్థిస్తుంది. అయితే అక్కడి వైద్యలు తాజాగా అతడి ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులిటెన్ ను విడదలు చేశారు. ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు తెలిపారు. తన తండ్రి కమల్​ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్న ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు నటి శ్రుతిహాసన్​.

త్వరలోనే అందరి ముందుకు వస్తారని.. ఆయన కూడా అదే ఆకాక్షింస్తున్నారని పేర్కొన్నారు. అయితే అతడికి కరోనా పాజిటివ్ గా నవంబర్ 22 న వచ్చినట్లు అతడే స్వయంగా ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. అమెరికా నుంచి అతడు ఇండియాకు వచ్చి.. వైద్య పరీక్షలు చేయించుకోగా కరోనా అని తేలింది. ఆ రోజు నుంచి అతడు సెల్ఫ్ క్వారంటైన్ అయ్యి.. వైద్యుల సమక్షంలో చికిత్స తీసుకుంటున్నారు.

ఇక ఇప్పటికే పలువురు సినీ పెద్దలు కమల్ హాసన్ కు ఫోన్ చేసి ఆరోగ్య వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. దీనిలో భాగంగానే రజనీకాంత్ కూడా ఉన్నారు. ఇలా క‌మ‌ల్‌ను ప‌రామ‌ర్శించిన వారిలో కోలీవుడ్ ఇండ‌స్ట్రీకి చెందిన శివకార్తికేయన్ , , విష్ణు విశాల్, ప్రభు, శరత్ కుమార్ తో పాటు ప‌లువురు ఉన్నారు.

గ్యాస్ సిలిండర్ బుక్ చేసున్నారా… అమల్లోకి 4 కొత్త నిబంధనలు..?

దేశంలో గ్యాస్ సిలిండర్ వినియోగదారుల సంఖ్య అంతకంతకూ పెరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే పెరుగుతున్న వినియోగదారులకు అనుగుణంగానే నిబంధనల్లో సైతం కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈరోజు నుంచి దేశవ్యాప్తంగా గ్యాస్ సిలిండర్ విషయంలో నూతన నిబంధనలు అమలులోకి రానున్నాయి. ఈ నూతన నిబంధనల గురించి తెలుసుకోని వినియోగదారులు ఇబ్బందులు పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

నేటి నుంచి గ్యాస్ సిలిండర్ వినియోగదారులు రిజిష్టర్డ్ మొబైల్ నంబర్ కు వచ్చే వన్ టైమ్ పాస్ వర్డ్ ను చెప్పాల్సి ఉంటుంది. ఎవరైతే వన్ టైమ్ పాస్ వర్డ్ ను చెబుతారో వాళ్లు మాత్రమే గ్యాస్ సిలిండర్ ను పొందగలగుతారు. గ్యాస్ సిలిండర్ డెలివరీ అడ్రస్ మారినా గ్యాస్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ మారినా వీలైనంత త్వరగా అప్ డేట్ చేయించుకుంటే మంచిది. లేకపోతే ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. ఆయిల్ కంపెనీలు ఇప్పటికే గ్యాస్ వినియోగదారులకు ఈ మేరకు సూచనలు చేస్తున్నాయి.

ఇండేన్ గ్యాస్ ను వినియోగించే వినియోగదారులకు బుకింగ్ నంబర్ మారింది. పాత బుకింగ్ నంబర్ కు కాల్ చేసి గ్యాస్ బుకింగ్ కోసం ప్రయత్నిస్తే గ్యాస్ బుకింగ్ కాదు. ఇండేన్ గ్యాస్ వినియోగదారులు 7718955555 కు కాల్ చేసి గ్యాస్ బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. గతంలో గ్యాస్ బుకింగ్ కు ఒక్కో సర్కిల్ లో ఒక్కో నంబర్ ఉండగా ప్రస్తుతం దేశవ్యాప్తంగా గ్యాస్ బుకింగ్ కు ఒకే నంబర్ ఉంది.

ప్రతి నెల ఒకటో తేదీన గ్యాస్ సిలిండర్ ధరలు మారుతూ ఉంటాయి. అందువల్ల గ్యాస్ సిలిండర్ ధర పెరిగిందో తగ్గిందో తెలుసుకుంటే సిలిండర్ డెలివరీ సమయంలో ఎటువంటి ఇబ్బందులు ఉండవు. అయితే కొన్ని సందర్భాల్లో గ్యాస్ సిలిండర్ ధర పెరగకుండా తగ్గకుండా స్థిరంగా ఉంటుంది. ఈ విషయాలను గుర్తుంచుకోవడం వల్ల గ్యాస్ సిలిండర్ డెలివరీ సమయంలో ఇబ్బందులు కలగవు.

పాన్ కార్డులో వివరాలు తప్పుగా ఉన్నాయా…? ఎలా మార్చుకోవాలంటే..?

ప్రస్తుత కాలంలో పాన్ కార్డు వల్ల ఉన్న ఉపయోగాలు అన్నీఇన్నీ కావు. మనకు ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్ ఎంత ముఖ్యమో పాన్ కార్డ్ కూడా అంతే ముఖ్యం. చాలా సందర్భాల్లో పాన్ కార్డ్ మనకు అనేక విధాలుగా ఉపయోగపడుతూ ఉంటుంది. ఉద్యోగంలో చేరే సమయంలో కంపెనీలు సైతం పాన్ కార్డ్ వివరాలను కోరతాయి. అయితే మనలో చాలామంది పాన్ కార్డ్ లో వివరాలు తప్పుగా ఉండటం వల్ల ఇబ్బందులు పడుతూ ఉంటారు.

పాన్ కార్డులో తప్పులు ఉన్నాయని తెలిసినా చాలామందికి ఆ తప్పులను ఏ విధంగా సరిదిద్దుకోవాలో తెలియదు. ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ దాఖలు చేయడం కోసం, ఐడెంటిటీ కార్డుగా పాన్ కార్డు ఉపయోగపడుతుంది. జీఎస్టీ చెలించాలంటే కూడా పాన్ కార్డ్ తప్పనిసరిగా ఉండాల్సిందే. బ్యాంకులలో ఎక్కువ మొత్తంలో లావాదేవీలు నిర్వహించే వాళ్లు పాన్ కార్డ్ ఉంటే మాత్రమే ఆ లావాదేవీలను నిర్వహించడం సాధ్యమవుతుంది.

క్రెడిట్ కార్డ్ కోసం దరఖాస్తు చేయాలన్నా, బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలన్నా పాన్ కార్డ్ తప్పనిసరిగా కలిగి ఉండాలి. అయితే పాన్ కార్డ్ వివరాలు తప్పుగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. సులభంగా ఇంట్లో నుంచే పాన్ కార్డ్ లోని తప్పులను సరి చేసుకునే అవకాశం ఉంది. పాన్ కార్డులో తప్పులు సరిచేసుకోవాలంటే ఎన్ఎస్‌డీఎల్ వెబ్‌సైట్‌ లో సర్వీసెస్ ట్యాబ్‌పై క్లిక్ చేసి పాన్ కార్డ్ ఆప్షన్ ను ఎంచుకోవాలి.

అనంతరం పాన్ కార్డ్ రీప్రింట్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ఓపెన్ అయ్యే కొత్త అప్లికేషన్ లో సరైన వివరాలను పొందుపరచాలి. అనంతరం ఈకేవైసీ పూర్తి చేసి పేమెంట్ పూర్తి చేయాలి. ఆ తర్వాత అప్ డేట్ అయిన వివరాలతో కొత్త పాన్ కార్డును పొందవచ్చు.