Tag Archives: vakeel saab

Vakeel Saab: వకీల్ సాబ్ సీక్వెల్ … క్లారిటీ ఇచ్చిన డైరక్టర్ వేణు… ఫాన్స్ కు పూనకాలే?

Vakeel Saab: టాలీవుడ్ ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయనకి ఉన్న ఫాలోయింగ్ వల్ల ప్రతి దర్శకుడు పవన్ కళ్యాణ్ తో ఒక్కసారి అయినా కలిసి పని చేయాలని కోరుకుంటారు. అయితే వకీల్ సాబ్ డైరెక్టర్ వేణు శ్రీరామ్ మాత్రం పవన్ కళ్యాణ్ తో మరొకసారి కలిసి పని చేయటానికి సిద్దమవుతున్నాడు.
వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా విడుదలైన వకీల్ సాబ్ సినిమా పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీకి మంచి కమ్ బ్యాక్ ఇచ్చింది.

ఈ సినిమా రీమేక్ అయినప్పటికీ.. పవన్ ఇమేజ్ కు తగ్గట్లు చేర్పులు, మార్పులు చేయటంతో ఈ సినిమా మంచి హిట్ అయ్యింది. ఆ సినిమా తర్వాత వేణు శ్రీరామ్ నుండి ఒక్క సినిమా కూడా రాలేదు. ఇదిలా ఉండగా ఇటీవల సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటించిన వేణు తన తదుపరి ప్రాజెక్ట్స్ గురించి క్లారిటీ ఇచ్చాడు. వేణు ప్రస్తుతం స్క్రిప్ట్స్ రాసే పనిలో ఉన్నాడు. ఈ క్రమంలోనే ‘వకీల్ సాబ్’ సీక్వెల్ పై వేణు క్లారిటీ ఇచ్చేశాడు. దీంతో పవన్ అభిమానులు వకీల్ సాబ్ సీక్వెల్ గురించి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఒకవైపు సినిమాలు మరొకవైపు రాజకీయాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. వచ్చే ఏడాది ఎన్నికల కోసం పవన్ ప్రచారం మొదలుపెట్టానున్నాడు. దీంతో సినిమా షూటింగ్ పనులు పూర్తి చేసి ఆ తర్వాత ప్రచార కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ మరొక కొత్త సినిమా కి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడో? లేదో? అని అభిమానులు ఆలోచనలో పడ్డారు.

Vakeel Saab: వకీల్ సాబ్ సీక్రెట్ పక్కా..

ఇటీవల సోషల్ మీడియాలో ద్వారా ముచ్చటించి డైరెక్టర్ వేణు పవన్ కళ్యాణ్ తో ‘వకీల్ సాబ్’ సీక్వెల్ చేయబోతున్నట్లు క్లారిటీ ఇచ్చాడు. తొలి పార్ట్ లో కంటే ఈసారి ఫ్యాన్స్ పూనకాలు తెప్పించే చాలా సీన్స్ ఉన్నాయి’ అని చెప్పుకొచ్చారు. అయితే పవన్ కళ్యాణ్ ప్రస్థుత పరిస్థితి చూస్తుంటే.. పవన్ ఈ సీక్వెల్ చేస్తారా అనే సందేహం కలుగుతోంది. ఒకవేళ పవన్ కు కుదరకపోతే.. వేణు మరో హీరోతో ఈ సినిమా చేస్తారా? లేదా పవన్ కోసం ఎదురుచూస్తారా అనేది చూడాలి మరి.

పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ లా డాక్టర్ సాబ్.. ఇందులో ఎవరికీ న్యాయం చేస్తారో?

దేవుళ్లు మన కంటికి కనిపించరు.. కానీ మన కంటికి కనిపించే దేవుళ్లు మాత్రం డాక్టర్లు అంటారు పెద్దలు. కరోనా సమయంలో వారు దానిని నిరూపించారు. ఎంతో మంది ప్రాణాలను కాపాడి తమ వైద్య వృత్తికి న్యాయం చేశారు. ఆ డాక్టర్ల యొక్క నిజ జీవితాలను మన కళ్ల ముందుంచే ప్రయత్నమే ‘డాక్టర్ సాబ్’ మూవీ. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకుంది.

ఎస్పీ క్రియేషన్స్ బ్యానర్‌పై డి.ఎస్.బి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ‘డాక్టర్ సాబ్’ మూవీలో శోభన్ హీరోగా నటిస్తున్నాడు. నిత్యం డాక్టర్లు ఎదుర్కొనే ఇబ్బందులు, పరిస్థితుల నేపథ్యంలో నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఈ మూవీ రూపొందిస్తున్నారు. దీనికి అమ్మపండు సంగీత దర్శకుడిగా పని చేస్తున్నాడు. మొదటి షెడ్యూల్ విజయవంతంగా పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఈ సనిమా గురించి ఎస్.పీ వివరాలను తెలియజేశారు.

తన స్నేహితుడు డి.ఎస్.బి ఈ కథను రెడీ చేశాడని.. స్క్రిప్ట్ బాగా కుదిరిందని తెలియజేశాడు. ఇటీవల ఈ సినిమా మొదటి షెడ్యూల్ ను ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా.. అనుకున్నది అనుకున్నట్లు తీశామని.. మరో షెడ్యూల్‌ను తర్వలోనే ప్లాన్ చేస్తామన్నారు. ఈ సినిమాకు సంబంధించి అన్ని కార్యక్రమాలను ఎంత వీలుంటే అత త్వరగా పూర్తి చేసి.. ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనేది తమ ప్రయత్నమన్నారు.

ఈ సినిమాలో ఫైట్స్, డ్యాన్స్ ల విషయంలో హీరో శోభన్ ఎక్కడా తగ్గలేదని.. ట్రైనింగ్ తీసుకొని మరీ కష్టపడి చేశాడని ప్రశంసించాడు. ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ లోగోను రెండు నెలల క్రితం ఆవిష్కరించిన విషయం తెలిసిందే. అన్ని రకాల ఆడియన్స్ కు ఈ సినిమా నచ్చుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సినిమాకు సినిమాటోగ్రఫీ గా ఎం మురళీకృష్ణ‌ పనిచేస్తుండగా.. పాటలు న‌ర్సింగ‌రావు అందిస్తున్నారు.

అమ్మో.. ‘థమన్’ ఒక సినిమాకు అన్ని కోట్లు తీసుకుంటున్నాడా..?

సినీ ఇండస్ట్రీలో వరుసగా ఓ రెండు సినిమాలు హిట్ అయితే.. వెంటనే రెమ్యూనరేషన్ లు పెంచేస్తూ వుంటారు నటీ నటులు.అది హీరో కావచ్చు,హీరోయిన్ కావచ్చు, హిట్స్ ఇచ్చిన డైరక్టర్ కావచ్చు, ఊపు మీద ఉన్న మ్యూజిక్ డైరక్టర్ కావచ్చు. ఎవరైనా సరే తమ రేటు టైమ్ చూసి పెంచేస్తారు. వాళ్లు తమంతట తాము పెంచకపోయినా నిర్మాతలు వాళ్ల డేట్స్ కోసం రెమ్యునేషన్ పెంచేసి ఆఫర్ చేస్తారు. ఇప్పుడు అదే తమన్ కు జరుగుతోందిట.

నిజానికి ఇప్పుడున్న పరిస్దితుల్లో తమన్ తన రెమ్యునేషన్ పెంచాలనుకోలేదట. కానీ నిర్మాతలు ఒప్పుకోవటం లేదుట.కోటిన్నర నుంచి రెండు కోట్ల దాకా తమన్ కు ఆఫర్ చేస్తున్నారట పెద్ద సినిమాల వాళ్లు.అందులో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్యాకేజ్ కూడా కలిపే ఉందిట. ఒకప్పుడు యాభై లక్షలు ఇచ్చిన నిర్మాతలు సైతం ఇదే రేటుని ఫాలో అయ్యిపోతున్నారట. ముఖ్యంగా తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇస్తే సినిమా సూపర్ హిట్టే అంటున్నారు. ఒకప్పుడు మణిశర్మకు ఉండేది ఈ పేరు. ఇఫ్పుడు తమన్ ఈ ప్లేస్ లోకి వచ్చేసాడు.ఎందుకిలా అంటే మ్యూజిక్‌ డైరెక్టర్‌ తమన్‌ మంచి జోరు మీద ఉన్నాడు.

చిన్న, పెద్ద అనే తేడా లేకుండా వరస సినిమాలకు మ్యూజిక్ అందిస్తూ టాలీవుడ్‌లో టాప్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌గా దూసుకెళ్తున్నాడు. ‘అల వైకుంఠపురము’లో తర్వాత ఆయన సంగీతంలో మరింత కొత్తదనం కనిపిస్తోందని అంటున్నారు. ఇంతకు ముందులా రొటీన్‌గా కాకుండా ఢిపరెంట్‌ స్టైల్‌లో సంగీతం అందించి ఆకట్టుకుంటున్నాడు. అప్పుడప్పుడూ కాపీ ట్రాక్ లు, తననే తనే అనుకరించుకుంటాడు వంవిటి వినిపించినా…ఆఫర్స్ కు లోటు లేదు.

తమన్ ఈ ఏడాది ‘క్రాక్‌’, ‘వకీల్‌సాబ్‌’, ‘వైల్డ్‌ డాగ్‌’ లాంటి పెద్ద సినిమాలకు సంగీతం అందించాడు. వాటిలో క్రాక్, ‘వకీల్‌సాబ్‌’లోని పాటలు జనాన్ని విపరీతంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ‘మగువా’ సాంగ్‌ సూపర్‌ హిట్‌ అయింది. ఇలా మెలోడీలతో పాటు మాస్‌ సాంగ్స్‌ని కూడా ఆకట్టుకునేలా కంపోజ్‌ చేస్తూ.. రాక్‌స్టార్‌ దేవిశ్రీ ప్రసాద్‌కు సరైన పోటీగా నిలుస్తున్నాడు.దాంతో ప్రస్తుతం తమన్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ప్ర్రస్తుతం తమన్ ఖాతాలో అరడజను కు పైనే సినిమాలున్నాయని తెలుస్తుంది. ఓవైపు మహేష్ బాబుకు వరుసగా సర్కారు వారి పాట, త్రివిక్రమ్ సినిమాలకు అందిస్తున్నాడు. అలాగే నందమూరి బాలయ్యకు అఖండ సినిమాకు కూడా తమన్ సంగీతం అందిస్తున్నాడు..!!

‘వకీల్ సాబ్’ లాభాల్లో పవన్ కి భారీ వాటా..ఎన్ని కోట్లో తెలుసా..??

అజ్ఞాత వాసి సినిమా తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలు వదిలేసి.. రాజకీయాల్లో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. అయితే దాదాపు మూడు సంవత్సరాల తర్వాత మళ్ళీ సినిమాలు చేయడానికి రెడీ అయ్యాడు పవన్.. దానికి కారణం డబ్బు..ఈ విషయాన్ని ఆయనే స్వయంగా పలు సందర్భాల్లో చెప్పడం జరిగింది..అయితే డబ్బుల కోసమే సినిమా తీస్తున్నాన్న పవన్ కోరిక ‘వకీల్ సాబ్’తో తీరింది.

ఇప్పుడు ‘వకీల్ సాబ్’ లాంటి బ్లాక్ బస్టర్ మూవీతో ఇటు హీరో పవన్ కళ్యాణ్, అటు నిర్మాత దిల్ రాజు ఫుల్ హ్యాపీ అంట..ఎందుకంటే నాన్చి నాన్చి బయటకొచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెను సంచలనం సృష్టించింది.వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో పవన్ సరసన శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటించింది.. నివేదా థామస్, అంజలి, అనన్య కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా రికార్డు కలెక్షన్లతో లాభాల పంట పండించింది.

ఈ సినిమా ఇప్పటిదాకా మొత్తం 150 కోట్ల వసూళ్లు సాధించినట్టు టాలీవుడ్ వర్గాల భోగట్టా.. ముందుగా అనుకున్న దాని ప్రకారం.. పవన్ కళ్యాణ్ కు ఈ సినిమా కోసం రూ.50 కోట్ల పారితోషికంతోపాటు లాభాల్లో వాటా ఇస్తానని నిర్మాత దిల్ రాజు చెప్పుకొచ్చాడట..ఇప్పుడు అన్నీ పోను పవన్ కళ్యాణ్ కు లాభాల్లో వాటాగా మరో రూ.15 కోట్లు ఇచ్చినట్టు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.అంటే వకీల్ సాబ్ సినిమాకు గాను పవన్ కు ఏకంగా రూ.65 కోట్ల పారితోషికం వచ్చిందన్న మాట..ఇక నిర్మాత దిల్ రాజుకు అన్నీ పోను రూ.50 కోట్లు లాభం వచ్చినట్టు సమాచారం.

ఇక ఇందులోంచి రూ.కోటి రూపాయలను వకీల్ సాబ్ లో కీలక పాత్ర పోషించిన ప్రకాష్ రాజ్ కు రెమ్యూనరేషన్ గా పంచినట్టు తెలుస్తోంది. ఇక పార్ట్ నర్ బోనీకపూర్ కు కూడా ఇందులోనే వాటా ఇవ్వనున్నారు.ఇలా ఒకే ఒక్క సినిమాతో నిర్మాత దిల్ రాజు, పవర్ స్టార్ పవన్ లాభాల పంట పండించుకున్నారు. వీరిద్దరికి ఈ సినిమా ఊహించని సంపదను తెచ్చిపెట్టిందని ఇండస్ట్రీలో ఇప్పుడు ఈ విషయం గురించే చర్చ సాగుతోంది.. !!

భారీగా పడిపోయిన ‘వకీల్ సాబ్’ కలెక్షన్లు.. కారణం ఏంటో తెలుసా..??

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తూ.. నటించిన తాజా చిత్రం వకీల్ సాబ్.. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా నిర్మించారు.. ఎన్నో అంచనాల నడుమ ఏప్రిల్ 9 న విడుదలైన వకీల్ సాబ్ అభిమానుల అంచానలకు తగ్గట్టు బ్లాక్ బస్టర్ విజయంనమోదు చేసింది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మూడేళ్ల విరామం తర్వాత వచ్చినా.. ఆయన పవర్ ఏ మాత్రం తగ్గలేదని నిరూపించింది. కానీ సినిమా మొదలయినప్పటి నుంచి దీనికి కష్టాలు తప్పట్లేదు.

ఇప్పటికే ఈ సినిమా నటీనటులకు, ప్రొడ్యూసర్లకు కరోనా సోకింది. పవన్ కల్యాణ్‌, దిల్ రాజు, నివేథా తామస్ కరోనా బారిన పడ్డారు. విజయోత్సవాలు కూడా చేసుకోలేక పోయారు.ఇదిలా ఉంటే కరోనా వైరస్ ప్రకపంనలు సృష్టిస్తున్న నేపథ్యంలో బుధవారం నుండి తెలంగాణలో థియేటర్లన్నింటినీ మూసివేసింది తెలంగాణ ఎగ్జిబ్యూటర్ల అసోసియేషన్ సంఘం. కానీ ‘వకీల్ సాబ్’ విషయంలో మాత్రం ఇందుకు మినహాయింపు ఇచ్చింది.

భారీ బడ్జెట్ సినిమా కావడతో దీనికి కొన్ని ఆంక్షలతో మినహాయింపు ఇచ్చారు. ఈ వారాంతం వరకు ‘వకీల్ సాబ్’థియేటర్లలో ఆడనుంది. అయితే సోమవారం నుండి ఈ సినిమాను కూడా ఆపేస్తారు.
కొన్ని థియేటర్లలో ఈరోజు నుంచే ‘వకీల్ సాబ్’ సినిమాను నిలిపివేశారు. ‘వకీల్ సాబ్’ మూవీకి వారం రోజులుగా సరైన రెస్పాన్స్ కనిపించకపోవడమే ఇందుకు కారణం. ఉగాది తర్వాత నుంచి థియేటర్లకు ప్రేక్షకులు పెద్దగా రావట్లేదు.

హైదరాబాద్ సిటీ సెంటర్ లో ఉన్న మల్టీప్లెక్స్ థియేటర్లలో కూడా 25మందికి మించి రావట్లేదు. దీంతో థియేటర్ యజమానులు క్లోజ్ చేయాలని నిర్ణయించారు. ఈ నిర్ణయం వకీల్ సాబ్‌కు పెద్ద నష్టమే చేస్తోంది. ఎందుకంటే ఈసినిమాకు 120కోట్ల దాకా షేర్ మార్కెట్ జరిగిందని సమాచారం. మరి అంత మొత్తంలో ఇప్పటికీ కూడా వసూలు చేయలేదు. ఇది పవన్ ఫ్యాన్స్ క పెద్ద దెబ్బే అని చెప్పాలి…!!