సినీ ఇండస్ట్రీలో వరుసగా ఓ రెండు సినిమాలు హిట్ అయితే.. వెంటనే రెమ్యూనరేషన్ లు పెంచేస్తూ వుంటారు నటీ నటులు.అది హీరో కావచ్చు,హీరోయిన్ కావచ్చు, హిట్స్ ఇచ్చిన డైరక్టర్ కావచ్చు, ఊపు మీద ఉన్న మ్యూజిక్ డైరక్టర్ కావచ్చు. ఎవరైనా సరే తమ రేటు టైమ్ చూసి పెంచేస్తారు. వాళ్లు తమంతట తాము పెంచకపోయినా నిర్మాతలు వాళ్ల డేట్స్ కోసం రెమ్యునేషన్ పెంచేసి ఆఫర్ చేస్తారు. ఇప్పుడు అదే తమన్ కు జరుగుతోందిట.
నిజానికి ఇప్పుడున్న పరిస్దితుల్లో తమన్ తన రెమ్యునేషన్ పెంచాలనుకోలేదట. కానీ నిర్మాతలు ఒప్పుకోవటం లేదుట.కోటిన్నర నుంచి రెండు కోట్ల దాకా తమన్ కు ఆఫర్ చేస్తున్నారట పెద్ద సినిమాల వాళ్లు.అందులో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్యాకేజ్ కూడా కలిపే ఉందిట. ఒకప్పుడు యాభై లక్షలు ఇచ్చిన నిర్మాతలు సైతం ఇదే రేటుని ఫాలో అయ్యిపోతున్నారట. ముఖ్యంగా తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇస్తే సినిమా సూపర్ హిట్టే అంటున్నారు. ఒకప్పుడు మణిశర్మకు ఉండేది ఈ పేరు. ఇఫ్పుడు తమన్ ఈ ప్లేస్ లోకి వచ్చేసాడు.ఎందుకిలా అంటే మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మంచి జోరు మీద ఉన్నాడు.
చిన్న, పెద్ద అనే తేడా లేకుండా వరస సినిమాలకు మ్యూజిక్ అందిస్తూ టాలీవుడ్‌లో టాప్ మ్యూజిక్ డైరెక్టర్‌గా దూసుకెళ్తున్నాడు. ‘అల వైకుంఠపురము’లో తర్వాత ఆయన సంగీతంలో మరింత కొత్తదనం కనిపిస్తోందని అంటున్నారు. ఇంతకు ముందులా రొటీన్‌గా కాకుండా ఢిపరెంట్ స్టైల్‌లో సంగీతం అందించి ఆకట్టుకుంటున్నాడు. అప్పుడప్పుడూ కాపీ ట్రాక్ లు, తననే తనే అనుకరించుకుంటాడు వంవిటి వినిపించినా…ఆఫర్స్ కు లోటు లేదు.
తమన్ ఈ ఏడాది ‘క్రాక్’, ‘వకీల్‌సాబ్’, ‘వైల్డ్ డాగ్’ లాంటి పెద్ద సినిమాలకు సంగీతం అందించాడు. వాటిలో క్రాక్, ‘వకీల్‌సాబ్’లోని పాటలు జనాన్ని విపరీతంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ‘మగువా’ సాంగ్ సూపర్ హిట్ అయింది. ఇలా మెలోడీలతో పాటు మాస్ సాంగ్స్‌ని కూడా ఆకట్టుకునేలా కంపోజ్ చేస్తూ.. రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్‌కు సరైన పోటీగా నిలుస్తున్నాడు.దాంతో ప్రస్తుతం తమన్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ప్ర్రస్తుతం తమన్ ఖాతాలో అరడజను కు పైనే సినిమాలున్నాయని తెలుస్తుంది. ఓవైపు మహేష్ బాబుకు వరుసగా సర్కారు వారి పాట, త్రివిక్రమ్ సినిమాలకు అందిస్తున్నాడు. అలాగే నందమూరి బాలయ్యకు అఖండ సినిమాకు కూడా తమన్ సంగీతం అందిస్తున్నాడు..!!
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…