Featured

బిరుదులు మార్చుకున్న టాలీవుడ్ స్టార్ హీరోలు..!!

సినిమా పరిశ్రమలో స్టార్ హీరోల పేర్లకన్నా ఈ బిరుదులనే అభిమానులు అమితంగా ఇష్టపడతారనడంలో ఎలాంటి సందేహం లేదనే చెప్పాలి. తమ అభిమాన హీరో పేరు ముందు ప్రత్యేకంగా ఉండటానికి అభిమానులు కొన్నిసార్లు దర్శకులు ఇలా బిరుదులు ఇస్తుంటారు. అయితే కొందరు హీరోలు గతంలో వచ్చిన పేర్లను మారిపోయి కొత్త టైటిల్‌ పేర్లతో పలకరించిన సందర్భాలున్నాయి. ఆ వివరాలు చూద్దాం..

1.ఐకాన్‌స్టార్‌గా.. అల్లు అర్జున్‌

అల్లు అర్జున్‌ ఇప్పుడు ఐకాన్‌ స్టార్‌గా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. సుకుమార్‌తో ఆయన తీస్తున్న పాన్‌ ఇండియా చిత్రం ‘పుష్ప’.ఇప్పటికే విడుదలైన టీజర్‌తో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. ఆ టీజర్‌తో పాటే, అల్లు అర్జున్‌ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన పోస్టర్‌లో తన పేరుకు ముందు ఐకాన్‌ స్టార్‌ అని ఉండటమే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇన్నాళ్లూ స్టైలిష్‌ స్టార్‌గా పిలుచుకునే అల్లు అర్జున్‌ ఇప్పుడు ఐకాన్‌ స్టార్‌గా మారిపోనున్నాడని ఇండస్ట్రీ వర్గాలు చెప్పుకుంటున్నాయి.

2.సుప్రీమ్‌ హీరో నుంచి మెగాస్టార్‌

అగ్ర కథానాయకుడు చిరంజీవి అభిమానులు ముద్దుగా మెగాస్టార్‌ అని పిలుచుకుంటారు. ఆ పేరు వెండితెరపై పడితే చాలు అభిమానులకు పూనకాలు వచ్చేస్తుంటాయి. అయితే మెగాస్టార్‌ కన్నా ముందు డైనమిక్‌ హీరో అని తెరపై పడేది. ఆ తర్వాత అంచెలంచెలుగా స్టార్‌ హీరోగా ఎదుగుతున్న క్రమంలో సుప్రీమ్‌ హీరో అని పిలుచుకునే వారు అభిమానగణం. ‘మరణమృదంగం’ సినిమా నుంచి చిరు మెగాస్టార్‌గా మారిపోయాడు. ఆ తర్వాత కాలంలోనూ మెగాస్టార్‌గానే అభిమానుల గుండెల్లో నిండిపోయారు. ఇప్పటికీ.. ఎప్పటికీ చిరు మెగాస్టార్‌గానే గుర్తుండిపోతారని చెబుతారు మెగా అభిమానులు.

3.నటసింహం.. బాలకృష్ణ

తెలుగు చిత్ర పరిశ్రమలో బాలకృష్ణ ప్రత్యేకమైన ఇమేజ్‌ ఉంది. క్లాస్‌, మాస్‌, జానపదం, పౌరాణికం ఇలా పాత్ర ఏదైనా ఆయన బరిలోకి దిగనంత వరకే.. ఒకసారి అడుగు పెట్టారా? చరిత్ర సృష్టిస్తారు. కథానాయకుడిగా కెరీర్‌ మొదలు పెట్టినప్పటి నుంచి ఆయనను యువరత్నగానే పిలుచుకునేవారు. అయితే బోయపాటితో తీసిన ‘సింహ’తో బాలకృష్ణ నటసింహంగా మారిపోయాడు.

4.మన్మథుడి పేరూ మారింది..

తెలుగు చిత్ర పరిశ్రమలో యువ దర్శకులను ప్రోత్సహిస్తూ, ప్రయోగాలకు ఆసక్తి చూపే అగ్ర కథానాయకుడు నాగార్జున. అక్కినేని నట వారసుడిగా చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టిన ఆయనను అభిమానులు ‘యువ సామ్రాట్‌’ అని పిలుచుకునేవారు. ‘కింగ్‌’ సినిమా తర్వాత ఆయన పేరు ముందు ‘కింగ్‌’ టైటిల్‌ వచ్చి చేరింది.

5.సూపర్‌స్టార్‌ అలా..

కృష్ణ వారసుడిగా తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు మహేశ్‌బాబు. బాలనటుడిగానే తనదైన ముద్రవేశారు. కృష్ణ స్టార్‌డమ్‌తో పాటు టైటిల్‌నూ కొనసాగిస్తున్నారాయన. మొదటి చిత్రం నుంచే ఆయన ప్రిన్స్‌గా పరిచయం అయ్యారు. ఇప్పుడు సూపర్‌ స్టార్‌గా టాలీవుడ్‌లో ఓ వెలుగు వెలుగుతున్నారు. ‘దూకుడు’ చిత్రం నుంచి ‘ప్రిన్స్‌’ కాస్తా సూపర్‌ స్టార్‌గా మారిపోయాడాయన. అది మహేశ్‌ కెరియర్‌లో మైలురాయిగా నిలిచిపోయింది. కలెక్షన్ల పరంగా సరికొత్త రికార్డు సృష్టించింది.

6.ఎన్టీఆర్‌ ఏ1 స్టార్‌

 

నూనుగు మీసాల వయసులో టాలీవుడ్‌కి ఇండస్ట్రీ హిట్టు అందించారు ఎన్టీఆర్‌. తాత నట వారసత్వాన్ని పుణికి పుచ్చుకని డైలాగ్‌లు, డ్యాన్స్‌లతో వెండితెరపై చిరుతపులిలా దూకుడుగా కనిపిస్తారు తారక్‌. అందుకే ఆయన్ను ‘యంగ్‌టైగర్‌’ అని అభిమానులు పిలుచుకుంటున్నారు. ‘శక్తి’ సినిమా సందర్భంగా ‘ఏ1 స్టార్‌’గా మారినా ఆ తర్వాత ‘యంగ్‌టైగర్‌’టైటిల్‌తోనే కంటిన్యూ అవుతున్నాడు…!!

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago