Tag Archives: vijayawada

సీరియల్ హీరో రవికృష్ణ సంపాదన ఎంతో తెలిస్తే… ఆశ్చర్యపోతారు!

బుల్లితెరలో ప్రసారమయ్యేపలు సీరియల్స్ లో హీరోగా రాణిస్తూ ఎంతో మంచి క్రేజ్ సంపాదించుకున్న రవి కృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రవికృష్ణకు ఎంతో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.వీరిలో ముఖ్యంగా అమ్మాయిల ఫాలోయింగ్ ఈ హీరోకి ఎక్కువ అని చెప్పవచ్చు. ఆంధ్రప్రదేశ్ విజయవాడకు చెందిన రవి కృష్ణ చిన్నప్పటి నుంచి నటనపై ఆసక్తి ఉండటం చేత స్కూల్లో కల్చరల్ ప్రోగ్రామ్స్ లో పాల్గొనేవాడు. ఈ క్రమంలోనే నటన రంగంవైపు వెళ్తానని చెప్పడంతో కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదు.

రవికృష్ణ తన మామయ్య సహకారంతో ఇండస్ట్రీ వైపు వచ్చారు.ఈ క్రమంలోనే మొదటిగా అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తూ యాక్టర్ గా ప్రయత్నాలు కొనసాగించేవాడు. ఈ క్రమంలోనే ఈ టీవీలో ప్రసారమయ్యే హృదయం అనే సీరియల్ ద్వారా మొట్టమొదటిసారిగా తెరపై కనిపించారు.ఆ తర్వాత బొమ్మరిల్లు సీరియల్ లో కూడా కొన్ని ఎపిసోడ్స్ వరకు రవికృష్ణ తెరపై సందడి చేశారు.

ఈ విధంగా సీరియల్స్లో నటించిన రవి కృష్ణ మరి అసిస్టెంట్ డైరెక్టర్ పనిలోకి వెళ్లారు.ఆ సమయంలోనే మొగలిరేకులు, వరూధిని పరిణయం సీరియల్ లో నటించే అవకాశం వచ్చింది.వరూధిని పరిణయం ద్వారా ఎంతో గుర్తింపును సంపాదించుకున్న రవి కృష్ణ ఆ తర్వాత వరుస సీరియల్ చేశారు. ఇదే ఫ్యాన్ ఫాలోయింగ్ తో బిగ్ బాస్ సీజన్ 3లోకి ఎంటర్ అయి మరింత క్రేజ్ సంపాదించుకున్నారని చెప్పవచ్చు.

బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత ప్రస్తుతం ఆమె కథ అనే సీరియల్ లో నటిస్తున్నారు.కెరియర్ మొదట్లో ఒక్కో ఎపిసోడ్ 5 వేల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకునే రవికృష్ణ ప్రస్తుతం ఒక్కో ఎపిసోడ్ 20 వేల రూపాయల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. అంటే సుమారుగా వారానికి లక్షన్నర వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఇతని ఆస్తిని కూడా బాగా పోగేసినట్టు తెలుస్తోంది. ఇండస్ట్రీలోకి వచ్చిన కొంతకాలానికి సుమారు నాలుగు కోట్ల రూపాయల ఆస్తిని సంపాదించారని తెలుస్తోంది.

అంత్యక్రియలయ్యాయి.. ఆమె తిరిగొచ్చేసింది..!

ఎవరైనా మన బంధువుల లో చనిపోయారు అని తెలిస్తే వారికి అంత్యక్రియలు నిర్వహించడం సర్వసాధారణమే. అయితే ప్రస్తుతం కరోనా నేపథ్యంలో అంత్యక్రియలకు కూడా ఎవరూ హాజరు కాకూడదని నిబంధన ఉండటంతో సమీప బంధువులు చనిపోయినప్పటికీ బంధువులు వెళ్లడం లేదు. ఈ క్రమంలోనే కేవలం కుటుంబ సభ్యులు మాత్రమే వారి అంత్యక్రియలలో పాల్గొంటున్నారు. ఈ విధంగా కరోన బారినపడి చనిపోయిందని తనకు అంత్యక్రియలు నిర్వహించారు. కానీ పెద్దకర్మ చేస్తుండగా సాక్షాత్తు చనిపోయిన మనిషి ఆటోలో దిగిరావడం చూసి అక్కడున్న వారంతా ఒక్క నిమిషం భయభ్రాంతులకు లోనైన ఘటన కృష్ణా జిల్లాలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే…

కృష్ణా జిల్లా జగ్గయ్యపేట క్రిస్టియన్‌పేటకు చెందిన ముత్యాల గిరిజమ్మ కూరగాయల వ్యాపారం చేసేది. ఆమె భర్త ముత్యాల గడ్డయ్య కొలిమి పనిచేసేవాడు. అతడు మానసికంగా ఎంతో అమాయకంగా ఉంటాడు. ఈ దంపతులకు దావీద్ అనే కుమారుడు ఉన్నాడు. ఈ క్రమంలోనే గత నెల 12వ తేదీన గిరిజ కరోనా బారినపడి విజయవాడ ఆస్పత్రిలో చేరింది. ఈ క్రమంలోనే తన కొడుకు కూడా కరోనా బారిన పడటంతో అతను హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

ఈ క్రమంలోనే మే 15న గిరిజమ్మ చనిపోయిందని ఆస్పత్రి యాజమాన్యం ఒక మృతదేహాన్ని గిరిజమ్మ భర్తకు అప్పగించారు. గిరిజమ్మ కరోనాతో మృతి చెందిందని భావించి బంధువులు ఎవరు ఆమెను చూడటానికి సాహసం చేయలేదు. ఈ క్రమంలోనే ఆమె భర్త గడ్డయ్య ఆమెకు అంత్యక్రియలు నిర్వహించాడు. అదే విధంగా ఆమె కొడుకు దావీద్ కూడా కరోనాతో మృతి చెందాడు.

ఈ విధంగా తల్లి కొడుకులకు ఇద్దరికీ అంత్యక్రియలు నిర్వహించి ఇద్దరికీ పెద్దకర్మ చేసే రోజు గిరిజమ్మ ఎంతో ఆరోగ్యంగా ఆటోలో ఇంటికి చేరుకుంది. ఒక్కసారిగా ఆమెను చూడగానే అక్కడున్న వారు ఎంతో భయాందోళన చెందారు. తరువాత ఈ షాక్ నుంచి తేరుకొని ఆమెను వివరంగా అడగగా అసలు విషయం బయటపడింది. తనని ఆసుపత్రి సిబ్బంది ఎంతో బాగా చూసుకున్నారని,తనకిప్పుడు కరోనా లేకపోవడం వల్లే ఆస్పత్రి సిబ్బంది తనకి ఆటోలో ఇక్కడికి పంపించారని విషయం తెలిపింది.

మే 12వ తేదీన ఆస్పత్రికి చేరిన గిరిజమ్మకి మెరుగైన చికిత్స కోసం ఆసుపత్రికి యాజమాన్యం ఆమెకు వేరేచోటికి మార్చారు. ఈ క్రమంలోనే అతని భర్త వెళ్లి ఆమెని వివరాలు అడగగా అక్కడ డ్యూటీలో ఉన్న సిబ్బంది చనిపోయిందని మార్చురీకి వెళ్లి 60 సంవత్సరాల వయసు కలిగిన మహిళ మృతదేహం చూపించగా మానసిక పరిస్థితి బాగా లేని గడ్డ తన భార్య మృతదేహమేనని తీసుకువచ్చి అంత్యక్రియలు నిర్వహించినట్లు తెలుస్తోంది.ప్రస్తుతం ఆమె కరోనా బారినపడి ఇప్పుడిప్పుడే కోలుకోవడంతో ఆమెకు తన కొడుకు దావీద్ మరణించిన విషయాన్ని తెలియజేయలేదు.

కరోనాను గెలిచింది.. చివరికి కొన్నీ క్షణాల్లోనే దారుణంగా?

ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా ఏ విధంగా వ్యాప్తి చెందుతుందో మనకు తెలిసిందే. ఎంతో ఆరోగ్యవంతులను కూడా ఉన్నఫలంగా కరోనా మహమ్మారి బలి తీసుకుంటుంది. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా కరోనా తీవ్రత అధికంగా ఉంది. ఈ క్రమంలోనే ఓ నిండు గర్భిణీ కరోన బారినపడి కరోనాను ఎదిరించి పోరాడింది. ఈ వైరస్ తో పోరాడి పండంటి బిడ్డకు జన్మనివ్వడంతో అందరూ ఆనందంగా ఉన్న సమయంలో ఆ పసిగుడ్డుకి తల్లిని దూరం చేసిన ఘటన విజయవాడలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

విజయవాడలోని సింగ్ నగర్ కుచెందిన వెంకటేశ్వరరావు, రమాదేవి దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. వీరిలో చిన్న కుమార్తె ప్రమీల తనతో పాటు బ్యాంకులో ఉద్యోగం చేసే గణేష్ అనే యువకుణ్ణి ప్రేమించి పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకుంది. గత ఏడాది వీరి వివాహం కాగా ఈ ఏడాది ప్రమీల గర్భం దాల్చి గత మూడు నెలల క్రితమే డెలివరీ కోసం పుట్టింటికి వచ్చేసింది.

గత నెలలోకుటుంబ సభ్యులందరూ కరోనా బారిన పడటంతో ప్రమీలాకి కూడా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ జరిగింది. ఈ క్రమంలోనే ఎన్నో జాగ్రత్తలను పాటిస్తూ తన బిడ్డను రక్షించుకోవడం కోసం కరోనాను జయించి పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఒక వైపు కరోనా నెగిటివ్ రావడమే కాకుండా పండంటి మగ బిడ్డకు జన్మనివ్వడంతో కుటుంబ సభ్యులందరూ ఎంతో సంతోషపడ్డారు. ఈ క్రమంలోనే ప్రమీల తన బాబుని తీసుకొని అత్తారింటికి వెళ్ళింది.

అంతా సవ్యంగా ఉందనుకునే సమయంలో ప్రమీల తల్లి రమాదేవి కరోన బారినపడి మృత్యువాత పడ్డారు. అయితే ఈ విషయం ప్రమీలకు తెలియనివ్వకుండా కుటుంబ సభ్యులు జాగ్రత్తపడ్డారు. కానీ మంగళవారం తన తల్లి మరణవార్తను తెలుసుకున్న ప్రమీల ఉన్నఫలంగా కుప్పకూలిపోయింది. ఈ క్రమంలోనే కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించేలోగా ప్రమీల మృత్యువాత పడింది. ఒకరోజు వ్యవధిలోనే ఇటు భార్యను అట కూతురిని పోగొట్టుకున్న వెంకటేశ్వరరావు ఎంతో రోదన చెందాడు. ఈ క్రమంలోనే రెండు వారాల పసిబిడ్డకు తల్లి దూరం కావడంతో సింగ్ నగర్ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

ఏపీ నిరుద్యోగులకు శుభవార్త.. భారీ వేతనంతో ఉద్యోగాలు..?

ఏపీఎస్‌ఎస్‌డీసీ రాష్ట్రంలోని నిరుద్యోగులకు మరో శుభవార్త చెప్పింది. efftronics private ltd అనే సంస్థలోని 100 ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన నోటిఫికేషన్ ను విడుదల చేసింది. గరిష్టంగా 5 లక్షల రూపాయల 20 వేల వరకు ఈ ఉద్యోగాలకు వేతనం పొందే అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా జనవరి 18వ తేదీ ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి చివరితేదీగా ఉంది.

ఐటీఐ, డిప్లొమా, బీటెక్ అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత, ఉద్యోగాన్ని బట్టి వేతనంలో మార్పులు ఉంటాయి. సాఫ్ట్ వేర్ ఇంజనీర్, సొల్యూషన్ సపోర్ట్ ఇంజనీర్, ఎంబెడ్ ఇంజనీర్, డేటా సైంటిస్ట్ ఉద్యోగ ఖాళీలకు ఈ నోటిఫికేషన్ విడుదలైంది. https://www.apssdc.in/home/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. https://www.apssdc.in/home/ ఈ వెబ్ సైట్ ద్వారా ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.

డేటా సైంటిస్ట్ ఉద్యోగాలకు బీటెక్ తో పాటు ఎంసీఏ, ఎంఎస్సీ చదివిన వాళ్లు సైతం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసి ఎంపికైన వాళ్లకు 5.2 లక్షల రూపాయల వేతనం లభిస్తుంది. ఎంబెడ్ ఇంజనీర్ ఉద్యోగాలకు బీటెక్, ఎంటెక్, ఎంఎస్సీ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న వారికి 3.8 లక్షల రూపాయల వేతనం లభిస్తుంది.

సొల్యూషన్ సపోర్ట్ ఇంజనీర్ ఉద్యోగాలకు బీఎస్సీ, బీటెక్, డిప్లొమా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. సంవత్సరానికి 2.2 లక్షల రూపాయల వేతనం లభిస్తుంది. సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఉద్యోగాలకు బీటెక్ , ఎంఎస్సీ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు 3.8 లక్షల రూపాయల వేతనం లభిస్తుంది.

చికెన్, మటన్ తినేవాళ్లకు షాకింగ్ న్యూస్.. అక్కడ తిన్నారో అంతే సంగతులు..?

దేశంలో మాంసాహార ప్రియులు ఎక్కువనే సంగతి తెలిసిందే. సండే వచ్చిందంటే చాలు చాలామంది చికెన్, మటన్ ఇష్టంగా తింటారు. ముక్క లేనిదే ముద్ద దిగని వాళ్లు దేశంలో చాలామందే ఉన్నారు. అయితే ఎక్కడ పడితే అక్కడ మాంసం కొనుగోలు చేస్తే మాత్రం ఇబ్బందుల్లో పడినట్లే. ఏపీలోని విజయవాడ నగరంలో మాంసం మాఫియా ప్రజల ఆరోగ్యంతో ఆడుకుంటోంది. చచ్చిన కోళ్లు, మేకలను విక్రయిస్తూ ప్రజలకు కొత్త ఆరోగ్య సమస్యలను సృష్టిస్తోంది.

మాంసం మాఫియా నగరంలో ప్రముఖ హోటళ్లకు, రెస్టారెంట్లకు ఇదే మాంసాన్ని విక్రయిస్తున్నట్టు తెలుస్తోంది. ఆదివారం రోజున నగరంలోని పలు ప్రాంతాల్లో విక్రయిస్తున్న చికెన్, మటన్ సైతం కుళ్లిపోయిన, చనిపోయిన జంతువులది అని తెలుస్తోంది. ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్లు, వీఎంసీ వెటర్నరీ అధికారులు ఈ నెల మొదటి వారంలో చేసిన తనిఖీల్లో 400 కేజీల నిల్వ ఉన్న మాంసం అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

నగరంలోని పలు ప్రాంతాల్లో ఫ్రిజ్ లలో పురుగులు పట్టి ఉన్న మాంసాన్ని సైతం అధికారులు గుర్తించారు. నగరంలో అధికారుల తనిఖీల్లో నిల్వ ఉన్న మాంసం, పురుగులు పట్టిన మాంసం దొరకడంతో అధికారులు ఆ మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు. గవర్నమెంట్ రూల్స్ ప్రకారం కబేళాలో మటన్, బీఫ్ లకు వీఎంసీ స్టాంప్‌ వేయించుకోవాలి. అయితే నగరంలో చాలామంది వ్యాపారులు నిబంధనలను పాటించడం లేదు.

అధికారులు దాడులు చేసి వందల కిలోల మాంసం స్వాధీనం చేసుకుంటున్నా వ్యాపారుల్లో మార్పు రాకపోవడం గమనార్హం. అధికారులు ప్రజలు మాంసం కొనుగోలు చేసే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని వైద్యులు, అధికారులు సూచనలు చేస్తున్నారు.