Tag Archives: vikram movie

Suriya: రోలెక్స్ పాత్ర ఏమాత్రం నచ్చలేదు… కానీ ఆ ఒక్క కారణంతోనే ఒప్పుకున్నా: సూర్య

Suriya:విక్రమ్ సినిమాలో రోలెక్స్ పాత్రలో నటించిన తర్వాత సూర్యను అందరూ కూడా రోలెక్స్ సార్ అని పిలవడం మొదలు పెట్టారు.విక్రమ్ సినిమాలో ఈయన కేవలం ఐదు నిమిషాలు మాత్రమే సందడి చేశారు. అయినప్పటికీ ఈ సినిమాలో నటించిన ఇతర నటీనటుల పేర్లు గుర్తు లేకపోయినా సూర్య పాత్ర ప్రేక్షకుల మదిలో నిలిచిపోయింది.

 

ఈ పాత్ర ద్వారా సూర్యకి ఎంతో మంచి గుర్తింపు లభించింది.ఇకపోతే తాజాగా రోలెక్స్ పాత్ర గురించి సూర్య చేసినటువంటి కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా జరిగిన ఫిలింఫేర్ 2020 అవార్డ్స్ కార్యక్రమంలో భాగంగా సూర్య సురారై పోట్రు సినిమాకి గాను ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్న విషయం మనకు తెలిసిందే. ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన రోలెక్స్ పాత్ర గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు.

ఈ సందర్భంగా సూర్య మాట్లాడుతూ తనకు రోలెక్స్ పాత్రలో నటించడం ఏమాత్రం ఇష్టం లేదని సూర్య షాకింగ్ కామెంట్స్ చేశారు. తనుకు చిన్నప్పటినుంచి సూర్య అంటే ఎంతో ఇష్టమని ఆయనే తన రోల్ మోడల్ అంటూ సూర్య చెప్పుకొచ్చారు. అయితే ఆయనతో కలిసి నటించడం తన డ్రీమ్ అని ఈ సందర్భంగా తెలియజేశారు. ఇక రోలెక్స్ పాత్ర గురించి చెప్పగానే తనకు ఏమాత్రం నచ్చలేదని నటించనని లోకేష్ కు చెబుతామని అనుకున్నాను.

 

Suriya: కమల్ హాసన్ నా స్ఫూర్తి…

ఇకపోతే ఈ సినిమాలో కమల్ హాసన్ గారు నటిస్తున్నారని,నటుడిగా ఈ స్థానంలో ఉన్నానంటే ఆయన స్ఫూర్తి కారణమని, కమల్ హాసన్ గారి పై గౌరవంతో, ఆయనతో కలిసి నటించాలన్న నా డ్రీమ్స్ కోసం రోలెక్స్ పాత్రలో నటించానని సూర్య వెల్లడించారు. ఈ క్రమంలోనే రోలెక్స్ పాత్ర గురించి ఈయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.ఇకపోతే ఈ సినిమాను కమల్ తన సొంత బ్యానర్ లోనే ఈ సినిమాని నిర్మించారు. ఈ సినిమా ఏకంగా అన్ని భాషలలో 400 కోట్ల కలెక్షన్లను రాబట్టి సంచలనం సృష్టించింది.

Vijay Sethupathi: జవాన్ కోసం విజయ్ సేతుపతి రెమ్యూనరేషన్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే… నిజంగానే అంతిస్తున్నారా?

Vijay Sethupathi: కోలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర నటులలో ఒకరిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు నటుడు విజయ్ సేతుపతి. ఈయన కెరియర్ మొదట్లో పలు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించిన అనంతరం విలన్ గా మెప్పించారు. అలా హీరోగా అవకాశాలను అందుకొని ఇండస్ట్రీలో అగ్ర హీరోలలో ఒకరిగా కొనసాగుతున్నారు. ఇక పాత్ర కథ డిమాండ్ చేస్తే ఈయన విలన్ పాత్రలలో నటించడానికి కూడా వెనకాడటం లేదు.

తాజాగా వచ్చిన విక్రమ్ సినిమాలో ఈయన నటన ప్రతి ఒక్కరిని ఎంతగానో ఆకట్టుకుంది. ఇలా వరుస సినిమాలతో ఎంతో బిజీగా గడుపుతున్నటువంటి ఈయన తెలుగులో కూడా ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్నారు. మాస్టర్ ఉప్పెన సినిమాలలో ఈయన నటనతో తెలుగు ప్రేక్షకులను కూడా సందడి చేశారు. ఇదిలా ఉండగా తాజాగా ఈయన బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ నయనతార జంటగా తమిళ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం జవాన్.

ఈ సినిమాలో విలన్ పాత్రలో నటించడం కోసం అట్లీ విజయ్ సేతుపతిని ఎంపిక చేశారు. అయితే ఈ సినిమా కోసం విజయ్ సేతుపతి తీసుకున్న రెమ్యూనరేషన్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.ఈ సినిమా కోసం ఈయన ఏకంగా 21 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకున్నారని పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.ఇలా రెమ్యూనరేషన్ గురించి వార్తలు విన్న నేటిజెన్లు ఒక్కసారిగా షాక్ అవుతున్నారు.

Vijay Sethupathi: ఏమాత్రం నమ్మశక్యంగా లేదు…

కోలీవుడ్ ఇండస్ట్రీలో విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో హీరోగా నటిస్తేనే ఈయన 10 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. ఇక విలన్ పాత్రలో అంటే తప్పనిసరిగా రెమ్యునరేషన్ తగ్గుతుంది.ఉప్పెన సినిమాలో నటించినందుకుగాను ఈయనకు ఐదు కోట్ల రెమ్యూనరేషన్ ఇచ్చారు. అయితే ప్రస్తుతం బాలీవుడ్ ఉన్న కష్ట పరిస్థితులలో విజయ్ సేతుపతికి ఏకంగా 21 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ ఇచ్చారంటే ఏ మాత్రం నమ్మశక్యంగా లేదని పలువురు భావిస్తున్నారు. మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజముందో తెలియాల్సి ఉంది.

Vikram Movie: చనిపోయిన వ్యక్తి తిరిగి ఎలా బతికాడంటూ ప్రశ్నించిన నెటిజన్.. నెటిజన్ ప్రశ్నకు క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ !

Vikram Movie: యంగ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా తెరకెక్కిన చిత్రం విక్రమ్. ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ జూన్ 3వ తేదీ విడుదల అయ్యి అంచనాలను మించి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఈ క్రమంలోనే ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకోవడంతో కమల్ హాసన్ దర్శకులకు ఖరీదైన బహుమతులు ఇస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు.

Vikram Movie: చనిపోయిన వ్యక్తి తిరిగి ఎలా బతికాడంటూ ప్రశ్నించిన నెటిజన్.. నెటిజన్ ప్రశ్నకు క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ !

ఇకపోతే ఈ సినిమా మంచి విజయం అందుకున్న తరుణంలో డైరెక్టర్ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటించారు.ఈ క్రమంలోనే నెటిజన్లు అడిగే ప్రశ్నలకు ఈయన తనదైన శైలిలో సమాధానాలు తెలియజేస్తున్నారు. ఈ విధంగా నెటిజన్ల నుంచి ఎన్నో రకాల ప్రశ్నలు ఎదురవడంతో సమాధానాలు చెప్పిన డైరెక్టర్ లోకేష్ కు ఒక నెటిజన్ నుంచి ఊహించని ప్రశ్న ఎదురైంది.

Vikram Movie: చనిపోయిన వ్యక్తి తిరిగి ఎలా బతికాడంటూ ప్రశ్నించిన నెటిజన్.. నెటిజన్ ప్రశ్నకు క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ !

ఈ సందర్భంగా నెటిజన్ ప్రశ్నిస్తూ ఖైదీ సినిమాలో చనిపోయిన అర్జున్ దాస్ క్యారెక్టర్ విక్రమ్ సినిమాలో ఎలా బ్రతికి ఉంది. ఈ విషయాన్ని నేను నమ్మలేకపోతున్నాను అంటూ నెటిజన్ ప్రశ్నించారు. ఈ క్రమంలోనే లోకేష్ ఈ ప్రశ్నకు సమాధానం చెబుతూ… ఖైదీ సినిమాలో నెపోలియన్ కొట్టడం వల్ల అర్జున్ దాస్ చనిపోలేదు. ఆయన దౌడ మాత్రమే విరిగిపోయింది. ఇకపోతే విక్రమ్ సినిమాలో అన్బు గొంతుపై మీరు కుట్లను చూడొచ్చు. దీని గురించి ఖైదీ 2 లో వివరణ ఇస్తానని ఈ సందర్భంగా డైరెక్టర్ క్లారిటీ ఇచ్చారు.

ఖరీదైన కారును బహుమానం..

ఇక ఈ సినిమా విడుదలై వారం రోజుల అయినప్పటికీ ఇంకా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. చాలా కాలం తర్వాత డైరెక్టర్ లోకేష్ కనగారాజ్ విక్రమ్ సినిమాతో కమల్ హాసన్ కు భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందించడంతో ఎంతో సంతోషం వ్యక్తం చేసిన కమల్ హాసన్ డైరెక్టర్ కు ఊహించని విధంగా కోటి రూపాయల కారు బహుమతిగా ఇచ్చారు అదేవిధంగా అసిస్టెంట్ డైరెక్టర్లకు ఎంతో విలువైన బహుమతులను అందజేశారు.ఇకపోతే ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో ఈ సినిమాకి సీక్వెల్ చిత్రం ఉంటుందని కమల్ హాసన్ వెల్లడించారు.