Suriya:విక్రమ్ సినిమాలో రోలెక్స్ పాత్రలో నటించిన తర్వాత సూర్యను అందరూ కూడా రోలెక్స్ సార్ అని పిలవడం మొదలు పెట్టారు.విక్రమ్ సినిమాలో ఈయన కేవలం ఐదు నిమిషాలు మాత్రమే సందడి చేశారు. అయినప్పటికీ ఈ సినిమాలో నటించిన ఇతర నటీనటుల పేర్లు గుర్తు లేకపోయినా సూర్య పాత్ర ప్రేక్షకుల మదిలో నిలిచిపోయింది.
ఈ పాత్ర ద్వారా సూర్యకి ఎంతో మంచి గుర్తింపు లభించింది.ఇకపోతే తాజాగా రోలెక్స్ పాత్ర గురించి సూర్య చేసినటువంటి కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా జరిగిన ఫిలింఫేర్ 2020 అవార్డ్స్ కార్యక్రమంలో భాగంగా సూర్య సురారై పోట్రు సినిమాకి గాను ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్న విషయం మనకు తెలిసిందే. ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన రోలెక్స్ పాత్ర గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు.
ఈ సందర్భంగా సూర్య మాట్లాడుతూ తనకు రోలెక్స్ పాత్రలో నటించడం ఏమాత్రం ఇష్టం లేదని సూర్య షాకింగ్ కామెంట్స్ చేశారు. తనుకు చిన్నప్పటినుంచి సూర్య అంటే ఎంతో ఇష్టమని ఆయనే తన రోల్ మోడల్ అంటూ సూర్య చెప్పుకొచ్చారు. అయితే ఆయనతో కలిసి నటించడం తన డ్రీమ్ అని ఈ సందర్భంగా తెలియజేశారు. ఇక రోలెక్స్ పాత్ర గురించి చెప్పగానే తనకు ఏమాత్రం నచ్చలేదని నటించనని లోకేష్ కు చెబుతామని అనుకున్నాను.
ఇకపోతే ఈ సినిమాలో కమల్ హాసన్ గారు నటిస్తున్నారని,నటుడిగా ఈ స్థానంలో ఉన్నానంటే ఆయన స్ఫూర్తి కారణమని, కమల్ హాసన్ గారి పై గౌరవంతో, ఆయనతో కలిసి నటించాలన్న నా డ్రీమ్స్ కోసం రోలెక్స్ పాత్రలో నటించానని సూర్య వెల్లడించారు. ఈ క్రమంలోనే రోలెక్స్ పాత్ర గురించి ఈయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.ఇకపోతే ఈ సినిమాను కమల్ తన సొంత బ్యానర్ లోనే ఈ సినిమాని నిర్మించారు. ఈ సినిమా ఏకంగా అన్ని భాషలలో 400 కోట్ల కలెక్షన్లను రాబట్టి సంచలనం సృష్టించింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…