Tag Archives: Atlee

Allu Arjun: బన్నీ, అట్లీ సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న సమంత?

Allu Arjun: టాలీవుడ్ పాన్ ఇండియా హీరో అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 సినిమాలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తోంది. ఈ ఏడాది ఆగస్టు 15న ఈ సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా డేట్ ని కూడా ఫిక్స్ చేశారు. ఇకపోతే ఈ సినిమా వరకు బాగానే ఉంది కానీ ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ ఏ సినిమాలో నటించబోతున్నాడు అన్న విషయం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.

అయితే అల్లు అర్జున్ తదుపరి సినిమా ఆ డైరెక్టర్ తోనే అంటూ ఇప్పటికే చాలామంది డైరెక్టర్ల పేర్లు వినిపించాయి. కానీ వాటిలో ఏది కూడా అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు. అయితే గత కొద్ది రోజులుగా బన్నీ నెక్స్ట్ సినిమా కోలీవుడ్ డైరెక్టర్ అట్లీతోనే అంటూ వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. ఆల్రెడీ ఈ మూవీ వర్క్ కూడా స్టార్ట్ అయిందని ఇటీవల ఒక వీడియో బాగా వైరల్ అయ్యింది. తాజాగా వినిపిస్తున్న వార్త ఏంటంటే.. ఈ సినిమాతో సమంత రీ ఎంట్రీ ఇస్తున్నారట. ఖుషి సినిమా తరువాత సమంత సినిమాలకు బ్రేక్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

అట్లీ సినిమాతో రీ ఎంట్రీ

తన అనారోగ్యం నుంచి కోలుకోవడం కోసం చికిత్స తీసుకుంటూ వస్తున్న సమంత, అట్లీ, అల్లు అర్జున్ సినిమాలో హీరోయిన్ గా చేయడానికి ఓకే చెప్పారట. మరి ఈ వార్తలో ఎంత నిజముందో తెలియదు. కాగా సమంత గతంలో అట్లీ తెరకెక్కించిన మెర్సల్, తేరి సినిమాల్లో హీరోయిన్ గా నటించారు. అలాగే ఇక అల్లు అర్జున్‌తో కలిసి సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలో నటించింది సామ్. ఈ మూడు సినిమాలు బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. ఇప్పుడు తన రీ ఎంట్రీకి ఈ హిట్ కాంబినేషన్ అయితేనే పర్ఫెక్ట్ అని సమంత భావించినట్లు తెలుస్తోంది. కాగా ఈ మూవీని అల్లు అర్జున్ బర్త్ డే నాడు అనౌన్స్ చేయబోతున్నారట. ఏప్రిల్ 8న బన్నీ పుట్టినరోజు ఉన్న సంగతి తెలిసిందే. దీంతో ఆ రోజునే ఈ సినిమాని అఫీషియల్ గా అనౌన్స్ చేయడానికి మేకర్స్ సిద్దమవుతున్నారట.

Shahrukh Khan: నయనతార ఇంటికి వెళ్లిన షారుక్ ఖాన్… వైరల్ అవుతున్న ఫోటోలు!

Shahrukh Khan: బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ పఠాన్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.చాలా సంవత్సరాల తర్వాత ఈయన ఈ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడంతో ఈ సినిమాపై ఎన్నో అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా అంచనాలను మించి బ్లాక్ బాస్టర్ హిట్ అందుకుంది. ఈ విధంగా పఠాన్ సినిమా సూపర్ సక్సెస్ కావడంతో అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇక ఈ సినిమా మంచి విజయం అందుకోవడంతో షారుఖ్ ఖాన్ తన తదుపరి ప్రాజెక్టుపై దృష్టి సారించారు. ఈ క్రమంలోనే తన తదుపరిచిత్రాన్ని ప్రముఖ తమిళ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో జవాన్ అనే సినిమాలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్ గా నటిస్తున్నారు.

ఇప్పటికే కొంత షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం చెన్నైలో శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఈ క్రమంలోనే షారుక్ ఖాన్ చెన్నైలోని నయనతార నివాసానికి చేరుకున్నారు. ఇలా షారుఖ్ ఖాన్ నయనతార ఇంటికి వచ్చారని తెలియడంతో పెద్ద ఎత్తున అభిమానులు అక్కడికి తరలి వచ్చారు.

Shahrukh Khan: నయన్ పిల్లలను చూడటం కోసం వెళ్ళిన షారుక్…

ఇక షారుఖ్ ఖాన్ నయనతారతో సినిమా చేస్తున్న సమయంలోనే నయనతార విగ్నేష్ వివాహం జరిగింది. వీరి వివాహ వేడుకలలో కూడా షారుక్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.ఇక పెళ్లయిన నాలుగు నెలలకే ఈ జంట సరోగసి ద్వారా కవల పిల్లలకు జన్మనిచ్చిన సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే షారుఖ్ ఖాన్ నయనతార పిల్లల్ని చూడటం కోసం నయనతార ఇంటికి వెళ్లినట్టు తెలుస్తుంది. కాసేపు నయనతార ఇంటిలో సరదాగా గడిపిన అనంతరం అభిమానులకు ఫ్లయింగ్ కిస్ ఇస్తూ అభివాదం చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

Vijay Sethupathi: జవాన్ కోసం విజయ్ సేతుపతి రెమ్యూనరేషన్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే… నిజంగానే అంతిస్తున్నారా?

Vijay Sethupathi: కోలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర నటులలో ఒకరిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు నటుడు విజయ్ సేతుపతి. ఈయన కెరియర్ మొదట్లో పలు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించిన అనంతరం విలన్ గా మెప్పించారు. అలా హీరోగా అవకాశాలను అందుకొని ఇండస్ట్రీలో అగ్ర హీరోలలో ఒకరిగా కొనసాగుతున్నారు. ఇక పాత్ర కథ డిమాండ్ చేస్తే ఈయన విలన్ పాత్రలలో నటించడానికి కూడా వెనకాడటం లేదు.

తాజాగా వచ్చిన విక్రమ్ సినిమాలో ఈయన నటన ప్రతి ఒక్కరిని ఎంతగానో ఆకట్టుకుంది. ఇలా వరుస సినిమాలతో ఎంతో బిజీగా గడుపుతున్నటువంటి ఈయన తెలుగులో కూడా ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్నారు. మాస్టర్ ఉప్పెన సినిమాలలో ఈయన నటనతో తెలుగు ప్రేక్షకులను కూడా సందడి చేశారు. ఇదిలా ఉండగా తాజాగా ఈయన బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ నయనతార జంటగా తమిళ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం జవాన్.

ఈ సినిమాలో విలన్ పాత్రలో నటించడం కోసం అట్లీ విజయ్ సేతుపతిని ఎంపిక చేశారు. అయితే ఈ సినిమా కోసం విజయ్ సేతుపతి తీసుకున్న రెమ్యూనరేషన్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.ఈ సినిమా కోసం ఈయన ఏకంగా 21 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకున్నారని పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.ఇలా రెమ్యూనరేషన్ గురించి వార్తలు విన్న నేటిజెన్లు ఒక్కసారిగా షాక్ అవుతున్నారు.

Vijay Sethupathi: ఏమాత్రం నమ్మశక్యంగా లేదు…

కోలీవుడ్ ఇండస్ట్రీలో విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో హీరోగా నటిస్తేనే ఈయన 10 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. ఇక విలన్ పాత్రలో అంటే తప్పనిసరిగా రెమ్యునరేషన్ తగ్గుతుంది.ఉప్పెన సినిమాలో నటించినందుకుగాను ఈయనకు ఐదు కోట్ల రెమ్యూనరేషన్ ఇచ్చారు. అయితే ప్రస్తుతం బాలీవుడ్ ఉన్న కష్ట పరిస్థితులలో విజయ్ సేతుపతికి ఏకంగా 21 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ ఇచ్చారంటే ఏ మాత్రం నమ్మశక్యంగా లేదని పలువురు భావిస్తున్నారు. మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజముందో తెలియాల్సి ఉంది.