Allu Arjun: టాలీవుడ్ పాన్ ఇండియా హీరో అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 సినిమాలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తోంది. ఈ ఏడాది ఆగస్టు 15న ఈ సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా డేట్ ని కూడా ఫిక్స్ చేశారు. ఇకపోతే ఈ సినిమా వరకు బాగానే ఉంది కానీ ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ ఏ సినిమాలో నటించబోతున్నాడు అన్న విషయం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.
అయితే అల్లు అర్జున్ తదుపరి సినిమా ఆ డైరెక్టర్ తోనే అంటూ ఇప్పటికే చాలామంది డైరెక్టర్ల పేర్లు వినిపించాయి. కానీ వాటిలో ఏది కూడా అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు. అయితే గత కొద్ది రోజులుగా బన్నీ నెక్స్ట్ సినిమా కోలీవుడ్ డైరెక్టర్ అట్లీతోనే అంటూ వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. ఆల్రెడీ ఈ మూవీ వర్క్ కూడా స్టార్ట్ అయిందని ఇటీవల ఒక వీడియో బాగా వైరల్ అయ్యింది. తాజాగా వినిపిస్తున్న వార్త ఏంటంటే.. ఈ సినిమాతో సమంత రీ ఎంట్రీ ఇస్తున్నారట. ఖుషి సినిమా తరువాత సమంత సినిమాలకు బ్రేక్ ఇచ్చిన సంగతి తెలిసిందే.
అట్లీ సినిమాతో రీ ఎంట్రీ
తన అనారోగ్యం నుంచి కోలుకోవడం కోసం చికిత్స తీసుకుంటూ వస్తున్న సమంత, అట్లీ, అల్లు అర్జున్ సినిమాలో హీరోయిన్ గా చేయడానికి ఓకే చెప్పారట. మరి ఈ వార్తలో ఎంత నిజముందో తెలియదు. కాగా సమంత గతంలో అట్లీ తెరకెక్కించిన మెర్సల్, తేరి సినిమాల్లో హీరోయిన్ గా నటించారు. అలాగే ఇక అల్లు అర్జున్‌తో కలిసి సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలో నటించింది సామ్. ఈ మూడు సినిమాలు బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. ఇప్పుడు తన రీ ఎంట్రీకి ఈ హిట్ కాంబినేషన్ అయితేనే పర్ఫెక్ట్ అని సమంత భావించినట్లు తెలుస్తోంది. కాగా ఈ మూవీని అల్లు అర్జున్ బర్త్ డే నాడు అనౌన్స్ చేయబోతున్నారట. ఏప్రిల్ 8న బన్నీ పుట్టినరోజు ఉన్న సంగతి తెలిసిందే. దీంతో ఆ రోజునే ఈ సినిమాని అఫీషియల్ గా అనౌన్స్ చేయడానికి మేకర్స్ సిద్దమవుతున్నారట.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…