Vikram Movie: చనిపోయిన వ్యక్తి తిరిగి ఎలా బతికాడంటూ ప్రశ్నించిన నెటిజన్.. నెటిజన్ ప్రశ్నకు క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ !
Vikram Movie: యంగ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా తెరకెక్కిన చిత్రం విక్రమ్. ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ జూన్ 3వ తేదీ విడుదల అయ్యి అంచనాలను మించి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఈ క్రమంలోనే ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకోవడంతో కమల్ హాసన్ దర్శకులకు ఖరీదైన బహుమతులు ఇస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు.
ఇకపోతే ఈ సినిమా మంచి విజయం అందుకున్న తరుణంలో డైరెక్టర్ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటించారు.ఈ క్రమంలోనే నెటిజన్లు అడిగే ప్రశ్నలకు ఈయన తనదైన శైలిలో సమాధానాలు తెలియజేస్తున్నారు. ఈ విధంగా నెటిజన్ల నుంచి ఎన్నో రకాల ప్రశ్నలు ఎదురవడంతో సమాధానాలు చెప్పిన డైరెక్టర్ లోకేష్ కు ఒక నెటిజన్ నుంచి ఊహించని ప్రశ్న ఎదురైంది.
ఈ సందర్భంగా నెటిజన్ ప్రశ్నిస్తూ ఖైదీ సినిమాలో చనిపోయిన అర్జున్ దాస్ క్యారెక్టర్ విక్రమ్ సినిమాలో ఎలా బ్రతికి ఉంది. ఈ విషయాన్ని నేను నమ్మలేకపోతున్నాను అంటూ నెటిజన్ ప్రశ్నించారు. ఈ క్రమంలోనే లోకేష్ ఈ ప్రశ్నకు సమాధానం చెబుతూ… ఖైదీ సినిమాలో నెపోలియన్ కొట్టడం వల్ల అర్జున్ దాస్ చనిపోలేదు. ఆయన దౌడ మాత్రమే విరిగిపోయింది. ఇకపోతే విక్రమ్ సినిమాలో అన్బు గొంతుపై మీరు కుట్లను చూడొచ్చు. దీని గురించి ఖైదీ 2 లో వివరణ ఇస్తానని ఈ సందర్భంగా డైరెక్టర్ క్లారిటీ ఇచ్చారు.
ఇక ఈ సినిమా విడుదలై వారం రోజుల అయినప్పటికీ ఇంకా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. చాలా కాలం తర్వాత డైరెక్టర్ లోకేష్ కనగారాజ్ విక్రమ్ సినిమాతో కమల్ హాసన్ కు భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందించడంతో ఎంతో సంతోషం వ్యక్తం చేసిన కమల్ హాసన్ డైరెక్టర్ కు ఊహించని విధంగా కోటి రూపాయల కారు బహుమతిగా ఇచ్చారు అదేవిధంగా అసిస్టెంట్ డైరెక్టర్లకు ఎంతో విలువైన బహుమతులను అందజేశారు.ఇకపోతే ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో ఈ సినిమాకి సీక్వెల్ చిత్రం ఉంటుందని కమల్ హాసన్ వెల్లడించారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…