Featured

Celebrity couples : తమ కంటే చిన్నవాళ్లను ఇష్టపడుతున్న హీరోయిన్లు.. అప్పుడు నమ్రత ఇప్పుడు నయనతార.. మళ్ళీ పురాణాల్ని ఫాలో అవుతున్న సెలబ్రిటీలు..!

Celebrity couples : ఎట్టకేలకు ప్రేమ పక్షులు నయనతార విగ్నేష్ శివన్ లు పెళ్లి చేసుకున్నారు. జూన్ 9న అంటే ఈరోజున మహాబలిపురంలో అత్యంత సన్నిహితుల మధ్య పెళ్లి చేసుకున్నారు. వీళ్లు ప్రేమించుకున్నట్లు చాలా రోజులుగా వార్తలు వస్తున్నా ఈ విషయంలో క్లారిటీ లేదు. కానీ గత కొన్ని నెలలుగా ఇద్దరు పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నట్లు వార్తలు వినిపించాయి. ఇక తాజాగా విగ్నేష్ సోషల్ మీడియాద్వారా నయనతార తో పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చారు. ఇక వీరి పెళ్లి తోలుత తిరుపతిలో జరుగుతుంది అని అనుకున్నా ఆ తరువాత వివిధ కారణాల వల్ల మహాబలిపురంలో జరిగింది. ఈ పెళ్ళికి రజనీకాంత్, షారుఖ్ ఖాన్ కూడా హాజరయ్యారని సమాచారం. ఇక ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ విషయం నయన తార కన్నా విగ్నేష్ ఒక ఏడాది చిన్నవాడు కావడం.

వాళ్ళ కన్నా చిన్న వాళ్ళను ఇష్టపడుతున్న హీరోయిన్స్….

పురాణాల ప్రకారం రాముడికంటే సీత పెద్దది అని మనకు తెలుసు. కానీ ఇప్పటి సంప్రదాయం ప్రకారం అబ్బాయి కంటే అమ్మాయి వయసు తక్కువ ఉండాలి అని అనుకుంటారు మన పెద్దలు. చాలా వరకు మన సమాజంలో పెళ్లిళ్లు అలానే జరుగుతాయి. కానీ ఎవరో కొంతమంది మాత్రం ఈ సంప్రదాయానికి భిన్నంగా వయసులో తమ కన్నా పెద్ద వయసు ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటారు. ఇక సెలబ్రిటీలు ఈ విషయంలో మినహాయింపు కాదు. సచిన్ నుండి నేటి విగ్నేష్ వరకు అందరూ అలా పెళ్లి చేసుకున్నవారే.

ప్రేమకు వయసు అడ్డు రాదు….

సచిన్ కన్నా అతని భార్య అంజలి ఐదేళ్లు పెద్దది. 1973 లో సచిన్ జన్మిస్తే అంజలి 1967 లో జన్మించారు. అయితే ఏంటి సక్సెస్‌ఫుల్ లైఫ్ ని వాళ్లు ఎంజాయ్ చేస్తున్నారు. ఇక సినిమా వాళ్ళ విషయానికి వస్తే అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ లు కూడా ఆ ట్రెండ్ ఫాలో అయిన వాళ్లే. ఐష్ అభిషేక్ కన్నా రెండేళ్లు పెద్దది. బచ్చన్ కుటుంబ బాధ్యతలను చూసుకుంటూ అచితూచి సినిమాలు చేస్తోంది ఐశ్వర్య. ఇక మరో బాలీవుడ్ కపుల్ సైఫ్ అలీ ఖాన్ ఆయన మొదటి భార్య అమ్రీత సింగ్. సైఫ్ కంటే ఆయన మొదటి భార్య 13 ఏళ్ళు పెద్దది. వీరికి ఇద్దరు పిల్లలు సంతానం. ఇక కూతురు సారా అలీ ఖాన్ కూడా ప్రస్తుతం బిజీ హీరోయిన్.

ఇక మన తెలుగు ఇండస్ట్రీ లో కూడా ఇలాంటి జంట ఉంది ఎవరో కాదు సూపర్ స్టార్ మహేష్ బాబు ఆయన వైఫ్ నమ్రత శిరోద్కర్. నమ్రత మహేష్ బాబు కంటే రెండున్నరేళ్లు పెద్దది. జనవరి 22, 1972లో నమ్రత జన్మిస్తే, 9 ఆగష్టు 1975లో మహేష్ బాబు పుట్టారు. పెళ్లి తరువాత సినిమాలకు గుడ్ బై చెప్పింది నమ్రత. సినిమా నిర్మాణ బాధ్యతలను చూసుకుంటూ మహేష్ స్టైలింగ్ విషయం చూసుకుంటోంది. ఇక సుస్మిత తన బాయ్ ఫ్రెండ్ రోహమాన్ షాల్ కంటే 15 ఏళ్ళు పెద్దది. ఇక విరాట్ కోహ్లీ కంటే హీరోయిన్ అనుష్క శర్మ 6 నెలలు పెద్దది. రాజ్ కుంద్ర కంటే శిల్ప శెట్టి వయసులో కొంచెం పెద్దది. ఈ బాటలో బిపాస కూడా చేరిపోయింది. ఇక మరో హాట్ కపుల్ ప్రియాంక చోప్రా నిక్ జోనెస్. ప్రియాంక నిక్ కంటే 10 ఏళ్ళు పెద్దది. 1982 లో ప్రియాంక జన్మిస్తే 1992 లో నిక్ జన్మించాడు. ఇలా వయసులో పెద్దవాళ్లైన లైఫ్‌పార్టనర్ తో విభిన్నంగా పెళ్లి చేసుకున్నా జీవితం మాత్రం సాఫీగా సాగిస్తున్నారు మనం సెలబ్రిటీలు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago