Nayanatara : సోషల్ మీడియా మొత్తం నయనతార, విగ్నేష్ శివన్ ల పెళ్లి గురించి మారుమోగిపోతోంది. జూన్ 9 గురువారం అంటే ఈరోజు తెల్లవారుజామున 2:22 గంటలకు మూడు మూళ్ళ బంధంతో ఒక్కటయ్యారు. ఈ పెళ్లి వేడుక మహాబలిపురం లోని రిసార్ట్స్ లో జరిగింది. ఇక వీరి వివాహానికి అతి తక్కువమంది సన్నిహితులను మాత్రమే ఆహ్వానించారు. ఇక ఈ పెళ్ళికి బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ హాజరయ్యారని తెలుస్తోంది.
డైరెక్టర్ అట్లీ తో షారుఖ్…. నయన్ పెళ్ళికి హాజరు….
షారుఖ్ ఖాన్ నయనతార, విగ్నేష్ ల పెళ్ళికి హాజరైనట్లు సోషల్ మీడియాలో షారుఖ్ మేనేజర్ పూజ దద్ధాని పోస్ట్ చేసిన షారుఖ్ ఫోటో ద్వారా తెలుస్తోంది. ఇక ఈ ఫంక్షన్ కి తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా హాజరైనట్లు వినిపిస్తోంది. రజనీకాంత్ కారు దిగి లోపలికి వెళ్లే ఫోటో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.
ఇక తమిళ హీరోలు అజిత్, విజయ్, కార్తీ తో పాటు టాలీవుడ్ నుండి కొంతమంది సెలబ్రిటీలు హాజరైనట్లు సమాచారం. ఇక పెళ్లికి కొంచెం సమయం ముందు విగ్నేష్ శివన్ నయన్ గురించి ఎమోషనల్ పోస్ట్ ను పెట్టారు. పెళ్లికూతురిగా తనను చూడడానికి చాలా ఎదురుచూస్తున్నాని, ఈ ఆనందం, ప్రేమ అన్ని తనకే అంకితం అంటూ ఎమోషనల్ గా రాసుకొచ్చాడు. ఇక పెళ్లి తరువాత అందరిని పిలిచి గ్రాండ్ గా రిసెప్షన్ పార్టీ ఇవ్వాలని నయన్, విగ్నేష్ ప్లాన్ చేశారట.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…