Tag Archives: vikram

Vikram: 12 ఏళ్లకే యాక్సిడెంట్…4 ఏళ్లు కదలలేని పరిస్థితి.. 23 సర్జరీలు… కట్ చేస్తే స్టార్ హీరో?

Vikram: దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో అగ్ర నటుడుగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న చియాన్ విక్రమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నటుడిగా సౌత్ ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఈయన విభిన్న కథా చిత్రాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తూ ప్రేక్షకులను సందడి చేస్తుంటారు. ఇక తాజాగా మణిరత్నం దర్శకత్వంలో రాబోతున్న పొన్నియన్ సెల్వన్ 2 సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

ఈ సినిమా త్వరలోనే విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొన్న తనకు 12 సంవత్సరాల వయసులో జరిగిన ప్రమాదం గురించి తెలియజేశారు.తనకు 12 సంవత్సరాల వయసులోనే నటన అంటే ఎంతో ఆసక్తి ఉండేది. ఈ క్రమంలోనే ఒక సినిమాలో మూగబ్బాయి పాత్రలో నటించాను. ఈ సినిమాకు గాను తనకు ఉత్తమ బాల నటుడిగా అవార్డు వచ్చింది.

ఈ అవార్డ్ అందుకోవడం కోసం ఐఐటి మద్రాస్ కు తన స్నేహితులతో కలిసి బైక్ పై వెళుతూ ఉండగా ప్రమాదానికి గురయ్యానని ఆ సమయంలో తనకుడి కాలు మొత్తం డామేజ్ అయిందని తెలిపారు. కాలు మొత్తం ఇన్ఫెక్షన్ కావడంతో డాక్టర్స్ కాలు తొలగించాలని చెప్పారు. అయితే అందుకు తన తల్లి ఒప్పుకోలేదని విక్రమ్ వెల్లడించారు.ఇక నా కాలు బాగవ్వడానికి సుమారు నాలుగు సంవత్సరాల సమయం పట్టిందని ఈ సందర్భంగా ఈయన తెలియజేశారు.

Vikram: నటనపై ఆసక్తి తగ్గలేదు…

ఇక ఈ నాలుగు సంవత్సరాలలో దాదాపు 23 సర్జరీలు జరిగాయని, ఇలా మూడు సంవత్సరాలకు కోలుకున్న తర్వాత ఇంకో సంవత్సరం మెల్లిగా నడవడం ప్రారంభించామని విక్రమ్ తెలిపారు.ఇలా తనకు కాలు బాగా లేకపోయినా తనకు నటనపై ఏమాత్రం ఆసక్తి తగ్గలేదని ఇండస్ట్రీలోకి రావాలన్న కోరిక క్రమక్రమంగా పెరిగిపోయిందంటూ ఈ సందర్భంగా విక్రమ్ తనకు జరిగిన ప్రమాదం గురించి చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Anchor Suma: వెండితెర కార్యక్రమాలకు దూరమైన సుమక్క… బోసిపోయిన సినిమ ఈవెంట్లు!

Anchor Suma: బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి పేరు పెట్టంrడి సంపాదించుకున్న సుమ కనకాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈమె బుల్లితెరపై ప్రతి ఒక్క ఛానల్ లోనూ పెద్ద ఎత్తున సందడి చేస్తూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేశారు. అయితే ప్రస్తుతం ఈమె క్యాష్ కార్యక్రమానికి మినహ ఏ ఇతర బుల్లితెర కార్యక్రమాలలో నటించలేదు.

సుమ బుల్లితెర కార్యక్రమాలకు దూరమైనప్పటికీ వెండితెరపై పెద్ద ఎత్తున సినిమా ఈవెంట్లకు యాంకర్ గా వ్యవహరిస్తూ ఎంతో బిజీగా గడుపుతున్నారు. సినిమాకు సంబంధించిన ట్రైలర్ లాంచ్, ప్రీ రిలీజ్ ఈవెంట్, సక్సెస్ మీట్ ఇలా ఏ కార్యక్రమం జరిగిన ఆ కార్యక్రమంలో తప్పకుండా సుమ ఉండాలి. సుమ ఉంటేనే ఆ కార్యక్రమానికి మరింత హైప్ ఉంటుందని దర్శక నిర్మాతలు భావిస్తూ సుమ డేట్స్ అడిగిమరీ వారి కార్యక్రమాలను నిర్ణయించుకుంటారు.

ఇలా సినిమా ఈవెంట్లకు ఎంతో కీలకంగా మారినటువంటి సుమ గత కొంతకాలం నుంచి ఎక్కడ సినిమా ఈవెంట్లలో కనిపించడం లేదు. ఇలా సుమ లేకపోవడంతో ఇతర యాంకర్లతో కార్యక్రమాలను నిర్వహించినప్పటికీ సుమ లేని వెలితి స్పష్టంగా కనపడుతుంది. సుమా లేకుండానే నాగార్జున నటించిన ది ఘోస్ట్ , మెగాస్టార్ గాడ్ ఫాదర్, విక్రమ్ పొన్నియన్ సెల్వన్ వంటి మూడు భారీ బడ్జెట్ సినిమా ఈవెంట్లు జరిగిపోయాయి.

Anchor Suma: హాలిడే వెకేషన్ లో యాంకర్ సుమ…

ఈ విధంగా సుమ వెండితెరకు దూరంగా ఉండడానికి గల కారణం ఏంటో ఆమె సోషల్ మీడియా ఖాతాలను చూస్తే మనకు స్పష్టంగా అర్థం అవుతుంది. వరుస షూటింగులతో ఎంతో బిజీగా ఉన్నటువంటి సుమ కొంతకాలం పాటు షూటింగ్లకు బ్రేక్ ఇచ్చి ఫ్యామిలీతో కలిసి మాల్దీవ్స్ వెకేషన్ లో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఈమె వెకేషన్ వెళ్లినప్పటికీ తన యూట్యూబ్ ఛానల్ కోసం ఎన్నో వీడియోలు చేస్తూ ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన అప్డేట్స్ విడుదల చేస్తున్నారు. ఇలా సుమ వెకేషన్ లో ఉండటం వల్ల సినిమా ఈవెంట్లకు ఈమె దూరంగా ఉన్నారు.

Nithiin: ఆ సినిమా చూసి వారం రోజులపాటు నిద్రపోలేదు… ఇప్పటికీ ఆ పాటకు ఏమాత్రం క్రేజ్ తగ్గలేదు: నితిన్

Nithiin: టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ కృతి శెట్టి జంటగా ఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో శ్రేష్ఠ మూవీస్ బ్యానర్ పై సుధాకర్ రెడ్డి, నికిత రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన చిత్రం మాచర్ల నియోజకవర్గం. ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ ఆగస్టు 12వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ఈ సినిమా విడుదల తేది దగ్గర పడటంతో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించారు.ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న నితిన్ ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను ఇప్పటివరకు ఎన్నో సినిమాలలో నటించానని కానీ మాచర్ల నియోజకవర్గం సినిమాలో తాను ఒక ఐఏఎస్ పాత్రలో కనిపించబోతున్నట్లు తెలిపారు. ఈ సినిమా ఫుల్ ఎంత మాస్ యాక్షన్ కమర్షియల్ చిత్రమని నితిన్ తెలిపారు.డైరెక్టర్ రాజశేఖర్ రెడ్డి ఇదివరకు ఎడిటర్ కావటం వల్ల ఈ సినిమాకి ఎంత కావాలో అంత మాత్రమే తీసుకున్నారు. సినిమాని ఎంతో అద్భుతంగా తెరకెక్కించారని వెల్లడించారు.

తాను ఇదివరకు నటించిన సినిమాలలో ఎన్నో యాక్షన్ సీక్వెన్సెస్ ఉన్నప్పటికీ ఈ సినిమాలో చాలా డిఫరెంట్ గా ఉంటాయని, ప్రతి ఒక్కరికి తప్పకుండా ఈ సినిమా నచ్చుతుంది అంటూ నితిన్ ధీమా వ్యక్తం చేశారు. ఇకపోతే సినిమాలు ఎప్పుడు ఒకే మూస దోరనిలో కాకుండా ఎంతో విభిన్నంగా తెరకెక్కించాలని అప్పుడే ప్రేక్షకుకు కూడా ఆ కొత్తదనం ఆస్వాదిస్తారని ఈయన తెలిపారు.

Nithiin: ఆ ఆలోచన తనకే వచ్చింది…

ఈ క్రమంలోనే తాజాగా వచ్చిన విక్రమ్ సినిమా తనకు ఎంత బాగా నచ్చిందని ఆ సినిమా చూసి దాదాపు వారం రోజుల పాటు తనకు నిద్ర కూడా పట్టలేదని ఈ సందర్భంగా వెల్లడించారు.ఇక మాచర్ల నియోజకవర్గం సినిమా గురించి ఈయన మాట్లాడుతూ ఇందులో ఏదైనా ఒక రీమిక్స్ సాంగ్ చేద్దామని ఆలోచన తనకు వచ్చిందని అందుకే తన కెరియర్లో బ్లాక్ బస్టర్ చిత్రమైన జయం సినిమాలో రాను రాను అంటుందనే పాటను రీమిక్స్ చేశామని, ఈ సినిమా విడుదల అయ్యికొన్ని సంవత్సరాలు గడిచిపోయినప్పటికీ ఈ పాటకు ఇంకా ఏ మాత్రం క్రేజ్ తగ్గలేదని మంచి రెస్పాన్స్ వచ్చిందని ఈయన తెలిపారు.

Surya: విక్రమ్ సినిమాలో ఐదు నిమిషాల కోసం సూర్య తీసుకున్న రెమ్యూనరేషన్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

Surya: యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ ప్రధాన పాత్రలో యాక్షన్ థ్రిల్లర్ ఈ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం విక్రమ్. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమా జూన్ 3వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చి మొదటి నుంచి ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇకపోతే ఈ సినిమాలో హీరో కమల్ హాసన్ తో పాటు విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్ కీలక పాత్రలో నటించారు.

ఇక ఈ సినిమా తెలుగు తమిళ హిందీ ఇంగ్లీష్ భాషలలో విడుదలయ్యే ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది. గత నాలుగు సంవత్సరాల నుంచి కమలహాసన్ వెండితెరకు దూరమయ్యారు. ఈ క్రమంలోనే విక్రమ్ సినిమా ద్వారా ఆ లోటును భర్తీ చేసినట్లు తెలుస్తోంది.ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది.

ఇకపోతే యాక్షన్ థ్రిల్లర్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమా సుమారు 120 కోట్ల బడ్జెట్ తో కమల్ హాసన్ నిర్మించారు. ఇకపోతే ఈ సినిమాలో మరొక కోలీవుడ్ స్టార్ హీరో సూర్య క్లైమాక్స్ సన్నివేశంలో ఐదు నిమిషాల పాటు ప్రేక్షకులను సందడి చేశారు. ఇక ఈ ఐదు నిమిషాలు సూర్య నటన అద్భుతమనే చెప్పాలి. ఈ పాత్రలో సూర్య నటించిన అందుకు ఏ స్థాయిలో రెమ్యూనరేషన్ తీసుకున్నారనే విషయం గురించి పెద్దఎత్తున చర్చలు జరుగుతున్నాయి.

కల నెరవేరిందంటున్న సూర్య…

ఇకపోతే ఈ సన్నివేశంలో నటించేందుకు సూర్య ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా నటించారని సమాచారం. సూర్య ఎప్పటికైనా కమల్ హాసన్ తో కలిసి సిల్వర్ స్క్రీన్ షేర్ చేసుకోవాలనేది తన కలని తన కల విక్రమ్ సినిమా ద్వారా నెరవేరింది అంటూ కమల్ హాసన్ కి సూర్య ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే.విక్రమ్ సినిమాతో తన కల నెరవేరడంతో ఈ సినిమాలో నటించినందుకు సూర్య ఒక్క రూపాయి కూడా రెమ్యూనరేషన్ తీసుకోలేదు.

Ali – Vikram: ఆలీ సినిమాలో విక్రమ్ విలన్ గా నటించారని మీకు తెలుసా..?

Ali – Vikram: తమిళ స్టార్ హీరో చియాన్ విక్రమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిన్నచిన్న క్యారెక్టర్లు చేస్తూ.. స్టార్ గా ఎదిగాడు. శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘ అపరిచితుడు’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. అంతకు ముందు కూడా విక్రమ్ పలు తెలుగు సినిమాల్లో నటించాడు. సేతు సినిమాతో తమిళంలో భారీ హిట్ కొట్టాడు. పితామగన్ తెలుగులో శివపుత్రుడు సినిమాకు ఏకంగా నేషనల్ అవార్డ్ నే గెలుచుకున్నాడు విక్రమ్. 

Ali – Vikram: ఆలీకి విలన్ గా చియాన్ విక్రమ్ నటించిన సంగతి మీకు తెలుసా..?

విక్రమ్ ముందుగా చోళా టీ, టవీఎస్ ఎక్సెల్, ఆల్విన్ వాచెస్‌కు మోడల్‌గా పనిచేసారు. ఆ తర్వాత ఓ టీవీ సీరియల్‌లో నటించారు. అటు తెలుగులో అక్కినేని నాగేశ్వరరావు, హరీష్ హీరోలుగా నటించిన ‘బంగారు కుటుంబం’లో నటించారు. కానీ అప్పటికే తమిళంలో ‘ఎన్ కాదల్ కణ్మణి’ చిత్రంలో హీరోగా నటించారు. అటు ‘అక్క పెత్తనం చెల్లెలు కాపురం’, ‘చిరునవ్వుల వరమిస్తావా’, ‘ఆడాళ్ల మజాకా’, మెరుపు, అక్కా బాగున్నావా, ఊహా, కుర్రాళ్ల రాజ్యం’, 9 నెలలు వంటి చిత్రాల్లో నటించారు.

Ali – Vikram: ఆలీకి విలన్ గా చియాన్ విక్రమ్ నటించిన సంగతి మీకు తెలుసా..?

ఈ సినిమాలోనే అలీకి విలన్ గా చియాన్ విక్రమ్:

ఇదిలా ఉంటే కమెడియన్ ఆలీ మాట్లాడుతూ… నా సినిమాలో విక్రమ్ విలన్ గా చేశాడని అన్నాడు. ‘ఆలీతో సరదాగా’ షోకు గెస్ట్ గా తెలుగు, తమిళ నటుడు శ్రీరామ్ ముఖ్య అతిథిగా వచ్చిన సందర్భంలో ఈ విషయాన్ని వెల్లడించారు ఆలీ. అసలు ఆలీ హీరోగా.. విక్రమ్ విలన్ గా చేసిన సినిమా ఏమిటబ్బా అని అనుకుంటున్నారా..? అయితే ఈ వివరాల్లోకి వెళ్లాల్సిందే. ఒకప్పుడు కమెడియన్ ఆలీ ఇటు కమెడియన్ గా నటిస్తూనే… హీరోగా కొన్ని సినిమాల్లో యాక్ట్ చేసిన విషయం తెలిసిందే.  ఆలీ హీరోగా నటించిన ‘ఊహా’ చిత్రంలో విక్రమ్ విలన్‌గా  నటించారు. ఆలీని ఢీ కొట్టే విలన్ పాత్రలో చియాన్ అదిరిపోయే యాక్టింగ్ చేశారు.

మరో తమిళ స్టార్ హీరోకు కరోనా పాజిటివ్.. పెరుగుతున్న కేసులు..ఆందోళనలో ప్రజలు!

కరోనా మహమ్మారి ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతుందని అంతా సంతోషపడుతున్న సమయంలో ఒమిక్రాన్‌ మళ్లీ జనాలను భయబ్రాంతులకు గురి చేస్తుంది. సామాన్యుడి నుంచి సెలెబ్రిటీల వరకు ఎవరినీ వదిలి పెట్టడం లేదు. ఇటీవలే లోకనాయకుడు కమల్ హాసన్, బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్ , యాక్షన్ కింగ్ అర్జున్ కరోనా బారిన పడిన విషయం తెలిసిందే.

వాళ్లంతా ప్రస్తుతం క్వారంటైన్ లో ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు. తాజాగా తమిళ స్టార్‌ హీరో విక్రమ్‌ కరోనా బారిన పడ్డారు. గత రెండు రోజులుగా హై ఫీవర్ తో బాధపడుతున్న విక్రమ్ కోవిడ్ పరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటివ్ అని తేలింది. దాంతో ఆయన అభిమానులు కాస్త ఆందోళనకు గురవుతున్నారు.

అయితే కరోనా పరీక్షలు చేయించకున్న వారికి ఒక వేళ పాటిజివ్ వస్తే.. దానిని టెస్టుల కొరకు కొంత సమయం తీసుకుంటున్నారు. ఒమిక్రాన్ వైరస్ లాంటివి ఏమైనా సోకిందా అనే కోణంలో పరీక్షించడానికి జీనోమ్ సీక్వెన్సింగ్ టెస్టుకు పంపిస్తున్నారు. అయితే విక్రమ్ కు సోకిందా కరోనా.. ఒమిక్రాన్ అనేది వైద్యులు నిర్ధారించలేదు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని విక్రమ్‌ మేనేజర్‌ సూర్యనారాయణ తెలిపారు.

అతడి రిపోర్టును కూడా జీనోమ్ కు పంపించనట్లు తెలుస్తోంది. ఇక హీరో విక్రమ్ త్వరగా కోలుకోవాలని సినీ ప్రముఖులు ట్వీట్లు చేస్తున్నారు. రెండు మూడు రోజుల నుంచి ఈ మమమ్మార కేసులు మళ్లీ పెరుగుతుండటం.. సినీ ప్రముఖులకు వదలకపోవడంతో సినీ వర్గాలు కాస్త ఆందోళనకు గురవుతున్నారు.
దీనిపై ప్రతీ ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని కరోనా నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు.