Tag Archives: wedding

Venkatesh: ఘనంగా వెంకటేష్ కుమార్తె హయవాహిని నిషాంత్ పెళ్లి వేడుకలు.. ఫోటోలు వైరల్!

Venkatesh: టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం వెడ్డింగ్ బెల్స్ మోగుతున్నాయి. ఎంతోమంది సినీ సెలబ్రిటీలు పెళ్లిళ్లు చేసుకోగా, మరికొందరు పెళ్లి చేసుకోవడానికి సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతూ ఉన్నటువంటి వారిలో నటుడు వెంకటేష్ ఒకరు. ఈయన తన రెండో కుమార్తె హయవాహిని వివాహపు వేడుకలు మార్చి 15వ తేదీ ఎంతో ఘనంగా జరిగాయి.

వెంకటేష్ కు ముగ్గురు కుమార్తెలు ఒక కుమారుడు అనే విషయం మనకు తెలిసిందే. ఇదివరకే తన పెద్ద కుమార్తె వివాహం కూడా జరిపించారు. అయితే తాజాగా తన రెండవ కుమార్తె హయవాహిని వివాహం విజయవాడకు చెందిన ప్రముఖ డాక్టర్ కుమారుడు నిషాంత్ అనే వ్యక్తికి ఇచ్చి ఎంతో అంగరంగ వైభవంగా వివాహం జరిపించారు.

గత ఏడాది అక్టోబర్ నెలలో వీరి నిశ్చితార్థపు వేడుకలు విజయవాడలో జరిగాయి. ఈ వేడుకలకు చిరంజీవి మహేష్ బాబు నాగచైతన్య వంటి వారందరూ హాజరై సందడి చేశారు. అయితే తాజాగా వీరి వివాహం రామానాయుడు స్టూడియోలో ఎంతో ఘనంగా జరిగింది.

రామానాయుడు స్టూడియో..

ఈ పెళ్లి వేడుకలలో భాగంగా కేవలం అత్యంత సన్నిహితులు కుటుంబ సభ్యులు మాత్రమే పాల్గొన్నారని తెలుస్తోంది. తాజాగా నిషాంత్ హయవాహిని వివాహ వేడుకలకు సంబంధించినటువంటి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో వెంకటేష్ అభిమానులు ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Niharika: నిహారిక వెంకట చైతన్య విడిపోతారని ముందే ఆ వ్యక్తికి తెలుసా.. అందుకే పెళ్లిలో అలా?

Niharika: మెగా డాటర్ నిహారిక ఇండస్ట్రీకి యాంకర్ గా పరిచయం అయ్యారు. ఇలా యాంకర్ గా పరిచయమైనటువంటి ఈమె అనంతరం హీరోయిన్గా కూడా అవకాశాలు అందుకున్నారు. ఇక నిహారిక హీరోయిన్ అవడం మెగా అభిమానులకు ఏమాత్రం ఇష్టం లేకపోవడంతో ఈమెను పెద్దగా సక్సెస్ చేయలేకపోయారు. దీంతో నిహారిక ఇండస్ట్రీలో సక్సెస్ సాధించలేకపోయారు.

నిహారిక హీరోయిన్ గా సక్సెస్ కాకపోవడంతో తన కుటుంబ సభ్యులు తల్లితండ్రులు తనకు మంచి సంబంధం చూసి పెళ్లి చేసే అత్తారింటికి పంపారు. ఈ విధంగా నిహారిక జొన్నలగడ్డ వెంకట చైతన్య అనే వ్యక్తితో ఏడడుగులు నడిచారు. వీరి వివాహం ఉదయపూర్ ప్యాలెస్ లో ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది.

ఇక పెళ్లి తర్వాత రెండు సంవత్సరాలకి వీరిద్దరు విడాకులు తీసుకొని విడిపోయారు. ఇలా విడాకులు తీసుకున్నటువంటి నిహారిక ప్రస్తుతం కెరియర్ పై ఫోకస్ పెట్టి వరుస సినిమాలలో నటిస్తూ అలాగే నిర్మిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. తాజాగా నిహారిక విడాకులకు సంబంధించి ఒక వార్త వైరల్ గా మారింది. నిహారిక పెళ్లికి ముందే వెంకట చైతన్య తన జాతకాన్ని పంతులకు చూపించడంతో వీరిద్దరి జాతకంలో దోషం ఉందని దోష పరిహార పూజలు చేయాలని చెప్పారట.

జాతకంలో దోషం..
ఈ విధంగా దోష పరిహార పూజ చేయకపోతే వీరి దాంపత్య జీవితంలో ఇబ్బందులు వస్తాయని ముందుగానే చెప్పినప్పటికీ వీటిని ఏమాత్రం నమ్మని నాగబాబు ఈ వ్యాఖ్యలను తోసిపుచ్చారట. అందుకే ఈయన పెళ్లిలో పంతులు చెప్పినట్టు పరిహారపు పూజలను చేయకుండా పెళ్లి చేసేసారు. ఇలా జాతకంలో దోషము ఉందని తెలిసిన చేయకపోవడంతో వారికి ఇబ్బందులు వస్తాయని తెలిసిన నాగబాబు తన కుమార్తె పెళ్లి చేశారని తెలుస్తుంది.

Nagarjuna: కోట్ల రూపాయలు ఇస్తూ పెళ్లిళ్లకు రమ్మని పిలుస్తున్నారు.. నాగార్జున కామెంట్స్ వైరల్!

Nagarjuna: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటుడు నాగార్జున ఒకరు. అక్కినేని వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినటువంటి నాగార్జున ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఇప్పటికి నాగర్జున వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా గడుపుతున్నారు.

ఇదిలా ఉండగా తాజాగా నాగార్జునకు సంబంధించిన ఒక ఓల్డ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో భాగంగా నాగార్జున మాట్లాడుతూ ప్రస్తుతం ఒక బిజినెస్మెన్ ఇంట్లో కనుక పెళ్లి జరిగితే పెద్ద ఎత్తున సెలెబ్రిటీలను ఆహ్వానిస్తూ ఉంటారు అయితే సెలబ్రిటీలకు కొన్ని కోట్ల రూపాయలు రెమ్యూనరేషన్ ఇచ్చి వారిని పెళ్లికి ఆహ్వానిస్తున్నారని తెలిపారు.

కేవలం 20 నిమిషాలు పెళ్లిలో కనిపించి ఒక ఐదు నిమిషాల పాటు పెర్ఫార్మెన్స్ చేస్తే చాలు వారికి కోట్లలో డబ్బులు చెల్లిస్తున్నారంటూ ఈయన చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. గతంలో తనకి కూడా ఇలాంటి ఆహ్వానాలు అందాయని కానీ తాను మాత్రం వెళ్లలేదని నాగార్జున తెలిపారు.

డబ్బు తీసుకొని వస్తున్నారు…
ఇక ఇటీవల ముఖేష్ అంబానీ కుమారుడు పెళ్లి వేడుకలలో పెద్ద ఎత్తున బాలీవుడ్ సెలబ్రిటీలు మూడు రోజుల పాటు సందడి చేసిన సంగతి తెలిసిందే దీంతో వీరందరూ కూడా రెమ్యూనరేషన్ తీసుకొని అక్కడికి వచ్చారని వాదన వినిపిస్తున్నటువంటి తరుణంలో నాగార్జున చేసినటువంటి కామెంట్స్ కి సంబంధించిన ఓల్డ్ వీడియోని కూడా వైరల్ చేస్తున్నారు.

Varun Tej: మా పెళ్లి ఇటలీలో జరగడానికి అదే కారణం.. వరుణ్ తేజ్ కామెంట్స్ వైరల్!

Varun Tej: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ త్వరలోనే ఆపరేషన్ వాలెంటైన్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ సినిమా మార్చ్1వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి తరుణంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా వేగవంతం చేస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు.

ఇదిలా ఉండగా ఇటీవల వరుణ్ తేజ్ నటి లావణ్య త్రిపాఠిని ఎంతో ఘనంగా వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. గత కొన్ని సంవత్సరాలుగా ప్రేమలో ఉన్నటువంటి ఈ జంట గత ఏడాది నవంబర్ ఒకటవ తేదీ ఇటలీలో కుటుంబ సభ్యుల సమక్షంలో ఎంతో ఘనంగా వివాహం చేసుకున్నారు.

ఇలా వీరి వివాహం ఇటలీలో జరగడం పట్ల ఎంతోమంది వివిధ రకాలుగా కామెంట్లు చేశారు. అయితే తాజాగా వరుణ్ తేజ్ తమ పెళ్లి ఇటలీలో జరగడానికి గల కారణం ఏంటి అనే విషయాలను వెల్లడించారు. మా పెళ్లి కనుక ఇండియాలో జరిగే ఉంటే అమ్మానాన్నలు వచ్చే గెస్ట్ లను రిసీవ్ చేసుకోవడానికి సరిపోయేది వారు మా పెళ్లిని కన్నులారా చూడలేరు. అలాగే పెళ్లిని ఎంజాయ్ చేయలేరు అందుకే మేము ఇటలీలో వెడ్డింగ్ ప్లాన్ చేసామని తెలిపారు.

వెకేషన్ లో ఎంజాయ్ చేయాలి..

మా పెళ్లిలో మా ఫ్యామిలీ మొత్తం ఒక వెకేషన్ లా ఎంజాయ్ చేయాలన్న ఉద్దేశంతోనే ఇలా ప్లాన్ చేశామని అంతకుమించి మరే కారణాలు లేవని వరుణ్ తేజ్ తెలిపారు. ఇక ఇటలీలో తమ పెళ్లి వేడుకలను ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేశారని తక్కువ మంది ఉంటేనే పెళ్లి చాలా కూల్ గా ఉంటుందని ఈ సందర్భంగా వరుణ్ తేజ్ చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Actress Radha: సినీ నటి రాధ తన కుమార్తెకు ఎన్ని కోట్ల రూపాయల కట్నం ఇచ్చిందో తెలుసా?

Actress Radha: సినిమా ఇండస్ట్రీలో సీనియర్ నటిగా ఎంతో మంచి సక్సెస్ అయినటువంటి నటి రాధా గురించి పరిచయం అవసరం లేదు ఒకానొక సమయంలో ఈమె తెలుగు తమిళ భాష చిత్రాలలో నటిస్తూ స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందారు. ఇలా సౌత్ ఇండస్ట్రీలో అగ్రతారగా ఓ వెలుగు వెలిగినటువంటి రాధా పెళ్లి తర్వాత సినిమాలకు దూరమయ్యారు.

ఇలా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నటువంటి ఈమె తన పెద్ద కుమార్తె కార్తీకను ఇండస్ట్రీకి హీరోయిన్గా పరిచయం చేశారు. నాగచైతన్య హీరోగా నటించిన జోష్ సినిమా ద్వారా హీరోయిన్గా ఈమె కూడా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఇలా పలు సినిమాలలో నటించిన కార్తీక ఇండస్ట్రీలో అనుకున్న స్థాయిలో సక్సెస్ రాలేకపోయింది. దీంతో ఈమె సినిమాలకు గుడ్ బై చెప్పి తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించే పనిలో పడ్డారు అయితే వ్యాపార రంగంలో మాత్రం మంచి సక్సెస్ అందుకున్నారు.

ఇక ఇటీవల కార్తీక రోహిత్ మీనన్ అనే వ్యాపారవేత్తను ఎంతో ఘనంగా కేరళలో వివాహం చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. వీరి వివాహ ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అయితే ఈ పెళ్లి వేడుకలలో భాగంగా అందరి చూపు కార్తిక వేసుకున్న నగలపైనే ఉంది. ఈమె ఒంటినిండా చాలా పెద్ద పెద్ద నగలను ధరించి కనపడటంతో అసలు కార్తీకకు తన తల్లి ఎంత మొత్తంలో కట్న కానుకలు ఇచ్చారన్న సందేహాలు అందరిలోనూ తలెత్తాయి.

కోట్లు విలువచేసే కట్న కానుకలు..

సోషల్ మీడియాలో వస్తున్నటువంటి కథనాల ప్రకారం రాదా తన కుమార్తె కోసం భారీ స్థాయిలోనే కట్న కానుకలు ఇచ్చారట. సినిమాల నుంచి తప్పుకున్నటువంటి కార్తిక దుబాయిలో ఒక రెస్టారెంట్ బాధ్యతలను పూర్తిగా తీసుకొని నిర్వహించేవారు. అయితే ఈ రెస్టారెంట్ ను పూర్తిగా తన పేరు మీద రాసిచ్చారని తెలుస్తుంది. దీనితోపాటు తన అల్లుడి కోసం కోట్లు విలువ చేసే ఖరీదైన కారుని కూడా ఇచ్చారట. అలాగే 30 కోట్లకు పైగా విలువచేసే బంగారు వజ్రభరణాలను కూడా కానుకగా ఇచ్చారని తెలుస్తోంది. ఏది ఏమైనా కూతురికి మాత్రం భారీ స్థాయిలోనే ఈమె కట్న కానుకలు ఇచ్చారని చెప్పాలి.

Varuntej-Lavanya Tripati: ఎక్కడ ప్రేమ పుట్టిందో అక్కడే ఒకటి కాబోతున్న వరుణ్ తేజ్ లావణ్య… పెళ్లి ఎక్కడంటే?

Varuntej-Lavanya Tripati: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ త్వరలోనే ఓ ఇంటి వాడు కాబోతున్నారు.ఇండస్ట్రీలో హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వరుణ్ తేజ్ నటించిన లావణ్య త్రిపాఠితో రహస్య ప్రేమాయణం నడిపారు.వీరిద్దరి ప్రేమ గురించి ఎన్నో రకాల వార్తలు వచ్చిన ఆ వార్తలు నిజం కాదంటూ ఖండించే ప్రయత్నం చేశారు కానీ ప్రేమ విషయాన్ని మాత్రం బయటపడనివ్వలేదు.

ఇలా రహస్యంగా గత ఏడు సంవత్సరాలుగా ప్రేమలో ఉన్నటువంటి ఈ జంట చివరికి ప్రేమ విషయాన్ని బయట పెడుతూ ఎంతో అంగరంగ వైభవంగా ఇద్దరు కుటుంబ సభ్యుల సమక్షంలో నిశ్చితార్థం జరుపుకున్నారు. ఇలా వీరి నిశ్చితార్థ వేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇక వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి నిశ్చితార్థం పూర్తి కావడంతో వీరి వివాహం గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. అయితే వీరిద్దరూ మాత్రం తమ ప్రేమకు బీజం పడిన చోటే పెళ్లి కూడా జరగాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక వీరిద్దరూ కలిసి మిస్టర్ అంతరిక్షం అనే రెండు సినిమాలలో నటించారు. ఇలా వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన మొట్టమొదటి చిత్రం మిస్టర్. ఈ సినిమా సమయంలోనే ఇద్దరి మధ్య ప్రేమ చిగురించిందని తెలుస్తోంది.

Varuntej-Lavanya Tripati: డెస్టినేషన్ వెడ్డింగ్…


ఇలా ఈ సినిమా షూటింగ్లో భాగంగా వీరిద్దరూ ఇటలీ వెళ్ళగా అక్కడే ఇద్దరి మధ్య ప్రేమ చిగురించిందని అందుకే తమకు ఇటలీ చాలా ప్రత్యేకమైనదనీ చెప్పాలి.ఇలా తమ ప్రేమ చిగురించినచోటే తమ పెళ్లి జరగాలని భావించిన ఈ జంట ఇటలీలోనే డెస్టినేషన్ వెడ్డింగ్ జరుపుకోవాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది. మరి వీరి వివాహం గురించి త్వరలోనే ప్రకటన రాబోతుందని తెలుస్తుంది.

Keerthy Suresh: పెళ్లి గురించి నాకు లేని తొందరగా మీకెందుకు…. పెళ్లి వార్తలపై అసహనం వ్యక్తం చేసిన కీర్తి సురేష్!

Keerthy Suresh:దక్షిణాది సినీ ఇండస్ట్రీలో నటిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి కీర్తి సురేష్ ప్రస్తుతం తెలుగు తమిళ భాషలలో సినిమాలు చేస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.ఇలా వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నటువంటి కీర్తి సురేష్ తరచూ తన పెళ్లి గురించి వార్తల్లో నిలుస్తున్నారు. ఇలా ఈమె పెళ్లి గురించి రోజు ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంది.

గత కొద్ది రోజుల క్రితం ఈమె ఒక అబ్బాయి తో కలిసి దిగిన ఫోటోని షేర్ చేశారు. ఈ ఫోటోలు ఇద్దరు ఒకే రంగు దుస్తులను వేసుకోవడంతో కీర్తి సురేష్ పెళ్లి చేసుకోబోయే అబ్బాయి తానేనని పెద్ద ఎత్తున వార్తలను సృష్టించారు.ఈ వార్తలపై కీర్తి సురేష్ క్లారిటీ ఇచ్చారు. అయినా వార్తలు ఆగకపోవడంతో తన తండ్రి కూడా స్పందించి క్లారిటీ ఇచ్చారు.

ఇకపోతే తాజాగా ఈమె తమిళంలో ఉదయినిది స్టాలిన్ తో కలిసి నటించిన సినిమా విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే కీర్తి సురేష్ మరోసారి తన పెళ్లి గురించి మాట్లాడుతూ కొంత పాటి అసహనం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కీర్తి సురేష్ మాట్లాడుతూ తరచూ తన పెళ్లి గురించి ప్రస్తావన రావడం తనకు ఇబ్బందిగా మారిందని తెలిపారు.

Keerthy Suresh: నేనే చెబుతాను…

ఇదివరకే పెళ్లి గురించి తాను ఎన్నోసార్లు క్లారిటీ ఇచ్చాను అయినా నా పెళ్లి గురించి మీ ఆసక్తి ఏంటి అంటూ ఈమె అసహనం వ్యక్తం చేశారు.పెళ్లి సెట్ అయితే నేనే ఈ విషయాన్ని స్వయంగా అందరికీ చెబుతానని అంతవరకు ఈ ప్రశ్న ఎవరు తనని అడగవద్దు అంటూ ఈ సందర్భంగా మరోసారి పెళ్లి గురించి కీర్తి సురేష్ చేసినటువంటి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Upasana: పెళ్లి సమయంలో నన్ను బాడీ షేమింగ్ ట్రోల్ చేశారు… డబ్బు కోసమే చరణ్ పెళ్లి చేసుకున్నారు: ఉపాసన

Upasana: ఉపాసన కామినేని పరిచయం అవసరం లేని పేరు ఉపాసన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వివాహం చేసుకొని కొనిదెల ఇంటి కోడలుగా అడుగుపెట్టారు. ఇలా మెగా కోడలుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఉపాసన బిజినెస్ ఉమెన్ గా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ఇలా రాంచరణ్ ఉపాసన దంపతులు ఎందరికో ఆదర్శంగా నిలిచారని చెప్పాలి.

ఇకపోతే వీరిద్దరూ వివాహం చేసుకొని పది సంవత్సరాలు పూర్తి అయింది. ఈ క్రమంలోనే ఈ దంపతులు పది సంవత్సరాలకు తల్లిదండ్రులు కాబోతున్నారని శుభవార్త అభిమానులను ఎంతో సంతోషానికి గురి చేసింది ఇక బుల్లి మెగా వారసుడు కోసం ఒకవైపు కుటుంబ సభ్యులతో పాటు మరొకవైపు అభిమానులు కూడా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

ఇకపోతే ఇటీవల ఒక మీడియా ఛానల్ తో ముచ్చటించిన ఉపాసన తన గురించి వస్తున్నటువంటి విమర్శలపై స్పందించారు. ఈ సందర్భంగా ఉపాసన మాట్లాడుతూ రామ్ చరణ్ తనకు ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా పరిచయమయ్యారని తెలిపారు. ఇలా ఏర్పడిన మా పరిచయం స్నేహంగా మారి ఆ స్నేహం ప్రేమగా మారిందని తెలిపారు.ఇక మా రెండు కుటుంబాలు విభిన్న నేపథ్యాలు అయినప్పటికీ ఒకరిపై ఒకరికి ఉన్నటువంటి నమ్మకం గౌరవంతో మా పెళ్లి జరిగిందని తెలిపారు.

Upasana:అందంగా లేను అన్నారు..

ఇక పెళ్లి సమయంలో నేను కాస్త లావుగా ఉండడంతో పెద్ద ఎత్తున తనని బాడీ షేమింగ్ ట్రోల్స్ చేశారని ఆవేదన చెందారు. తాను లావుగా ఉన్నానని అందంగా లేనని కామెంట్ చేశారు ఇక మరికొందరైతే ఏకంగా చరణ్ నన్ను కేవలం డబ్బు కోసమే పెళ్లి చేసుకున్నారు అంటూ విమర్శలు చేశారని ఈమె తెలియజేశారు.అయితే ఆ విమర్శలను పట్టించుకోని తాను బాధపడలేదని ధైర్యంతో ముందడుగు వేసానని తెలిపారు. అయితే అప్పుడు విమర్శించిన వాళ్ళే ఇప్పుడు తనపై ప్రశంసలు కురిపిస్తున్నారు అంటూ ఈ సందర్భంగా ఉపాసన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Manchu Manoj: ఘనంగా మనోజ్ మౌనికల వివాహం… ఆ పుకార్లలకు చెక్ పెట్టిన మోహన్ బాబు!

Manchu Manoj: మంచు మనోజ్ భూమా మౌనికల వివాహం ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది.వీరి వివాహం ఫిలింనగర్ లోని మంచు లక్ష్మీ నివాసంలో కేవలం ఇరు కుటుంబ సభ్యులు అత్యంత సన్నిహితుల సమక్షంలో వీరి వివాహం ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది.ఇక ఈ వివాహ వేడుకలలో భాగంగా మంచు కుటుంబ సభ్యులతో పాటు భూమా కుటుంబ సభ్యులు కూడా హాజరయ్యారు.

ప్రస్తుతం వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇకపోతే మంచు మనోజ్ భూమ మౌనికను రెండో పెళ్లి చేసుకోవడానికి ఇష్టం లేనటువంటి మోహన్ బాబు తన పెళ్లికి దూరంగా ఉంటున్నారని పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి.

ఇలా మోహన్ బాబుకు మనోజ్ మౌనికను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకపోవడంతోనే మనోజ్ పెళ్లి బాధ్యతులను లక్ష్మీ ప్రసన్న తీసుకొని పూర్తిగా తన పెళ్లి పనులు అన్నిటిని తానే దగ్గరుండి నిర్వహించారని తెలుస్తోంది అయితే నిన్న రాత్రి 8:30కు మనోజ్ మౌనికల వివాహం ఎంతో ఘనంగా జరిగింది ఇక ఈ పెళ్లి వేడుకలలో భాగంగా మంచు మోహన్ బాబు పెళ్లి వేడుకలకు హాజరయ్యి సోషల్ మీడియాలో తన గురించి వస్తున్నటువంటి పుకార్లకు చెక్ పెట్టారు.

Manchu Manoj: కొత్త జంటను ఆశీర్వదించిన మోహన్ బాబు…


ఈ విధంగా మోహన్ బాబు దంపతులతో పాటు విష్ణు కూడా ఈ పెళ్లికి హాజరయ్యారు. ఇక మోహన్ బాబు దంపతులు నూతన వధూవరులను ఆశీర్వదించారు ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అభిమానులు కూడా ఈ దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Naresh -Pavitra Lokesh: పెళ్ళి పీటల వరకు వెళ్ళిన నరేశ్, పవిత్రా లోకేశ్…. ఆరు పదుల వయసులో నాలుగో పెళ్లి!

Naresh -Pavitra Lokesh: ప్రముఖ హీరోయిన్ విజయనిర్మల తనయుడు నరేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా హీరోగా ఎన్నో సినిమాలలో నటించిన మంచి గుర్తింపు పొందిన నరేష్ ఇటీవల తరచూ వార్తల్లో నిలుస్తున్నాడు. ఎందుకంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్ పవిత్ర లోకేష్ తో నరేష్ కి ఉన్న సంబంధం వల్ల తరచూ వార్తల్లో నిలుస్తున్నాడు. కొంతకాలం వీరిద్దరి మధ్య ఉన్న రిలేషన్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది.

ఇక నరేష్ తన మూడవ భార్యకి విడాకులు ఇవ్వకుండా పవిత్ర లోకేష్ తో సహజీవనం చేయటంతో ఈ విషయం రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయంగా మారింది.
కొన్ని రోజులుగా బయట ఎక్కడ కనిపించని నరేష్ తాజాగా పవిత్ర లోకేష్ తో కలిసి ఉన్న వీడియో షేర్ చేయటంతో మళ్లీ వీరిద్దరి రిలేషన్ గురించి వార్తలు వైరల్ అవుతున్నాయి. అంతేకాకుండా నరేష్ పవిత్ర లోకేష్ ని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడినట్లు ప్రకటించటంతో వీరి పెళ్లి టాపిక్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

ఇదివరకే నరేష్ మూడు పెళ్లిళ్లు చేసుకుని ముగ్గురు భార్యలకు దూరంగా ఉంటున్నాడు. గత మూడు సంవత్సరాలుగా పవిత్ర లోకేష్ తో సహజీవనం చేస్తున్న నరేష్ తాజాగా తనని పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించాడు. అంతేకాకుండా పవిత్ర లోకేష్ నరేష్ ముద్దు పెట్టుకున్న ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. నటుడిగా మంచి గుర్తింపు పొందిన నరేష్ మొదట సినిమాటోగ్రాఫర్ శ్రీను కుమార్తెను వివాహం చేసుకొని ఒక కొడుకు పుట్టిన తర్వాత ఆమెకు విడాకులు ఇచ్చాడు. ఆ తర్వాత ప్రముఖ రచయిత దేవులపల్లి కృష్ణశాస్త్రి మనవరాలిని రెండవ వివాహం చేసుకొని ఆమెకు ఒక కొడుకు పుట్టిన తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో విడాకులు తీసుకుని దూరమయ్యారు.

Naresh -Pavitra Lokesh: ముగ్గురు భార్యలకు విడాకులు ఇచ్చిన నరేష్…

ఇక మాజీ మంత్రి రఘువీరారెడ్డి చెల్లెలి కుమార్తె రమ్య రఘుపతిని మూడవ వివాహం చేసుకున్న నరేష్ కొంతకాలం తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావటంతో ఆమెకు కూడా దూరంగా ఉంటున్నాడు. ఈ క్రమంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా గుర్తింపు పొందిన పవిత్ర లోకేష్ తో కొంతకాలంగా సహజీవనం చేస్తున్న నరేష్ ఇప్పుడు నాలుగవ పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డాడు. అయితే ఇలా ఆరుపదుల వయసులో నాలుగో వివాహం చేసుకోవడానికి సిద్ధపడటంతో నరేష్ ని తెగ ట్రోల్ చేస్తున్నారు.