ఈ ఆయుర్వేద చికిత్సలతో.. వర్షాకాల వ్యాధులకు చెక్ పెట్టండిలా!

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా రెండవ దశ నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతూ మూడవ దశ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే ప్రస్తుతం వర్షాకాలం మొదలవడంతో ఎన్నో రకాల వ్యాధులు మనల్ని వెంటాడుతాయి. అయితే ఈ విధమైనటువంటి వ్యాధుల్ని ఎదుర్కోవడం కోసం ఎన్నో జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ఈ విధమైనటువంటి వ్యాధులను ఎదుర్కోవడానికి ఆయుర్వేద చికిత్స ఒకటని చెప్పవచ్చు.ఈ వర్షాకాలంలో మన శరీరంలో రోగ నిరోధక శక్తి బలహీనపడటం ఎన్నో రకాల అంటు వ్యాధులకు కారణమవుతుంది. కనుక ఈ ఆయుర్వేద చికిత్స విధానాన్ని అనుసరించి ఈ విధమైనటువంటి వ్యాధులకు చెక్ పెట్టవచ్చు.

సాధారణంగా మనం ఇంట్లో అప్పుడప్పుడు తైలమర్దన చేస్తుంటాము. ఈ విధంగా మర్దనా చేయటం వల్ల మన శరీరంలో రక్తప్రసరణ పెరుగుదల, శరీరంలో మలినాలు విసర్జితమవుతాయి. ఈ క్రమంలోనే మన శరీరంలోని కణాలకు శక్తి ఉత్తేజితం అవుతుంది తద్వారా మనకు ఎంతో సుఖనిద్ర పడుతుంది. ఈ విధంగా మనం శరీరమంతటా మర్దనా చేయటం కోసం ఏదైనా నూనెలను లేదా సున్నిపిండితో మర్థన చేయడాన్ని ఆయుర్వేద భాషలో అభ్యంగన స్నానం అని పిలుస్తారు.

ఎవరైతే అధిక బరువు,ఒంట్లో నీరు నిల్వ ఉండిపోవడం, నిస్తేజం, రక్తప్రసరణ లోపం ఉంటుందో అలాంటివారు
ఉద్ఘర్షణ చికిత్స చేయించుకోవడం వల్ల దీర్ఘకాలంలో శరీరంలోని పేరుకుపోయిన కలుషితాలన్నీ విరిగి రక్తప్రవాహంలో కలుస్తాయి. దీని ఫలితంగా కొవ్వు కరగడంతో పాటు శరీర బరువు తగ్గుతారు.

అదేవిధంగా తల అధిక బరువు, జలుబు వంటి సమస్యలతో బాధపడే వారికి శిరోధార చికిత్స అందిస్తారు. వివిధ రకాల తైలాలతో తలకు జుట్టు బాగా మర్దన చేయడం వల్ల తల భారం తగ్గి,మెదడులో సెరటోనిన్‌, డోపమైన్‌ హార్మోన్లు సక్రమంగా స్రవించడం వల్ల మెదడు పనితీరు మెరుగుపడుతుంది.