ఆంధ్రప్రదేశ్‌లోని తిరుమలలో భక్తులకు అందించే ప్రసాదాల నాణ్యతను మరింత మెరుగుపర్చే దిశగా కీలక ముందడుగు పడింది. నారా చంద్రబాబు నాయుడు శనివారం అత్యాధునిక ఫుడ్ మరియు వాటర్ విశ్లేషణ కేంద్రాన్ని ప్రారంభించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సహకారంతో నిర్మించిన ఈ ల్యాబ్ భక్తులకు అందించే ఆహార నాణ్యతను నిరంతరం పర్యవేక్షించడానికి ఉపయోగపడనుంది.
సుమారు రూ.25 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ ల్యాబ్‌లో ప్రసాదాల తయారీలో ఉపయోగించే నెయ్యి, పప్పులు, ఇతర ముడి పదార్థాల నాణ్యతను పరీక్షించనున్నారు. భక్తులకు అత్యుత్తమ ప్రమాణాలతో కూడిన ఆహారం అందించాలనే లక్ష్యంతో ఈ సదుపాయం అందుబాటులోకి తెచ్చినట్లు అధికారులు తెలిపారు.
ఈ సందర్బంగా ముఖ్యమంత్రి కుటుంబ సమేతంగా శ్రీవారి దర్శనం చేశారు. ఆయనతో పాటు నారా భువనేశ్వరి, నారా లోకేశ్, బ్రహ్మణి, మనవడు దేవాన్ష్ పాల్గొన్నారు. ముఖ్యమంత్రి హోదాలో ప్రత్యేక ప్రవేశం ఉన్నప్పటికీ, సాధారణ భక్తుల్లానే క్యూలో వెళ్లి దర్శనం చేసుకోవడం మరోసారి చర్చనీయాంశమైంది.
దర్శనం అనంతరం వేద పండితుల ఆశీర్వాదాలు స్వీకరించిన సీఎం, టీటీడీ అధికారులు అందజేసిన తీర్థప్రసాదాలు తీసుకున్నారు. మనవడు దేవాన్ష్ జన్మదినాన్ని పురస్కరించుకుని అన్నదాన ట్రస్టుకు విరాళం అందజేశారు. ప్రతి ఏడాది కొనసాగిస్తున్న సంప్రదాయం మేరకు ఈసారి కూడా ఒక రోజు అన్నప్రసాదానికి అయ్యే ఖర్చును అందించారు.
తరువాత అన్నప్రసాద భవనంలో భక్తులకు స్వయంగా భోజనం వడ్డిస్తూ సేవలో పాల్గొన్నారు. భక్తులతో ముచ్చటిస్తూ వారి సమస్యలు, సౌకర్యాలపై అభిప్రాయాలు తెలుసుకున్నారు. ముఖ్యంగా లడ్డూ ప్రసాదం నాణ్యతపై భక్తులు సానుకూలంగా స్పందించారని తెలిపారు.
తిరుమలలో భక్తుల సౌకర్యాల కోసం ఇప్పటికే ఆధునిక పర్యవేక్షణ వ్యవస్థలు ఏర్పాటు చేశామని, త్వరలోనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత విధానాలతో దర్శనం మరింత వేగంగా, సులభంగా జరిగేలా చర్యలు తీసుకుంటామని సీఎం వెల్లడించారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…